Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. అద్దె బస్సులూ సై అంటేనే సమ్మె సక్సెస్‌
ADVERTISEMENT 

అద్దె బస్సులూ సై అంటేనే సమ్మె సక్సెస్‌

Telangana Sakshi User Sakshi Sakshi Time Apr 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bus.jpg

ప్రస్తుతం ఆర్టీసీలో 3,200 అద్దె బస్సులు

ఈ బస్సుల డ్రైవర్లంతా ప్రైవేటువారే

ఔట్‌సోర్సింగ్‌ విధానంలో మరో 1,500 మంది డ్రైవర్లు

వీరంతా సమ్మెలో పాల్గొనకుంటే ప్రభావం అంతంతే

దీంతో వారినీ కలుపుకొనే దిశగా కార్మిక సంఘాల కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: టీజీఆర్టీసీలో సమ్మె అని­వార్య­మైతే అద్దె బస్సులు, గ్రాస్‌కాస్ట్‌ కాంట్రా­క్టు పద్ధతిలో నడుస్తున్న ఎలక్ట్రిక్‌ బస్సుల డ్రైవ­ర్లను కూడా సమ్మెలో భాగం చేసేలా కార్మిక సంఘాలు కసరత్తు ప్రారంభించాయి. వచ్చేనెల 7వ తేదీ నుంచి సమ్మె ఉంటుందని ఆర్టీసీలోని ఒక జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే ఆర్టీసీలో ప్రస్తుతం అద్దె బస్సుల సంఖ్య పెరిగింది. ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెలో పాల్గొని బస్సులను బయటకు తీయ­కున్నా, అద్దె బస్సులు రోడ్డెక్కితే ప్రయాణి­కు­లకు కొంతవరకు రవాణా కష్టాలు దూరమ­వు­తాయి. 

దీంతో సమ్మె ప్రభావం పూర్తిస్థాయిలో ఉండదన్నది కార్మికసంఘాల ఆందోళన. ప్రస్తు­తం ఆర్టీసీలో 9,400 బస్సులున్నాయి. వీటిల్లో ఆర్టీసీ సొంత బస్సులు 6,200 మాత్రమే. మిగ­తావాటిలో 2,800 అద్దె బస్సులు, 400 ఎలక్ట్రిక్‌ బస్సులున్నాయి. వీటికి డ్రైవర్లుగా ఆర్టీసీ సొంత ఉద్యోగులు ఉండరు. ఆ బస్సుల యజమా­నులే డ్రైవర్లను ఏర్పాటు చేసుకుంటారు. సమ్మె ప్రారంభమైతే అద్దె బస్సుల యజమానులు త­మ డ్రైవర్లతో 3,200 బస్సులను నడుపుతారు. 

34 శాతం అద్దె బస్సులే
2019లో 53 రోజుల పాటు సమ్మె జరిగిన సమ­యంలో ఆర్టీసీలో 11 వేల వరకు బస్సులుంటే, ఆద్దె బస్సులు 1,800 మాత్రమే ఉన్నాయి. సమ్మె ముగిసిన వెంటనే 2 వేల బస్సులు తొ­లగించాలని నాటి సీఎం కేసీఆర్‌ ఆదేశించటంతో అంతమేర బస్సులను ఆర్టీసీ ఉపసంహరించింది. ఆ తర్వాత కూడా సొంత బస్సుల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. వాటి స్థానంలో అద్దె బస్సుల సంఖ్యను సంస్థ పెంచింది. ఫలి­తంగా ఇప్పుడు అద్దె బస్సులు 34 శాతానికి చేరాయి. 

ప్రస్తుతం ఆర్టీసీలో 2 వేల వరకు డ్రైవ­ర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో 1,500 మంది ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్లతో బస్సులు నడి­పేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొంతమంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. సమ్మె నాటికి మిగతా ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్లు కూడా విధుల్లోకి వస్తారు. వీరు కూడా సమ్మె సమ­యంలో బస్సులను తిప్పేందుకు అందుబా­టు­లో ఉంటారు. వెరసి సగం బస్సులు రోడ్డెక్క­టం ఖాయంగా ఉంది. 

ఈ పరిస్థితి సమ్మెకు అడ్డంకిగా మారుతుందని సంఘాలు భావిస్తు­న్నాయి. అద్దె బస్సుల నిర్వాహకులతో చర్చించి వారు కూడా సమ్మెకు మద్దతిచ్చేలా చూడా­లని కొన్ని సంఘాలు ప్రతిపాదిస్తున్నాయి. డ్రైవ­ర్, కండక్టర్లతో పాటు సూపర్‌వైజర్ల సంఘం కూడా సమ్మెకు మద్దతిచ్చేలా చూడాలని పేర్కొంటున్నాయి. 

రెండు జేఏసీల మధ్య కొనసాగుతున్న విభేదాలు
ఆర్టీసీలో ఒక జేఏసీ ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చింది. మరో జేఏసీ దీనికి దూరంగా ఉంది. మొదటి జేఏసీ మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి రెండో జేఏసీని, జేఏసీల్లో భాగం కాని ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎస్‌డబ్ల్యూయూ (ఐఎన్‌­టీ­యూసీ) నేతలను ఆహ్వానించింది. అయితే, ఆహ్వానించిన తీరు సరిగా లేదని రెండో జేఏసీ సమావేశంలో పాల్గొనలేదు. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు సమావేశంలో పాల్గొన్నా.. మొదటి జేఏసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఎస్‌డబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి హాజరైనా, రెండో జేఏసీ సహా ఎస్‌డబ్ల్యూఎఫ్‌లు సమ్మెకు సిద్ధమైతేనే తాము సమ్మెకు మద్దతిస్తామని ప్రకటించారు. మరోవైపు ఐక్య కార్యాచరణను సాధించేందుకు రెండో జేఏసీ ఈ నెల 28న సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Telangana
Strike
rtc
trade unions
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.