Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. కోటీ 33 లక్షల ఎకరాల్లో పంటలు
ADVERTISEMENT 

కోటీ 33 లక్షల ఎకరాల్లో పంటలు

Telangana Sakshi User Sakshi Sakshi Time Sep 25, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
paddy.jpg

రాష్ట్రంలో ఈసారి రికార్డు స్థాయిలో పంటల సాగు 

అంచనాను 100 శాతం చేరుకున్న వ్యవసాయ శాఖ... అత్యధికంగా 67.30 లక్షల ఎకరాల్లో వరి సాగు 

తరువాత స్థానంలో పత్తి, మొక్కజొన్న 

వరి, పత్తి పంటల సాగే కోటీ 13 లక్షల ఎకరాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో వ్యవసాయ శాఖ అంచనాలకు అనుగుణంగా రికార్డు స్థాయిలో వివిధ రకాల పంటలు 100 శాతానికి పైగా సాగయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించగా, అంతకన్నా ఎక్కువగా 1.33 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవడం గమనార్హం. గత సంవత్సరం వానాకాలం సీజన్‌లో 1.28 కోట్ల ఎకరాల్లో పంటలను వేయగా, ఈసారి సుమారు 5 లక్షల ఎకరాల్లో అధికంగా సాగు చేశారు. 

ఇందులో అత్యధికంగా వరి అంచనాల కన్నా 5 లక్షల ఎకరాల్లో అధికంగా సాగైంది. 62.47 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించగా, అందుకు భిన్నంగా ఏకంగా 67.30 లక్షల ఎకరాల్లో (107 శాతం) వరి సాగైంది. వరి తరువాత అత్యధికంగా పత్తి 46 లక్షల ఎకరాల్లో సాగవడం గమనార్హం. అంటే ఈ రెండు పంటల విస్తీర్ణమే ఏకంగా 1.13 కోట్ల ఎకరాలు. మిగతా అన్ని పంటలు కలిపి మరో 20 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. 

పెరిగిన మొక్కజొన్న సాగు విస్తీర్ణం 
రాష్ట్రంలో ఈసారి మొక్కజొన్న కూడా అంచనాను మించి సాగైంది. రాష్ట్రంలో 5.21 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుందని అంచనా వేయగా, 6.44 లక్షల ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. ఆరుతడి పంటగా మెట్ట ప్రాంతాల్లోనే కాకుండా సాగునీరు లభ్యత ఉన్న చోట కూడా ఈసారి మొక్కజొన్నను సాగు చేయడం గమనార్హం. గత సంవత్సరం 5.23 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న వేయగా, ఈసారి 1.20 లక్షల ఎకరాల్లో అధికంగా సాగు చేశారు. 

మొక్కజొన్న తరువాత అధికంగా కందులు 4.91 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో సోయాబీన్‌ కూడా ఈసారి అధికంగానే సాగైంది. ఇవి కాకుండా వేరుశనగ, పెసర, జొన్న, మినుములు వంటి పంటలను కూడా సాగు చేసినప్పటికీ విస్తీర్ణం కొన్ని వేల ఎకరాల్లోనే ఉంది. కాగా ఈసారి చెరుకు పంట గత సంవత్సరం కన్నా దాదాపు రెండింతలు 35,641 ఎకరాల్లో సాగవడం విశేషం. నిజామాబాద్, మెదక్‌ ఉమ్మడి జిల్లాల్లో చెరుకును సాగు చేసినట్లు తెలుస్తోంది.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Agriculture Department
Record
Crop cultivation
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.