సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బోనాల సందర్బంగా నేడు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటానని తెలిపింది.
భవిష్యవాణిలో స్వర్ణలత కామెంట్స్ ఇవే..
-
భక్తుల అందరి పూజలు సంతోషంగా పూజలు అందుకున్నాను.
-
భక్తులకు ఎవరికి ఆటంకాలు లేకుండా చూసుకున్నాను.
-
ఏ బోనం అయిన సంతోషంతో ఆనందంగా అందుకుంటాను
-
నా సన్నిధికి ఎవరు వచ్చినా సంతోషంగా ఆశీర్వదిస్తాను.
-
కోరిన వరాలు ఇస్తాను.
-
పాడి పంటలు సంవృద్ధిగా ఉంటాయి.
-
కష్టం లేకపోతే సోమరి పోతులుగా తయారువతారు.
-
నా వద్దకు వచ్చేందుకు ఆ మాత్రం కష్టపడాలి కదా.
-
ఎటువంటి ఆపద, వ్యాధులు రాకుండా చూసుకునే భాధ్యత నాది
-
ఎవరు అడ్డుపడిన, రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను.
-
ఐదు వారాలు పప్పు బెల్లం శాకాలు పెట్టాలి.
-
ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి.
-
కోరినన్ని వర్షాలు ఉన్నాయి.
-
ఔషధాలు తగ్గించుకొని.. పాడి పంటలు సమృద్ధిగా చేసుకుంటే వ్యాధులు ఉండవు.
-
బలి కార్యక్రమం మీకు తోచినట్టు చేస్తున్నారు సంతోషిస్తున్నాను.
-
బాలింతలకు, గర్భిణీలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా దర్శించుకున్న భక్తుల్ని ఇబ్బందులు రాకుండా, సంతోషంగా చూసుకుంటాను.
