Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. సంక్రాంతి ముందే సలసల
ADVERTISEMENT 

సంక్రాంతి ముందే సలసల

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 12, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
tg.jpg

భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు

నువ్వులు, శనగపప్పు, బియ్యం పిండి, నూనెల ధరలన్నీ పిరం

బేగంబజార్‌ మార్కెట్‌ మొదలు మాల్స్‌ వరకు మండుతున్న రేట్లు

బియ్యం, కందిపప్పు ధరలు మాత్రం తగ్గుదల

సాక్షి, హైదరాబాద్‌: సంకాంత్రి పండుగ సామాన్యుడికి భారమైంది. పట్టణం నుంచి పల్లె వరకు ప్రజలంతా నిత్యావసర ధరలను చూసి భయపడిపోతున్నారు. పల్లెల్లోని రైతులకు పిండివంటలకు అవసరమైన బియ్యం సొంత పొలాల నుంచే వచ్చినా.. సకినాలు, గారెలకు కావాల్సిన నువ్వులు, వాము(వంద గ్రాములకు రూ. 40), శనగలు, వేరుశనగ వంటి పప్పు, నూనె ధాన్యాల ధరలు భారీగా ఉన్నాయి. పండుగకు తప్పదనే ధోరణితో ఉన్న దాంట్లోనే పొదుపు పాటిస్తూ నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని బేగంబజార్‌ వంటి ప్రధాన మార్కెట్లలో కొనుగోళ్లు తగ్గాయి. పెరిగిన ధరలతోపాటు నగరవాసులు ఊళ్లకు వెళ్లడం కూడా అందుకు కారణంగా చెబుతున్నారు. రాష్ట్రంలో డబ్బు సర్క్యులేషన్‌ కూడా ఆశించిన స్థాయిలో లేనందున కూడా గిరాకీలు తగ్గినట్టు చెబుతున్నారు. చేతినిండా పనిలేని కారణంగా ఆశించిన మేర డబ్బు ఆడడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.

కాగుతున్న నూనెలు..
సంక్రాంతి వస్తుందంటే వారం రోజుల ముందు నుంచే ఇళ్లలో పిండి వంటలు ఘుమఘుమలాడేవి. ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు పిండి వంటలకు దూరమవుతున్నారు. నాలుగు నెలల్లోనే నూనె లీటర్‌ ధర రూ.10 నుంచి రూ.15 వరకు, పప్పు ధాన్యాల ధరలు 10 శాతంకు పైగా పెరిగాయి. ఈ తేడా గత ఆగస్టు నెలతో పోలిస్తే రూ. 25 నుంచి రూ.30 వరకు ఉంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న యుద్ధ వాతావరణంతోపాటు నూనెల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచడంతో పామాయిల్‌ లీటర్‌ ధర ఒక్కసారిగా రూ.94 నుంచి రూ.129కి చేరింది. సన్‌ఫ్లవర్‌ నూనె లీటరుకు రూ.145 నుంచి రూ.150 వరకు, పల్లీ నూనె లీటరుకు రూ.160కి పైగా, రైస్‌ బ్రాండ్‌ రూ.147 నుంచి రూ.160 ఉన్నాయి. నెలరోజుల క్రితం నూనె ధరలు ఇంకొంచెం అధికంగా ఉండగా, జనవరి మొదటివారంలో కొంత మేర తగ్గాయి. 


ఉడకనంటున్న పప్పు 
పిండి వంటలు చేసుకోవడానికి పప్పు ధాన్యాలే ముఖ్యం. ఏ పప్పు ముట్టుకున్నా వాటి ధరలు నిప్పుల్లా కాలుతున్నాయి. ప్రస్తుతం శనగపప్పు కిలోకు రూ.100, నువ్వులు రూ. 170, బెల్లం రూ. 70, గోధుమ పిండి ప్యాకెట్‌ రూ. 60గా ఉంది. కాగా కందిపప్పు, పెసరపప్పు ధరలు ఈనెల మొదటి వారం నుంచి కొంత తగ్గుముఖం పట్టడం కొంత ఊరట. కందిపప్పు రూ.158, మినప గుండ్లు రూ. 164, పెసరపప్పు రూ. 120కి తగ్గాయి.

కొత్త బియ్యం రూ. 60, పాతబియ్యం రూ.70 పైనే ఉండగా, మొన్నటి వానాకాలం సీజన్‌లో పండిన పంటకు సంబంధించిన నాణ్యమైన బియ్యం ధర మాత్రమే కిలో రూ. 60 కన్నా తక్కువగా ఉంది. జైశ్రీరాం, తెలంగాణ సోనా, హెచ్‌ఎంటీ, బీపీటీ వంటి సన్నబియ్యం ధర పాతవైతే కిలో రూ.70 వరకు పలుకుతోంది. నాణ్యమైన వెల్లుల్లి ధర కిలో రూ. 450 నుంచి రూ. 500 వరకు ఉంది. ఇంత మొత్తంలో చెల్లించి సామాన్యులు వెల్లుల్లి కొనలేకపోతున్నారు. ఉల్లిగడ్డ ధరలు తగ్గుముఖం పట్టినట్టు చెబుతున్నా, హైదరాబాద్‌లో కిలో రూ. 50కి తక్కువగా లేదు. ఇతర కూరగాయ రేట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

ఈ ఫొటోలో కనిపిస్తున్నది జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఓ కిరాణాకొట్టు. సరుకుల కోసం పండుగ వేళ దుకాణంలోకి వస్తున్న వినియోగదారులు సగం సంబరం–సగం కష్టం అన్నట్టుగా కనిపిస్తున్నారు. ఒకవైపు పిల్లలు పండుగకు వస్తున్న సంతోషం, మరోవైపు ధరలు పెరిగిన అసంతృప్తి వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సంక్రాంతికి తమ వద్దకు వచ్చే కస్టమర్లలో చాలామంది సంతోషంగా సరుకులను తీసుకుపోవడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఖరీదు చేస్తున్నారని దుకాణ యజమాని చెప్పారు.

పండుగల సమయంలో హెచ్చుతగ్గులు సహజమే
ధరల హెచ్చుతగ్గులకు జాతీయ, అంతర్జాతీయ అంశాలతోపాటు వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది. నూనెలు, పప్పుల ధరల గత కొంతకాలంగా పెరిగాయి. పండుగల సమయంలో నిత్యా వసర వస్తువుల ధరల్లో 5 నుంచి 10 శాతం హెచ్చుతగ్గులు సహజమే. కొన్నేళ్లుగా పండుగలు వచ్చినప్పుడు హైదరాబాద్‌ రిటైల్‌ మార్కెట్‌లో సందడి తగ్గింది. నగరవాసులు సొంతూర్లకు వెళుతుండడంతో బేగంబజార్‌ దుకాణాల్లో గిరాకీ ఉండడం లేదు. – జీవన్‌ భాటి, కిరాణ మర్చంట్స్‌ అసోసియేషన్, బేగంబజార్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Prices of essential items
sankranti festival
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.