Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. MMTS Train: రైల్వే భద్రత కట్టుదిట్టం!
ADVERTISEMENT 

MMTS Train: రైల్వే భద్రత కట్టుదిట్టం!

Telangana Sakshi User Sakshi Sakshi Time Apr 6, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
1445.jpg

 సీసీ కెమెరాల ఏర్పాటుకు కసరత్తు 

మహిళలకు అవగాహన కార్యక్రమాలు 

బోగీల్లో సీసీ కెమెరాల బిగింపునకు కసరత్తు

ఎంఎంటీఎస్‌ల్లో నిరంతర నిఘా

సికింద్రాబాద్‌– మేడ్చల్‌ ఎంఎంటీఎస్‌ రైలులో అత్యాచార యత్నం ఘటన రైల్వే పోలీసుల డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. ఘటన జరిగి 15 రోజులు గడిచినా ఈ కేసు మిస్టరీ వీడనేలేదు. అధునాతన సాంకేతికతను సొంతం చేసుకున్నామంటూ గొప్పలు చెప్పే నగర పోలీసులు.. అత్యాచార యత్నం కేసు గుట్టు విప్పలేకపోయారు. కాగా.. ఈ ఘటన రైల్వే పోలీసులకు కనువిప్పు కలిగించింది.  భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. ఇటు జీఆర్‌పీ, అటు ఆర్‌పీఎఫ్‌ పోలీసు బాస్‌లు మహిళలే ఉండడంతో ఎంఎంటీఎస్‌ రైళ్లు, రైల్వేస్టేషన్లలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు.  

తనపై లైంగిక దాడికి యత్నించడంతో ఓ యువతి బోగీ నుంచి కిందకు దూకిన ఘటనతో ఎంఎంటీఎస్‌ రైళ్లలో నిరంతర పోలీసు భద్రత అందుబాటులోకి వచి్చంది. ఉదయం 5 మొదలు అర్ధరాత్రి 12 గంటల వరకు రైల్వే పోలీసులు ఎంఎంటీఎస్‌ రైళ్లలో పహారా కాసేలా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ డివిజన్ల పరిధిలోని అన్ని మార్గాల్లో రాకపోకలు సాగించే ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఒక్కో రైలుకు ఇద్దరు ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది విధుల్లో ఉంటున్నారు. ఇందుకోసం వాట్సాప్‌ గ్రూపును క్రియేట్‌ చేసిన ఆర్‌పీఎఫ్‌ ఆఫీసర్లు ఏ రూటు ఎంఎంటీఎస్‌లో ఎవరు డ్యూటీలో ఉన్నారు? ఆ రైలులో మహిళల బోగీల పరిస్థితి ఏంటన్న విషయాన్ని వీడియో కాల్స్, ఫోటోల పోస్టింగ్‌ల ద్వారా ఆరా తీస్తున్నారు.   

రైలు బోగీల్లో సీసీ కెమెరాలు.. 
నగరంలో నడుస్తున్న నాలుగైదు ఎంఎంటీఎస్‌ రైళ్లలో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. సత్వరమే అన్ని ఎంఎంటీఎస్‌లలోని మహిళల బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎంఎంటీఎస్‌ స్టేషన్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అంశాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు పరిశీలిస్తున్నారు.  మహిళలు వారికి కేటాయించిన బోగీల్లో మాత్రమే ఎక్కాలని అవగాహన కలిగిస్తున్నారు.  

స్టేషన్లలో భద్రత పెంపు.. 
30 స్టేషన్ల నుంచి సుమారు 92 వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో 40 నుంచి 60 వేల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నట్టు అంచనా. అత్యాచార ఘటనకు ముందు కేవలం 9 ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో మాత్రమే ఒక్కో స్టేషన్‌లో ఒక్కో కానిస్టేబుల్‌ చొప్పున విధుల్లో ఉండేవారు. ఘటన అనంతరం ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే 15 రైల్వేస్టేషన్లలో ఆర్‌పీఎఫ్‌ పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఆర్‌పీఎఫ్‌ పోలీసుల్లో కూడా సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో జీఆర్‌పీ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమేణా అన్ని స్టేషన్లలో పోలీసు పహారా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అత్యాచార యత్నం ఘటన నేపథ్యంలో రైల్వే పోలీసులు తీసుకుంటున్న రక్షణ చర్యల పట్ల మహిళా ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైలు బోగీల్లోనే కాకుండా ఎంఎంటీఎస్‌ స్టేషన్లలోనూ భద్రత పెంచాలని చెబుతున్నారు. ఇది నిరంతర కొనసాగించాలని కోరుతున్నారు.

ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం 
రైల్వే ప్రయాణికులకు రక్షణ కలి్పంచడం కోసం ప్రత్యేక మొబైల్‌ బృందాలను ఏర్పాటు చేశామని జీఆర్‌పీ సికింద్రాబాద్‌ ఎస్‌పీ చందనా దీప్తి తెలిపారు. మహిళలు ప్రమాదకర పరిస్థితులు ఎదురైన సందర్భాల్లో 139 నెంబర్‌కు కాల్‌ చేయాలని కోరారు ఒక్కో రైలుకు ఇద్దరేసి గార్డులను ఎస్కార్టు డ్యూటీలో నియమించామని ఆర్‌పీఎఫ్‌ సీనియర్‌ డివిజనల్‌ సెక్యురిటీ ఆఫీసర్‌ దేబాస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ తెలిపారు.    

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Police
Security
Hyderabad
MMTS
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.