సాక్షి, హైదరాబాద్: సౌదీ అరేబియాతో పాటు ఇతర దేశాల్లో మంగళవారం నెలవంక కనిపించడంతో రంజాన్ నెల ప్రారంభమైనట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 19 (గురువారం) నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు పాటిస్తారని ఇప్పటికే ప్రకటించారు. బుధవారం నెలవంక నిర్ధారణ కమిటీ నెలవంక కనిపించినట్లు ప్రకటించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ నెల అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర కమిటీతో పాటు ఢిల్లీలోని కేంద్ర కమిటీతో నెలవంక నిర్ధారణ కమిటీ చర్చలు జరిపి రంజాన్ నెల ప్రారంభంపై ప్రకటన చేయనుంది.
ADVERTISEMENT
ADVERTISEMENT