Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. రేపటి నుంచి సిద్దిపేటలో  రైలుకూత
ADVERTISEMENT 

రేపటి నుంచి సిద్దిపేటలో  రైలుకూత

Telangana Sakshi User Sakshi Sakshi Time Oct 2, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
madi33.jpg

సాక్షి, హైదరాబాద్‌: సిద్దిపేట–సికింద్రాబాద్‌ మార్గంలో రెండు ప్యాసింజర్‌ రైళ్లు మంగళవారం నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేటతో పాటు గజ్వేల్, ప్రముఖ పుణ్యక్షేత్రాలైన నాచగిరి (నాచారం),  కొమురవెల్లి తదితర ప్రాంతాల మీదుగా సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రోజుకు రెండు ప్యాసింజర్‌ రైళ్లు తిరుగుతాయి. తొలుత కాచిగూడ–సిద్దిపేట మధ్య రైళ్లు తిప్పాలని భావించినా, ఆయా ప్రాంతాల నుంచి ఎక్కువ మంది సికింద్రాబాద్‌కు వస్తున్నందున,  సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచే రైళ్లు నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది.  

సికింద్రాబాద్‌–సిద్దిపేట  (నిడివి 116 కిలోమీటర్లు) 

  •  డెమూ రైలుచార్జీ :రూ.60 
  • హాల్ట్‌స్టేషన్లు: మల్కాజిగిరి, కెవలరీ బ్యారక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట 

 ట్రిప్పులు ఇలా... 

  •  సిద్దిపేటలో రైలు(నంబరు:07483) ఉదయం 6.45కు బయలుదేరి సికింద్రాబాద్‌కు 10.15కు చేరుకుంటుంది.  
  • తిరిగి సికింద్రాబాద్‌లో రైలు (నంబరు:07484) ఉదయం 10.35కు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకుంటుంది.  
  •  తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి సిక్రింద్రాబాద్‌కు సాయంత్రం 5.10 గంటలకు చేరుకుంటుంది.  
  • సికింద్రాబాద్‌లో సాయంత్రం.5.45 గంటలకు బయలుదేరి సిద్దిపేటకు రాత్రి 8.40 గంటలకు చేరుకుంటుంది.  
  • అయితే ఉదయం సిద్దిపేట బదులు సికింద్రాబా­ద్‌ నుంచే  రైలు బయలుదేరేలా చూడాలని స్థాని­క నేతలు రైల్వేకు లేఖ రాశారు. దీనికి రైల్వే సమ్మతిస్తే ఈ వేళలు అటూ ఇటుగా మారుతాయి.  
  • సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ నుంచి సిద్దిపేటకు ఎక్స్‌ప్రెస్‌ బస్సుచార్జీ రూ.140. ప్రయాణ సమ­యం రెండున్నర గంటలు. రైలులో ప్రయాణ సమయం కాస్త ఎక్కువగా ఉన్నా, చార్జీ మాత్రం బస్సుతో పోలిస్తే సగానికంటే తక్కువగా ఉంది. రైలులో సికింద్రాబాద్‌–సిద్దిపేట మధ్య రానుపోను రూ.120 అవుతుండగా, పాస్‌ తీసుకుంటే రూ.90 ఉండొచ్చు. 

కృష్ణా టు రాయచూర్‌ రైలు రాకపోకలు షురూ 

మహబూబ్‌నగర్‌–మునీరాబాద్‌ (కర్ణాటక) మధ్య 234 కి.మీ. నిడివితో నిర్మించే రైల్వే ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కృష్ణా వరకు పనులు పూర్తి కావటంతో కొత్త రైలు సర్విసు ప్రారంభమైంది. కాచిగూడ–బెంగుళూరు మార్గంలో ఉన్న దేవరకద్ర నుంచి కొత్తలైన్‌ మొదలు, అటు సికింద్రాబాద్‌–వాడీ మార్గంలో ఉన్న కర్నాటక సరిహద్దు స్టేషన్‌ అయిన కృష్ణాకు ఇది అనుసంధానమైంది. దీంతో కాచిగూడ నుంచి కృష్ణా స్టేషన్‌ మీదుగా కర్ణాటకలోని రాయచూరు వరకు ప్యాసింజర్‌ డెమూ రైలు సర్విసును ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహ­బూ­బ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో  జెండా ఊపి ప్రారంభించారు. దీంతో కృష్ణా నుంచి కొత్త రైలు బయలుదేరి  కాచిగూడకు చేరుకుంది. సోమ­వారం నుంచి కాచిగూడ–రాయచూరు మధ్య ప్రారంభమవుతుంది.  

రైలుచార్జీ: 85.. రోజుకు ఒకటే ట్రిప్పు 

కాచిగూడ–రాయచూరు (నిడివి 221 కిలోమీటర్లు)  ప్రస్తుతం స్పెషల్‌ సర్వీసుగా ఉన్నందున ఎక్స్‌­ప్రెస్‌ చార్జీలున్నాయి. రెగ్యులర్‌ సర్విసుగా మారిన తర్వాత ఆర్డినరీ చార్జీలు అమలులోకి వస్తాయి. అప్పుడు చార్జీ రూ.50 ఉంటుంది.హాల్ట్‌స్టేషన్లు: కాచిగూడ, మలక్‌పేట, డబీర్‌పురా, యాకుత్‌పురా, ఉప్పుగూడ, ఫలక్‌నుమా, శివరాంపల్లి, బుద్వేల్, ఉందానగర్, తిమ్మాపూర్, కొత్తూ­రు, షాద్‌నగర్, బూర్గుల, బాలానగర్, రాజా­పురా, గొల్లపల్లి, జడ్చర్ల, దివిటిపల్లి, యెనుగొండ, మహబూబ్‌నగర్, మన్యంకొండ, దేవరకద్ర, మరికల్, జక్లేర్, మక్తల్, మాగనూరు, కృష్ణా, చిక్‌సుగుర్, రాయచూరు

రైలు (నంబరు:07477) వేళలు ఇలా  

  • కాచిగూడలో ఉదయం 9.40కి బయలు దేరి 11.50గంటలకు మహబూబ్‌నగర్, 12.14కు దేవరకద్ర,  మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా, 3 గం.కు రాయచూరు చేరుకుంటుంది.  
  • తిరిగి రాయచూరులో మధ్యాహ్నం.3.30 గంటలకు రైలు(నంబరు:07478)బయలుదేరి 3.49కి కృష్ణా, 5.29కి దేవరకద్ర, 6.05కు మహబూబ్‌నగర్‌ రాత్రి 9.10గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Secunderabad
SIDDIPET
two trains
services
krishna
raichur
train services
starting
Narendra Modi
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.