Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఉన్ని దుప్పటి... ఉతికేది నెలకోసారే!
ADVERTISEMENT 

ఉన్ని దుప్పటి... ఉతికేది నెలకోసారే!

Telangana Sakshi User Sakshi Sakshi Time Dec 1, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
AC.jpg

కనీసం 30 మంది వాడిన తర్వాతే శుభ్రం 

కొత్తదానిలా రోజూ సీల్డ్‌ కవర్‌లో సరఫరా 

రైలు ఏసీ కోచ్‌లలో విడ్డూరం 

డిమాండ్‌కు తగ్గ లాండ్రీ సామర్థ్యం లేకనే..! 

త్వరలో బీఓఓటీ పద్ధతిలో భారీ లాండ్రీలు 

దక్షిణ మధ్య రైల్వే అధికారుల వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: చూడ్డానికి అందంగా ఉంటాయి.. తాకితే మెత్తగా ఉంటాయి.. కానీ, కప్పుకొంటే మాత్రం కంపు కొడుతుంటాయి. రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు అందిస్తున్న దుప్పట్ల పరిస్థితి ఇది. ఈ ఉన్ని దుప్పట్లను వరు సగా 30 రోజులపాటు 30 మంది ప్రయాణికులు వాడుకున్నాకగానీ ఉతకడం లేదు. అయితే, వాటిని నిత్యం మడత నలగకుండా బ్రౌన్‌ కలర్‌ కవర్‌లో పెట్టి అందిస్తుండటంతో శుభ్రం చేసినవే అని ప్రయాణికులు భ్రమపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వాటిని శుభ్రం చేయకుండా 30 రోజులకంటే ఎక్కువే వాడాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేసే లాండ్రీ వ్యవస్థ లేకపోవటమే దీనికి కారణం.

మూడు నెలల నుంచి నెలకోసారి..
గతంలో ఉన్ని దుప్పట్లను మూడు నెలలకోసారి ఉతికేవారు. 2010లో దాన్ని రెండు నెలలకు మార్చారు. అవి అపరిశుభ్రంగా ఉంటున్నాయన్న ఫిర్యాదులతో కనీసం నెలకోసారి ఉతకాలన్న నిర్ణయం తీసుకుని అమలులోకి తెచ్చారు. ఉన్ని దుప్పట్లను కనీసం పక్షం రోజులకోమారైనా ఉతకాలన్నది రైల్వే బోర్డు సూచన. కానీ దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు.  

పాడయ్యే అవకాశం.. 
⇒ ఉన్ని దుప్పట్లను నిత్యం ఉతకటం సాధ్యం కాదు. అలా చేస్తే అవి వెంటనే పాడైపోతాయి. రెండు నెలలకోసారి ఉతికే పద్ధతి ఉన్న సమయంలో ఉన్ని దుప్పటి జీవితకాలాన్ని నాలుగేళ్లుగా లెక్కగట్టారు. నెలకోసారి ఉతకటంతో రెండేళ్లకు తగ్గించారు. 15 రోజులకోమారు ఉతికితే ఏడాదే మన్నుతుంది. ఈ కారణంతో ఉతకటం లేదన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే, డ్రైక్లీనింగ్‌తోపాటు ఇతర ఆధునిక పద్థతుల్లో నాణ్యత దెబ్బతినకుండా తరచూ శుభ్రం చేయాలన్న సూచనలను రైల్వే అధికారులు పట్టించుకోవటం లేదు.  

త్వరలో సమస్యకు పరిష్కారం: దక్షిణ మధ్య రైల్వే 
⇒ భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో బెడ్‌రోల్స్‌ వినియోగించాల్సి రానున్నందున, వాటిని ఎప్పటికప్పుడు ప్రమాణాల మేరకు శుభ్రం చేసే వ్యవస్థను అందుబాటులోకి తేబోతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొత్తగా బీఓఓటీ పద్ధతిలో భారీ సామర్థ్యంతో ఆధునిక లాండ్రీలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్‌/సికింద్రాబాద్, కాచిగూడల్లో 48 టన్నుల సామర్థ్యంతో, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నర్సాపూర్‌లలో 10 టన్నుల సామర్థ్యంతో, తిరుపతిలో 22 టన్నులు, కాకినాడలో 6 టన్నులు, నాందేడ్, పూర్ణాలలో 8 టన్నుల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.

‘సాధారణ బెడ్‌రోల్స్‌ను నిత్యం ప్రమాణాల ప్రకారం శుభ్రం చేసి అందిస్తున్నాం. శుభ్రపరిచే క్రమాన్ని సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నాం. ఉన్ని దుప్పట్లను మాత్రం నెలకోసారి శుభ్రం చేస్తున్నాం. అవి దుర్వాసనతో ఉన్నా, ఇతర అపరిశుభ్రతతో కనిపించినా వెంటనే శుభ్రం చేస్తున్నాం. రెండు బెడ్‌ïÙట్లు ఇస్తున్నందున.. వాటిల్లో ఒకదాన్ని ఈ దుప్పటితో కలిపి వాడటం వల్ల ఉన్ని దుప్పటి అంత తొందరగా అపరిశుభ్రంగా మారదు’అని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. శుభ్రమైన బెడ్‌ రోల్స్‌ను అందించేందుకు వాటి చార్జీని రైలు టికెట్‌ ధరలో భాగంగా వసూలు చేస్తుండటం కొసమెరుపు.  

ఎందుకీ పరిస్థితి?
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిత్యం 116 రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ఈ బెడ్‌ రోల్స్‌ సరఫరా చేయాల్సి ఉంది. నిత్యం ప్రతి బెర్త్‌కు రెండు బెడ్‌ïÙట్లు, ఒక టవల్, దిండు కవర్‌ అందిస్తారు. నిత్యం 38 వేల దుప్పట్లు, 1, 52,000 బెడ్‌షీట్స్‌ సరఫరా చేస్తున్నారు. వీటిని ఉతికించి శుభ్రపరిచేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏడు చోట్ల మెకనైజ్డ్‌ లాండ్రీలున్నాయి. రోజుకు 2 టన్నుల బెడ్‌రోల్స్‌ను శుభ్రపరిచే సామర్థ్యంతో సికింద్రాబాద్‌లో డిపార్ట్‌మెంటల్‌ లాండ్రీ ఉంది. ఇది రైల్వే సొంత లాండ్రీ. కాచిగూడలో 12 టన్నుల సామర్థ్యం, తిరుపతిలో 2.5 టన్నులు, కాకినాడలో 4 టన్నులు, విజయవాడలో 1.5 టన్నులు, నాందేడ్‌లో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన లాండ్రీలున్నాయి.

 ఇవన్నీ ప్రైవేట్‌ సంస్థలు బీఓఓటీ (బిల్ట్‌ ఓవన్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌) పద్ధతిలో ఏర్పాటు చేసినవి. అయితే, ఇవి దక్షిణ మధ్య రైల్వే అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇటీవల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే నడిపిన కొన్ని ప్రత్యేక రైళ్లలోని ఏసీ కోచ్‌లలో బెడ్‌ రోల్స్‌ సరఫరా చేయలేదు. ఈ విషయాన్ని ముందుగానే రైల్వేశాఖ ప్రకటించింది. క్రమంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో రైళ్ల సంఖ్య కూడా పెంచాల్సి వస్తోంది. ఇటీవల థర్డ్‌ ఏసీ ఎకానమి పేరుతో కొత్త క్లాస్‌ను సృష్టించటంతో రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్య పెరిగింది. ఫలితంగా బెడ్‌ రోల్స్‌ సంఖ్య కూడా పెంచాల్సి వచి్చంది. కానీ, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచే సామర్థ్యం లేకుండాపోయింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Blankets
train
AC
Coach
Laundry
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.