Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఇదెక్కడి లెక్క!
ADVERTISEMENT 

ఇదెక్కడి లెక్క!

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 22, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ts_20ss.jpg

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు బెనిఫిట్స్‌ చెల్లింపులో మతలబు... 2017 వేతన సవరణతో కొత్త జీతాలు అమలులోకి 

కానీ పాత జీతాల ప్రకారం లెక్కగట్టి ప్రయోజనాలు చెల్లింపు 

నష్టపోయిన రూ.150 కోట్ల కోసం రిటైర్డ్‌ ఉద్యోగుల ప్రదక్షిణలు 

సాక్షి, హైదరాబాద్‌: దశాబ్దాల పాటు సంస్థ కోసం పనిచేసిన రిటైర్డ్‌ ఉద్యోగులను ఆర్టీసీ దగా చేసింది. లెక్క ప్రకారం చెల్లించకుండా పెద్ద మొత్తాన్ని ఎగ్గొట్టేసింది. ముందు అసలే ఇవ్వలేదు. చివరకు ‘సాక్షి’చొరవతో చెల్లింపుల కోసం బ్యాంకు నుంచి రుణం తెచ్చింది. కానీ లెక్కల్లో మతలబులు చేసి తక్కువ మొత్తాన్ని చెల్లించి చేతులు దులుపుకుంది. 

ఆ మతలబు విలువ రూ.150 కోట్లు కాగా..ఇక అడగరు అనుకుందేమో ఎగ్గొట్టేసింది. ఇప్పుడు మళ్లీ రిటైర్డ్‌ ఉద్యోగులు బస్‌భవన్‌ చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయితే ఆ డబ్బులు అందకుండానే వందల మంది చనిపోతుండటంతో కుటుంబసభ్యుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 

‘అడియాసలు’పై ‘సాక్షి’ కథనం 
ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక పరమైన ప్రయోజనాల చెల్లింపు విషయంలో దాదాపు దశాబ్దన్నరగా సమస్యలు నెలకొంటున్నాయి. అయితే రిటైర్‌ అయిన వారి విషయంలో మాత్రం కొంత మినహాయింపు ఉంది. ఉద్యోగ విరమణ పొందిన రోజు వారిని సత్కరించి కొన్ని ఆర్థిక లబ్ధి ప్రయోజనాలు అందించి సాగనంపటం ఆనవాయితీగా వస్తోంది. కానీ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవటంతో గత కొన్నేళ్లుగా ఈ ఆనవాయితీని పక్కన పెట్టింది.

ఉద్యోగ విరమణ పొందిన వారికి కూడా బెనిఫిట్స్‌ సకాలంలో చెల్లించటం లేదు. ఇదే విషయాన్ని పేర్కొంటూ గత జూలైలో ‘ఆర్టీసీలో అడియాసలు’శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఉద్యోగ విరమణ పొందిన వారికి గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ చెల్లింపులు, 2017 వేతన సవరణ తాలూకు బకాయిలు చెల్లించని తీరును అందులో ఎత్తిచూపింది. దాదాపు 16 వేల మంది రిటైర్డ్‌ ఉద్యోగుల ఆవేదనను అందులో కళ్లకు కట్టింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం, వారికి చెల్లింపులు జరపాలని ఆర్టీసీని మౌఖికంగా ఆదేశించింది.

దీంతో సంస్థ బ్యాంకు నుంచి దాదాపు రూ.400 కోట్ల రుణాన్ని పొందింది. ఇందులోంచి ఉద్యోగ విరమణ పొందిన వారికి రూ.150 కోట్లు చెల్లించింది. మిగతా మొత్తాన్ని వేరువేరు అవసరాలకు వినియోగించుకుంది. ఇక్కడే మతలబు చోటు చేసుకుంది. ఆ రూ.150 కోట్లను ఉద్యోగ విరమణ పొందిన వారి గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్ మెంటు బకాయిల కింద చెల్లించింది. ఇతర బకాయిలు లేవు అన్న తరహాలో వ్యవహరించింది. ఇక్కడే మతలబు చోటుచేసుకుంది.  

పెరిగిన జీతాన్ని కాకుండా..     
ఆర్టీసీలో 2017లో వేతన సవరణ జరగాల్సి ఉంది. అయితే అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల పేరుతో మధ్యంతర భృతి ప్రకటించి పెండింగులో పెట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫిట్‌మెంటును ప్రకటించి 2024 జూన్‌ నుంచి అమలులోకి తెచ్చింది. అయితే బకాయిలను 2017 ఏప్రిల్‌ నుంచి లెక్కగట్టి చెల్లించాల్సి ఉండగా.. రిటైర్డ్‌ ఉద్యోగులకు 2017 వేతన సవరణతో పెరిగిన జీతాన్ని కాకుండా, పాత జీతాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కగట్టింది. 

ఆ మేరకు రూ.150 కోట్లు చెల్లించింది. కానీ పెరిగిన జీతం ప్రకారం లెక్కగట్టి ఇస్తే ఆ బకాయిల మొత్తం మరింత పెరుగుతుంది. అంతమేర రిటైర్డ్‌ ఉద్యోగులకు లబ్ధి కలిగేది. కానీ రిటైర్డ్‌ ఉద్యోగులకు రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆ మొత్తాన్నే చెల్లించాలంటూ ఇప్పుడు రిటైర్డ్‌ ఉద్యోగులు ఆర్టీసీ బస్‌భవన్‌ చుట్టూ తిరగాల్సి వస్తోంది. 

వారికి చెల్లించేశారు.. 
వేతన సవరణతో 2024 జూన్‌ నుంచి జీతాలు పెరిగాయి. ఆ తర్వాత రిటైర్‌ అయిన వారికి కొత్త జీతాల ఆధారంగా గ్రాట్యుటీ లెక్కగట్టారు. అలా 2025 ఆగస్టు వరకు చెల్లించారు. కొన్ని నెలల వరకు లీవ్‌ ఎన్‌క్యాష్ మెంటు కూడా కొత్త జీతాల మేరకే లెక్కగట్టారు. ఆ సమయంలో కొందరు ఉన్నతాధికారులు కూడా రిటైర్‌ కావటంతో వారికి కూడా కొత్త జీతాల ప్రకారమే ఆ బెనిఫిట్స్‌ అందినట్టు సమాచారం. కానీ అంతకు 86 నెలల ముందు రిటైర్‌ అయిన వారికి మాత్రం పాత జీతాల మీద లెక్కగట్టడం గమనార్హం. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
retired employees
rtc
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.