Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. భూ భారతితోపాటు భూ విలువల పెంపు
ADVERTISEMENT 

భూ భారతితోపాటు భూ విలువల పెంపు

Telangana Sakshi User Sakshi Sakshi Time Mar 25, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
PONGULETI321.jpg

ఉగాది తర్వాత మంచిరోజున అమల్లోకి.. 

మీడియాతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఉగాది తర్వాత మంచిరోజున భూ భారతి చట్టాన్ని అమల్లోకి తేవడంతో పాటు అదేరోజు భూముల విలువలను కూడా పెంచనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భూముల విలువలు పెంచాలని గతంలోనే భావించినా.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మందకొడిగా ఉండడం, దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వాయిదా వేశామని చెప్పారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.5 వేల కోట్లు పెరుగుతుందని బడ్జెట్‌లో ఎలా చెబుతారన్న ప్రశ్నకు స్పందించారు. ‘రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకోవడం, భూముల విలువల సవరణను అమల్లోకి తీసుకుని వస్తున్నందున ఆదాయం పెరుగుతుంది. భూముల విలువలను మార్కెట్‌ ధరలకు అనుగుణంగా శాస్త్రీయంగా అధ్యయనం చేసి పెంచాం. అదే సమయంలో మార్కెట్‌ ధర కంటే ఎక్కువ ఉన్నచోట తగ్గిస్తాం..’అని మంత్రి వివరించారు.  
ఐదారు వేలమందికి సర్వేయర్‌ లైసెన్సులిస్తాం 
‘భూముల రిజిస్ట్రేషన్లకు ఇకపై సర్వే మ్యాపులను తప్పనిసరి చేయనున్నాం. భూమి విక్రయించే వారు తమ పాస్‌ పుస్తకంలో ఉన్న భూమి ఆధారంగా సర్వే చేయించి మ్యాపులు జోడించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వ్యవసాయ భూములకు, ఆ తర్వాత ప్లాట్లకు అమలు చేస్తాం. సర్వేయర్ల కొరత తీర్చడానికి వెయ్యి మందిని రిక్రూట్‌ చేసుకుంటాం. ప్రతి మండలంలో సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్‌ని నియమిస్తాం. అలాగే రాష్ట్రంలో ఐదారు వేల మందికి శిక్షణ ఇచ్చి వారికి సర్వేయర్‌ లైసెన్స్‌లు మంజూరు చేస్తాం.  
ఏ అధికారి రిజిస్ట్రేషన్‌ చేస్తారో తెలియకుండా ఏర్పాట్లు 
    రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే 15 ప్రధాన సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ, స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరి చేస్తాం. క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే వాటిని పరిష్కరించిన తర్వాత దీనిని రాష్ట్ర వ్యాప్తం చేస్తాం. నాలుగైదు సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను ఒకేచోట చేర్చి కౌంటర్లు పెడ్తాం. ఏ అధికారి రిజిస్ట్రేషన్‌ చేస్తారో తెలియకుండా చూస్తాం. టోకెన్‌ నంబర్లు ఇచ్చి.. ఏ కౌంటర్‌లో నంబర్‌ వస్తే అక్కడ రిజిస్ట్రేషన్‌ జరిగేలా చేస్తాం. దీనివల్ల అవినీతి తగ్గుతుంది. ఇదివరకు ప్రకటించినట్లు ధరణిపై ఫోరెన్సిక్‌ అడిట్‌ నిర్వహిస్తాం. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న దాదాపు 12 లక్షల సాదా బైనామాలను మాత్రమే పరిష్కరిస్తాం..’అని పొంగులేటి చెప్పారు.

గ్రామ పరిపాలన అధికారులకు పరీక్ష 
‘రాష్ట్రంలో 10,956 వీఆర్‌వో పోస్టులను మంజూరు చేశాం. ప్రస్తుతం వివిధ డిపార్ట్‌మెంట్‌లలో పనిచేస్తున్న వీఆర్‌వో, వీఆర్‌ఏలను ఈ పోస్టుల్లో నియమించడానికి ఇంటర్‌ అర్హతగా నిర్వహించే రాత పరీక్షకు 2,3 రోజుల్లో నోటిఫికేషన్‌ ఇస్తున్నాం. ఈ అర్హత ఉన్నవారు 6 వేల మంది వరకు ఉంటారు. వారిలో ఉత్తీర్ణత సాధించిన వారిని సర్దుబాటు చేస్తాం. మిగిలిన వారిని డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేస్తాం. లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ను మార్చి 31 తరువాత పొడిగించే యోచన ప్రస్తుతానికి లేదు’అని మంత్రి తెలిపారు.   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
ponguleti srinivasa reddy
Revenue department
real estate
Land Value
Telangana
సంబంధిత పోల్స్
Loading..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.