Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. రాత్రి వెలుగుతో వృద్ధి అంచనా!
ADVERTISEMENT

రాత్రి వెలుగుతో వృద్ధి అంచనా!

Telangana Sakshi User Sakshi Sakshi Time Oct 27, 2026 04:16 AM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
indsd_20f_20satilli.jpg

ఉపగ్రహ చిత్రాలు, గూగుల్‌ సెర్చ్‌ ట్రెండ్స్‌ ఎంతో ఉపయుక్తం 

రాష్ట్రాల ఆర్థిక వృద్ధి అంచనాల్లో సరికొత్త విధానం 

రాత్రి వేళ వెలుగుల తీవ్రతకు, రాష్ట్రాల వృద్ధికి మధ్య బలమైన అనుసంధానం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బులెటిన్‌లో అధ్యయనం వివరాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాల త్రైమాసిక ఆర్థిక వృద్ధి రేటును అత్యంత కచ్చితత్వంతో ముందే అంచనా వేయడానికి రాత్రి వేళల్లో భూమిపైనున్న లైట్ల వెలుగులకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు, గూగుల్‌ సెర్చ్‌ ట్రెండ్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయని ఓ అధ్యయనంలో తేలింది. ఈ సరికొత్త సాంకేతిక నమూనా ద్వారా ఆర్థిక వృద్ధి అంచనాల్లో దొర్లే పొరపాట్ల­ను గరిష్టంగా 62 శాతం వరకు తగ్గించవచ్చు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఆర్థిక గణాంకాలను ప్రాతి­పదిక­గా తీసుకుని చేసిన పరిశోధనలో రాత్రి వేళ వెలుగుల తీవ్రతకు, రాష్ట్రాల వృద్ధికి మధ్య బలమైన అనుసంధానం ఉన్నట్లు స్పష్టమైంది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తాజా నెలవారీ బులెటిన్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.  

ఆలస్యానికి చెక్‌..  
ప్రస్తుతం దేశంలో రాష్ట్రాల వారీగా అధికారిక స్థూల విలువ జోడింపు (జీఎస్‌వీఏ) గణాంకాలు ఏడాదికి ఒకసారి మాత్రమే విడుదలవుతున్నాయి. పైగా ఈ వివరాలు వెల్లడి కావడానికి 12–18 నెలల సుదీర్ఘ సమయం పడుతోంది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వాలకు సవాలుగా మారుతోంది. ఈ కాలయాపనను అధిగమించడానికి ఆర్‌బీఐ సిబ్బంది ఒక ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించారు. 

అంతరిక్ష సాంకేతికతను, ప్రజల డిజిటల్‌ అలవాట్లను కలపడం ద్వారా సరికొత్త ఆర్థిక సూచికను రూపొందించారు. ఏదైనా ఒక వస్తువు లేదా సేవను తయారు చేసేటప్పుడు, ముడిపదార్థాల ఖర్చును తీసివేసిన తర్వాత ఆ వస్తువుకు ఎంత అదనపు విలువ జతకూరిందో చెప్పేదే స్థూల విలువ జోడింపు (జీవీఏ). ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఒక రాష్ట్రంలో అన్ని రంగాలు కలిసి ఉత్పత్తి చేసిన మొత్తం వస్తు సేవలకు సంబంధించిన అదనపు విలువనే జీఎస్‌వీఏ. 

సాంకేతికత పనిచేస్తుందిలా.. 
ఈ పరిశోధన కోసం నాసాకు చెందిన ’బ్లాక్‌ మార్బుల్‌’ ఉపగ్రహం అందించే రాత్రివేళ వెలుగుల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. నగరాలు, పారిశ్రామిక వాడలు, కీలక ప్రాంతాలలో రాత్రి వేళల్లో వెలుగుల తీవ్రత పెరిగితే అక్కడ ఆర్థిక కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నట్లు లెక్క. దీనికి అదనంగా ప్రజలు ఇంటర్నెట్‌లో శోధించే గూ­గుల్‌ ట్రెండ్స్‌ డేటాను కూడా జోడించారు. ప్రజల తక్షణ అవ­స­రాలను, మార్కెట్‌ డిమాండ్‌ను ప్రతిబింబించే ఉద్యోగాలు, విద్య, రియల్‌ ఎస్టేట్, షాపింగ్, ఆర్థిక రంగాలు, ప్రయాణాలు, వాహన కొనుగోళ్లు వంటి 25 విభిన్న రంగాలకు సంబంధించిన శోధనలను (సెర్చ్‌) పరిశీలించారు.  

అంచనాల్లో పెరిగిన కచ్చితత్వం.. 
సాధారణంగా ప్రభుత్వాలు పాత గణాంకాలు, ట్యాక్స్‌ వసూ­ళ్లు, పాత సర్వేల ఆధారంగా ఒక రాష్ట్రం ఎంత వృద్ధి చెందిందో అంచనా వేస్తాయి. కానీ ఆ పాత పద్ధతి కంటే ఈ కొత్త హైబ్రిడ్‌ పద్ధతి ఎంతో కచ్చితమైన ఫలితాలను ఇచ్చింది. రాష్ట్రాల వారీగా అంచనా లోపాలను గమనిస్తే గుజరాత్‌లో అత్యధికంగా 62 శాతం, కర్ణాటకలో 54 శాతం, మహారాష్ట్ర­లో 38 శాతం మేర తప్పులు తగ్గాయి. అయితే ఈ నివేదికను తమ సిబ్బంది రూపొందించారని, ఇందులోని అంశాలు కేవలం రచయితల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని ఆర్‌బీఐ వెల్లడించింది. దీనిని ఆర్‌బీఐ అధికారిక నివేదిక, అభిప్రాయంగా పరిగణించరాదని బులెటిన్‌ స్పష్టం చేసింది. 

సకాలంలో సరైన వ్యూహాలు.. 
ఆర్థిక వ్యవస్థలో వస్తున్న విస్తృత మార్పులను ఉపగ్రహ ఆధారిత వెలుగులు ముందే పసిగట్టగలవని, గూగుల్‌ ట్రెండ్స్‌ దానికి మరింత బలాన్ని చేకూరుస్తాయని ఈ అధ్యయనం నిరూపించింది. పాత వృద్ధి గణాంకాలతో పాటు ఈ రియల్‌ టైమ్‌ డిజిటల్‌ సూచికలను కలపడం ద్వారా ప్రస్తుత త్రైమాసిక ఆర్థిక వృద్ధిని అత్యంత కచ్చితత్వంతో ముందే అంచనా వేయడానికి వీలవుతుంది. దీనివల్ల విధాన నిర్ణేతలు సకాలంలో, సరైన ఆర్థిక వ్యూహాలను రూపొందించుకోవడానికి మార్గం సుగమం కానుంది. కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న కాలానికి సంబంధించిన త్రైమాసికాలను మినహాయించినప్పటికీ, ఈ నమూనా ఫలితాలు అత్యంత స్థిరంగా, నమ్మదగినవిగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.

వాస్తవాలకు అద్దం పడుతుంది.. 
రాత్రి వెలుగులు ఆర్థిక అభివృద్ధికి అద్దం పడతాయి. రాజకీయ నాయకులకు మింగుడు పడని అంశమే అయినప్పటికీ వృద్ధి గణాంకాలు దాపరికం లేకుండా వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడానికి శాటిలైట్‌ చిత్రాలు, గూగుల్‌ సెర్చ్‌ డేటాతో కూడిన ఈ రియల్‌ టైమ్‌ ఆర్థిక సూచిక దోహదం చేస్తుంది. విదేశీ ఇన్వెస్టర్లు వివిధ దేశాల్లో పెట్టుబడి చేయడానికి వాస్తవ గణాంకాలే ప్రామాణికత.   –డి.పాపారావు, ఆర్థిక రంగ విశ్లేషకుడు, కాలమిస్ట్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Satellite imagery
google search
Trends
Telangana
reserve bank of india
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రెండు చోట్ల ఓట్లు ఉంటే తొలగించాలా... వద్దా?: అమిత్‌ షా

రెండు చోట్ల ఓట్లు ఉంటే తొలగించాలా... వద్దా?: అమిత్‌ షా

సహజీవనానికి అడ్డొస్తున్నాడని.. గొంతునులిమి, ప్రాణం తీసి..

సహజీవనానికి అడ్డొస్తున్నాడని.. గొంతునులిమి, ప్రాణం తీసి..

మహిళా ఉద్యోగులే టార్గెట్‌.. సిరిసిల్లలో వేధింపుల బాగోతం!

మహిళా ఉద్యోగులే టార్గెట్‌.. సిరిసిల్లలో వేధింపుల బాగోతం!

పతకం అందుకున్న కొద్దిసేపటికే.. మారథాన్‌లో విషాదం!

పతకం అందుకున్న కొద్దిసేపటికే.. మారథాన్‌లో విషాదం!

పూజారి దారుణ హత్య!.. 130 తులాల బంగారంతో పరార్‌

పూజారి దారుణ హత్య!.. 130 తులాల బంగారంతో పరార్‌

జీఎస్టీ.. ‘వ్యాట్‌’ ఏ వసూల్‌!

జీఎస్టీ.. ‘వ్యాట్‌’ ఏ వసూల్‌!

మరిన్ని వార్తలు

రెండు చోట్ల ఓట్లు ఉంటే తొలగించాలా... వద్దా?: అమిత్‌ షా

రెండు చోట్ల ఓట్లు ఉంటే తొలగించాలా... వద్దా?: అమిత్‌ షా

మహిళా ఉద్యోగులే టార్గెట్‌.. సిరిసిల్లలో వేధింపుల బాగోతం!

మహిళా ఉద్యోగులే టార్గెట్‌.. సిరిసిల్లలో వేధింపుల బాగోతం!

పతకం అందుకున్న కొద్దిసేపటికే.. మారథాన్‌లో విషాదం!

పతకం అందుకున్న కొద్దిసేపటికే.. మారథాన్‌లో విషాదం!

పూజారి దారుణ హత్య!.. 130 తులాల బంగారంతో పరార్‌

పూజారి దారుణ హత్య!.. 130 తులాల బంగారంతో పరార్‌

జీఎస్టీ.. ‘వ్యాట్‌’ ఏ వసూల్‌!

జీఎస్టీ.. ‘వ్యాట్‌’ ఏ వసూల్‌!

ఈనెలా వర్షాభావమే!

ఈనెలా వర్షాభావమే!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft