Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. మనీ లేదు.. మట్టి పోద్దాం!
ADVERTISEMENT 

మనీ లేదు.. మట్టి పోద్దాం!

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 12, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ROAD_0.jpg

ఇటీవలి వానలకు రాష్ట్రంలో మరింత తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లు

మట్టి పోసి తాత్కాలిక మరమ్మతులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల కోసం ఎదురుచూపు

రూ.1,600 కోట్లు అవసరమని అంచనా... రాష్ట్ర నివేదికలపై స్పందించని కేంద్రం

ఇది రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షించే రాష్ట్ర రహదారి. తాండూరు–జహీరాబాద్‌ రోడ్డులో రావులపల్లి గ్రామ శివారులో పరిస్థితి ఇది. ఎక్కడా తారు ఆనవాళ్లు అనేవి లేకుండా ఇలా మారింది. వాన కురిస్తే ఇక్కడ రాకపోకలు నిలిచిపోతాయి. గతేడాది వానాకాలంలో రోడ్డు కొట్టుకుపోగా, మరమ్మతులు చేయకపోవడంతో స్థానిక నేత ఒకరు సొంత ఖర్చుతో మట్టిపోయించి తాత్కాలికంగా రాకపోకలు జరిగేలా చేశారు. ఈసారి మళ్లీ కొట్టుకుపోయి అదే పరిస్థితి పునరావృతం అయింది. మళ్లీ స్థానిక నేతలు సొంత ఖర్చుతో మట్టి పోయించారు. దీంతో రోడ్డు ఈ మాత్రం కనిపిస్తోంది. కొత్త రోడ్డు నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితమే మంజూరైనా.. ఇప్పటివరకు పనుల జాడే లేదు. కనీసం టెండర్లు కూడా పిలవలేదు. 

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాలు కురిసినప్పుడు దెబ్బతిన్న రోడ్లను తాత్కాలికంగా మరమ్మతు చేసి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తేనే వాహనాలు సాఫీగా ముందుకు సాగుతాయి. కానీ రాష్ట్రంలో చాలాచోట్ల ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఒక వానాకాలం ముగిసే సరికి రోడ్లకు సగటున రూ.2 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. అంటే వాటిని పునరుద్ధరించాలంటే అంతమేర నిధులు ఖర్చు చేయాలన్న మాట.

కానీ నిధుల లేమి రోడ్ల మరమ్మతుకు, కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రతిబంధకంగా మారుతోంది. రోడ్ల మరమ్మతులకు భారీ మొత్తంలో నిధులు వెచి్చంచే పరిస్థితి లేకపోవటంతో కేంద్ర సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కానీ కేంద్రం.. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారుల బృందాలను పంపటం తప్ప నిధులు ఇవ్వటం లేదు. గతేడాది రూ.2,300 కోట్ల మేర రోడ్లకు నష్టం వాటిల్లినందున అంతమేర నిధులు ఇవ్వాలని కేంద్ర బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమరి్పంచింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో కేంద్ర మంత్రుల ముందు కూడా ప్రస్తావించింది. కానీ నయా పైసా రాలేదు.  

బాగా దెబ్బతిన్న రోడ్లు 
    ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. మోంథా తుపాను కంటే ముందు కురిసిన వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు వచ్చాయి. 1,400 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయని, రూ.1,278 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, తాత్కాలిక మరమ్మతులకు రూ.78 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఆ తర్వాత మోంథా తుపాను ప్రభావంతో నష్టం మరింత పెరిగింది.

ఈ రెండు నష్టాలు కలిపి దాదాపు రూ.1,600 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. 1,500 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, మొత్తం 1,641 కి.మీ మేర రోడ్ల ఉపరితలం దెబ్బతిన్నదని పేర్కొంటూ కేంద్రానికి మరోసారి నివేదించింది. కానీ ఈ రెండు నివేదికలపైనా అక్కడి నుంచి స్పందన రాలేదు. రాష్ట్రం సొంత నిధులు ఇవ్వలేక పోవడం, కేంద్రం నుంచి నిధులపై స్పష్టత లేకపోవడంతో రోడ్లు రోజురోజుకూ మరింత దెబ్బతింటున్నాయి. తాత్కాలికంగా గుంతల్లో మట్టి నింపిన అధికారులు..పూర్తిస్థాయి మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణంపై చేతులెత్తేశారు. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా రోడ్ల మీద ప్రయాణాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది.  

ఇటీవలి తుపాను ప్రభావం ఇలా.. 
జిల్లా         దెబ్బతిన్న ప్రాంతాలు    మరమ్మతులకు కావాల్సిన నిధులు (రూ.కోట్లలో) 
కరీంనగర్‌        16            6 
వరంగల్‌        50            86.34 
హనుమకొండ    12            2.50 
ములుగు        3            4.40 
మహబూబాబాద్‌    38            14.94 
ఖమ్మం        63            54 
భద్రాద్రి        15            22.95 
నల్లగొండ        26            10.10 
సూర్యాపేట        4            6.82 
యాదాద్రి        11            4.31 
జనగామ        21            13 
సిద్దిపేట        27            40.19 
రంగారెడ్డి        10            3.88 
నాగర్‌కర్నూలు    86            49.44  


 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Roads
rains
Telangana
damaged roads
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.