Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. పోలీస్‌ కొత్త బాస్‌ ఎవరు?
ADVERTISEMENT 

పోలీస్‌ కొత్త బాస్‌ ఎవరు?

Telangana Sakshi User Sakshi Sakshi Time Sep 21, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
dgp.jpg

రేసులో శివధర్‌ రెడ్డి, సీవీ ఆనంద్‌

తదుపరి డీజీపీ ఎవరన్న అంశంపై చర్చ 

శిఖాగోయల్‌ కూడా పోటీలో..  శివధర్‌ రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గు! 

ఆనంద్‌కు విజిలెన్స్‌ డీజీ ఇచ్చే అవకాశం 

నెలాఖరున డీజీ జితేందర్‌ రిటైర్‌మెంట్‌  

ఇంటెలిజెన్స్‌ డీజీగా సజ్జనార్‌? 

దసరాకు ముందే భారీగా బదిలీలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ తదుపరి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) ఎవరన్నదానిపై పోలీస్‌ శాఖలో చర్చ జోరందుకుంది. ప్రస్తుత డీజీపీ డా.జితేందర్‌ ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత డీజీపీ (హెచ్‌ఓపీఎఫ్‌–హెడ్‌ ఆఫ్‌ పోలీస్‌ ఫోర్స్‌) పోస్టుకు ప్రధాన పోటీ సీనియర్‌ ఐపీఎస్‌లు సీవీ ఆనంద్, బి శివధర్‌రెడ్డి మధ్యే నెలకొంది. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే కావడంతో ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. 

ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న శివధర్‌రెడ్డివైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. శివధర్‌రెడ్డి 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి కాగా.. ప్రస్తుతం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్‌ 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. డీజీపీగా శివధర్‌రెడ్డిని నియమిస్తే.. సీవీ ఆనంద్‌ను విజిలెన్స్‌ డీజీగా పంపడంతోపాటు, ఏసీబీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనూ సీవీ ఆనంద్‌ ఏసీబీ, విజిలెన్స్‌ డీజీగా పనిచేశారు. 

ఇలా చేయడం వల్ల సీనియారిటీ పరమైన పొరపచ్చాలు తలెత్తకుండా డీజీపీగా శివధర్‌రెడ్డి, పోలీస్‌ శాఖతో నేరుగా సంబంధం లేకుండా ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఏసీబీ, విజిలెన్స్‌కు డీజీగా ఆనంద్‌ కొనసాగే వెసులుబాటు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. వీరితోపాటు ప్రస్తుతం డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) ర్యాంకులో 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ రవిగుప్తా, డా.సౌమ్యామిశ్రా (1994 బ్యాచ్‌ ఐపీఎస్‌), శిఖాగోయల్‌ (1994 బ్యాచ్‌ ఐపీఎస్‌), ఆప్టే వినాయక్‌ ప్రభాకర్‌ (1994 బ్యాచ్‌ ఐపీఎస్‌) కొనసాగుతున్నారు. వీరిలో రవిగుప్తా ఈ ఏడాది డిసెంబర్‌ 19న పదవీ విరమణ పొందనున్నారు. ఆప్టే వినాయక్‌ ప్రభాకర్‌ కేంద్ర సర్వీస్‌లో ఉన్నారు. మిగిలిన వారిలో శిఖాగోయల్‌ శిఖాగోయల్‌ సైతం డీజీపీ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.  

హైదరాబాద్‌ సీపీకి తీవ్ర పోటీ 
హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం సీపీ సీవీ ఆనంద్‌ బదిలీ అయితే, ఆ స్థానంలోకి ఎవరు వస్తారన్నది ఆసక్తిరంగా మారింది. ఈ పోస్టుకు ప్రధానంగా 1996 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి, ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న వీసీ సజ్జనార్, 1995 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి, ప్రస్తుతం శాంతిభద్రతల అడిషనల్‌ డీజీగా ఉన్న మహేశ్‌ భగవత్‌ ప్రధానంగా పోటీ పడుతున్నట్లు సమాచారం. 1996 బ్యాచ్‌ ఐపీఎస్, సీఐడీ చీఫ్‌ చారుసిన్హా, 1997 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులు డీఎస్‌ చౌహాన్, వై నాగిరెడ్డి అడిషనల్‌ డీజీ హోదాలో ఉన్నారు. 

వీరితోపాటు వీవీ శ్రీనివాస్, స్వాతిలక్రా, సంజయ్‌కుమార్‌ జైన్, స్టీఫెన్‌రవీంద్ర సైతం హైదరాబాద్‌ సీపీ పోస్టుకు అర్హులుగా ఉన్నారు. అయితే, వీరిలో సజ్జనార్‌ పేరు హైదరాబాద్‌ సీపీతోపాటు ఇంటెలిజిన్స్‌ డీజీ పోస్టుకు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్‌ డీజీగా 1996 బ్యాచ్‌ ఐపీఎస్‌ అనిల్‌కుమార్‌ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. 

హైదరాబాద్‌ తర్వాత అత్యంత కీలక కమిషనరేట్‌ అయిన సైబరాబాద్‌ సీపీ సైతం బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఈ పోస్టుకు ఎస్‌ఐబీ చీఫ్‌ సుమతితోపాటు ఏసీబీలో పనిచేస్తున్న తరుణ్‌జోషి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా పలు కీలక విభాగాలతోపాటు జిల్లా ఎస్పీల వరకు త్వరలో పెద్ద సంఖ్యలో అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వవర్గాల ద్వారా తెలిసింది. దసరా పండుగలోపే ఈ బదిలీలు జరిగే అవకాశం ఉందని సమాచారం.    

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Police Department
CV Anand
Shivadhar Reddy
DGP
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.