Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. అదను చూసి.. పదును పెట్టి..
ADVERTISEMENT 

అదను చూసి.. పదును పెట్టి..

Telangana Sakshi User Sakshi Sakshi Time Mar 21, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
naxals.jpg

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతా దళాల నిఘా

మావోయిస్టులే లక్ష్యంగా వ్యూహాలు

మరోసారి భద్రతా దళాల కన్నుగప్పిన డేంజరస్‌ హిడ్మా

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌టీఆర్‌ఓ).. కేంద్రప్రభుత్వ ఆదీనంలో పనిచేసే ఇంటెలిజెన్స్‌ సంస్థ ఇది. దేశ అంతర్గత భద్రతా వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి వివరాలు కేంద్రానికి అందిస్తుంది. ఇందుకోసం భూమి నుంచి 15వేల అడుగుల ఎత్తులో సంచరించే శాటిలైట్లు, డ్రోన్ల ద్వారా ఛాయాచిత్రాలను తీస్తూ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంటుంది. 

ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా ప్రస్తుతం ఎన్‌టీఆర్‌ఓ సహాయ సహకారాలను యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్న భద్రతా దళాలు తీసుకుంటున్నాయి. ఒడిశా–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఘరియాబంద్‌ దగ్గర జనవరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి మరణించాడు. అప్పుడే యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్స్‌లో ఎన్‌టీఆర్‌ఓ పాత్రకు సంబంధించిన సమాచారం తొలిసారి బయటకొచ్చింది. 

టీసీఓఏకు కౌంటర్‌గా.. 
ప్రతీ వేసవిలో అడవుల్లో భద్రతాదళాల దూకుడుకు అడ్డుకట్ట వేసేలా మావోయిస్టులు ట్యాక్టికల్‌ కౌంటర్‌ అఫెన్సివ్‌ క్యాంపెయిన్‌ (టీసీఓఏ – వ్యూహాత్మక ఎదురుదాడులు) పేరుతో ఎదురుదాడులు చేస్తుంటారు. అడవుల్లో కూంబింగ్‌కు వచ్చే భద్రతా దళాలపై ఆంబుష్‌ దాడులు చేయడం, కవ్వింపు చర్యలకు పాల్పడటం ద్వారా తమకు పట్టున్న ప్రాంతాల్లోకి పోలీసులను రప్పించి మెరుపుదాడులు చేయడం ఇందులో భాగం. 

అయితే, ఇటీవల వరుస ఎదురుదెబ్బలు తింటున్న మావోలు ఈసారి భారీగా ప్రతీకార దాడులకు ప్లాన్‌ చేసే అవకాశముందనే అనుమానంతో భద్రతా దళాలు తమ పంథా మార్చాయి. కూంబింగ్‌ ఆపరేషన్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించాయి. ఎన్‌టీఆర్‌ఓ సహకారంతో ‘శాటిలైట్‌–డ్రోన్‌’డేటా ఉపయోగించుకుంటూ మావోల కదలికలను పసిగడుతున్నాయి. అదను చూసి పదును పెట్టి దాడులు చేస్తున్నట్టు తాజా ఎన్‌కౌంటర్లతో తెలుస్తోంది.

హిడ్మా మరోసారి 
తెలంగాణతో సరిహద్దు పంచుకునే ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాలు దక్షిణ బస్తర్‌ పరిధిలోకి వస్తాయి. మావోయిస్టులు జనతన సర్కార్‌ విజయవంతంగా నడిపింది ఇక్కడే. ఈ ప్రాంతంలోనే మావోయిస్టుల సాయుధ శిక్షణ శిబిరం, ఆయుధ కర్మాగారాలు, నేలమాలిగలు వెలుగు చూశాయి. మోస్ట్‌ వాంటెండ్‌ మిలిటెంట్, పీఎల్‌జీఏ కంపెనీ–1 కమాండర్‌ హిడ్మా కార్యక్షేత్రం ప్రధానంగా ఈ రెండు జిల్లాలే. 

హిడ్మా రక్షణలోనే సెంట్రల్‌ రీజనల్‌ కమిటీ, తెలంగాణ కమిటీ, దక్షిణ బస్తర్‌ డివిజన్‌ కమిటీలున్నాయి. దీంతో హిడ్మాను టార్గెట్‌ చేసేందుకు ఏడాది కాలంగా భద్రతా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హిడ్మా ఆచూకీ కనుగొనేందుకు అన్ని అవకాశాలనూ వినియోగించుకుంటున్నాయి. 

గురువారం జరిగిన ఆపరేషన్‌ సైతం హిడ్మానే లక్ష్యంగా చేసుకోగా పశ్చిమ బస్తర్‌ డివిజన్‌ కమిటీ, పీఎల్‌జీఏ కంపెనీ–2లు పోలీసులకు టార్గెట్‌ అయ్యాయి. ఆధునిక పరిజ్ఞానం వాడినా మరోసారి హిడ్మా భద్రతా దళాల కన్నుగప్పినట్టయింది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
intelligence agencies
naxals
security forces
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.