Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. Pashamylaram: అప్పుడే మేల్కొనుంటే..
ADVERTISEMENT 

Pashamylaram: అప్పుడే మేల్కొనుంటే..

Telangana Sakshi User Sakshi Sakshi Time Jul 1, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
45.jpg

నాడు ఎస్‌బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో 

రియాక్టర్‌ పేలి ఆరుగురు మృతి.. 

ఇదే తరహాలో ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో ఘటన..

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గతేడాది మార్చిలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్‌లో ఎస్‌బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలి ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు సైతం శిథిలమయ్యాయి. ఈ ఘటనలో అమాయక కారి్మకుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా 30 మంది క్షతగాత్రులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భారీ ఘటనతోనైనా సంబంధిత అధికారులు మేల్కొని ఉంటే..ఇప్పుడు ఇలా సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు ఘటన పునరావృతం అయ్యేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్‌బీ ఆర్గానిక్స్‌ ప్రమాదం జరిగినప్పుడు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి..ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే దానిపై కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ కనీసం నిబంధనలు పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. 

కీలకపని ప్రదేశాల్లో స్కిల్డ్‌ లేబర్‌ లేక.. 
పరిశ్రమల్లో కీలక పని ప్రదేశాల్లో స్కిల్డ్‌ లేబర్‌తో పనిచేయించాలి. ముఖ్యంగా రియాక్టర్లు, బాయిలర్లు, బ్లోయర్లు, ఇలా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సంబంధిత అంశాల్లో అన్ని అర్హతలున్నవారికి విధులను అప్పగించాలి. కానీ, తక్కువ వేతనాలకు పనిచేస్తారనే కారణంగా ఇలాంటి కీలక ప్రదేశాల్లో అన్‌స్కిల్డ్‌ కార్మికులతో పనులు చేయించడంతో ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న పరిశ్రమల యాజమాన్యాలు ఇలా కారి్మకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు ఏవీ.. 
పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలను పాటించేలా ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ, ఈ తనిఖీలు జిల్లాలో మొక్కుబడిగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఆయా పరిశ్రమల నుంచి ప్రతినెలా ఠంఛనుగా మామూళ్లు పొందుతున్న ఈ శాఖ అధికారులు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించకపోయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎస్‌బీ ఆర్గానిక్‌ పరిశ్రమ ప్రమాదానికి కొద్దిరోజుల ముందే ఇదే హత్నూర మండలంలో కోవాలెంట్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కారి్మకులు మృత్యువాత పడ్డారు. ఇలా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ.. సంబంధిత అధికారుల్లో కనీసం చలనం లేకుండా పోయింది.

ప్రమాదం జరిగాక హడావుడి 
సంబంధిత అధికారులు ఇలా ప్రమాదం జరిగాక హడావుడి చేస్తున్నారే తప్ప ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఎస్‌బీఆర్గానిక్స్‌ భారీ పేలుడు ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో అంతకుమించి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో కారి్మకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రభుత్వం ఇకనైనా స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా నిబంధనలను అమలు చేయాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
patancheru
Hyderabad
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.