Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. సన్నబియ్యానికి ‘నూకలు’ చెల్లినట్టే!
ADVERTISEMENT 

సన్నబియ్యానికి ‘నూకలు’ చెల్లినట్టే!

Telangana Sakshi User Sakshi Sakshi Time Oct 18, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rice.jpg

క్వింటాల్‌ సన్న ధాన్యానికి 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు వస్తాయంటూ మిల్లర్ల మెలిక 

ఖరీఫ్‌ సీఎంఆర్‌పై కొత్త ఎత్తుగడ

సాక్షి, హైదరాబాద్‌: సన్నబియ్యంలో నూకల పేరిట మిల్లర్లు భారీ స్కెచ్‌ వేశారు. 100 కిలోల సన్న ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు వస్తాయని కొత్తరాగం ఎత్తుకున్నారు. నిబంధనల ప్రకారం ఖరీఫ్‌లో 100 కిలోల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే 67 కిలోల బియ్యం లెక్కన ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. 

ఈసారి కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం (సన్నాలు) భారీ ఎత్తున వస్తాయని భావిస్తున్న మిల్లర్లు మిల్లింగ్‌లో చేతివాటం చూపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు రబీలో వచ్చే ధాన్యాన్ని రా రైస్‌గా మిల్లింగ్‌ చేస్తే నూకల శాతం పెరుగుతుందని చెబుతూ వచ్చిన మిల్లర్లు.. ఈసారి సన్న ధాన్యానికి కూడా ఇదే వంక పెడుతున్నారు. గతంలో ఎన్నడూ ఖరీఫ్‌ ధాన్యం ఔటర్న్‌పై ఒక్కమాట కూడా మాట్లాడని మిల్లర్లు ఎకాఎకిన 9 కిలోల బియ్యానికి టెండర్‌ పెడుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

సన్నబియ్యం ధర కిలోకు రూ. 50 చొప్పున లెక్క వేసుకున్నా... 9 కిలోలకు రూ. 450 అవుతుంది. క్వింటాల్‌ సన్న ధాన్యానికి రైతుకు ప్రభుత్వం రూ. 500 బోనస్‌గా ఇవ్వాలని భావిస్తుంటే... మిల్లింగ్‌ పేరు మీద క్వింటాల్‌ ధాన్యానికి రూ. 450 విలువైన బియ్యాన్ని ఎగవేసే పన్నాగంలో మిల్లర్లు ఉన్నట్లు అర్థమవుతోంది. 9 కిలోల బియ్యానికి బదులు నూకలు ఇస్తామనడం పట్ల పౌరసరఫరాల శాఖ అధికారులే విస్తుపోతున్నారు. 

బ్యాంక్‌ గ్యారంటీలపైనా తకరారు! 
ఖరీఫ్‌ సీజన్‌లో మిల్లర్లకు ధాన్యం కేటాయింపులో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగానే బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలలో పొందుపరిచారు కూడా. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించాల్సి ఉండగా, ముసాయిదాతోనే నిలిపివేసి, మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. రైస్‌మిల్లు కెపాసిటీకి అనుగుణంగా కేటాయించిన ధాన్యం విలువలో 25 శాతం మేర బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వాలి. 

మిల్లును లీజుకు తీసుకుంటే.. కేటాయించిన ధాన్యం విలువలో 50 శాతం మేర లీజుదారుడు చెల్లించాలి. అయితే ఈ బ్యాంక్‌ గ్యారంటీ నిబంధనలను మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం అనేది తమకు తలకు మించిన భారమని, మిల్లింగ్‌ చార్జీలు కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని, ఏపీ వంటి రాష్ట్రాల్లో క్వింటాల్‌కు రూ.100 చెల్లిస్తుంటే మనరాష్ట్రంలో కేవలం రూ. 10 మాత్రమే ఇస్తున్నారని మిల్లర్లు చెబుతున్నారు. 

అది కూడా చాలా కాలంగా ఇవ్వడం లేదని వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో బ్యాంకు గ్యారంటీలను ఎత్తివేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక సీజన్‌లో సీఎంఆర్‌ ఇవ్వకుండా డిఫాల్ట్‌ అయిన మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకొని ధాన్యం కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంటే ఒక సీజన్‌లో సీఎంఆర్‌ డిఫాల్ట్‌ అయిన మిల్లర్లు తాము ఇవ్వాల్సిన బియ్యాన్ని అప్పగించడంతోపాటు అదనంగా 25 శాతం జరిమానా మొత్తానికి బ్యాంక్‌ గ్యారంటీ ఇస్తే వారికి ధాన్యం కేటాయిస్తారు. 

ఇలా ఒక సీజన్‌లో సీఎంఆర్‌ డిఫాల్ట్‌ అయిన మిల్లులు రాష్ట్రంలో 791 ఉన్నట్టు పౌరసరఫరాల సంస్థ తేల్చింది. రెండు, అంతకంటే ఎక్కువ సీజన్లలో డిఫాల్ట్‌ అయిన మిల్లులకు ఈసారి ధాన్యం కేటాయించమని మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో తేల్చిచెప్పారు. 386 మిల్లులను డిఫాల్ట్‌ మిల్లులుగా తేల్చడం గమనార్హం. మొత్తానికి బ్యాంకు గ్యారంటీల అంశం కూడా అటకెక్కినట్టేనని పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
fine rice
rice millers
Rice
Civil Supplies Department
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.