Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. TS: హమ్మయ్యా.. ఆ పులులు సేఫ్‌!
ADVERTISEMENT 

TS: హమ్మయ్యా.. ఆ పులులు సేఫ్‌!

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 13, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Tigers1.jpg

కొమురం భీం, సాక్షి: కాగజ్‌ నగర్ అటవీ ప్రాంతంలో కలకలం రేపిన పులుల మృత్యువాత సంఘటనలో అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి.. రెండు పులులపై విష ప్రయోగం జరిగినట్టు గుర్తించిన అటవీశాఖ సెర్చ్ ఆపరేషన్ ను సీరియస్ గా తీసుకుంది. చివరికి మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టిన అనంతరం తల్లి పులి రెండు పిల్లల జాడ ట్రాప్ కెమెరాలకు చిక్కడంతో ఆపరేషన్ ను నిలిపివేసింది.

కొమురంభీం జిల్లా కాగజ్ నగర రేంజ్ దరిగాం అడవుల్లో టైగర్ సర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. మూడు రోజుల  విస్తృత గాలింపు‌ తర్వాత ఎట్టకేలకు కనిపించకుండా పోయిన S6 పులి దాని రెండు పిల్లలు ట్రాప్ కెమెరాకు చిక్కాయి. దరిగాం అడవిలో విష ప్రయోగంతో చనిపోయిన రెండు పులులతో పాటు మరో రెండు పులులు మిస్ అవడంపై అలర్ట్ అయిన  జిల్లా అటవీశాఖ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.. మూడు వందల మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. 72 బృందాలు , 105 ట్రాప్ కెమెరాల తో మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టారు అటవీ శాఖ అధికారులు.. అయితే సిబ్బందికి  మిస్ అయిన పులులు కనిపించడంతో ఆపరేషన్ సక్సెస్ గా ముగిసింది. ఎస్ 6  తల్లి పులితో పాటు కనిపించకుండా పోయిన పులి పిల్లలు సైతం క్షేమంగా ఉన్నాయంటూ తేల్చింది కొమురంభీం జిల్లా అటవీ శాఖ. 

గత ఏడాది డిసెంబర్ 27 న దరిగాం అటవి ప్రాంతంలో ఎస్ 9 పులి ఓ పశువు పై దాడి చేయగా.. ఆ పశువును మరోసారి తిన్న కే15  పులి ఈనెల 6 న మృత్యువాత పడింది. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే  ఐదేళ్ల మగపులి ఎస్ 9 సైతం మరణించింది. దీంతో పులి మరణాల కేసును సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాదికారులు లోతుగా దర్యాప్తు‌ చేయడంతో.. పశువుపై విష ప్రయోగం జరిగినట్టు తేలింది. ఆ పశువు మృతి చెందిన సమీపంలో నాలుగు పులుల పాదముద్రలు‌ లభించడంతో ఆందోళన చెందింది అటవీశాఖ.

దీంతో అలర్ట్ అయిన అటవిశాఖ చనిపోయిన పులులతో పాటు పశువు మాంసం తిన్న మరో రెండు పులుల కోసం అన్వేషణ సాగించింది. ఈనెల 9 న టైగర్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభింవింది.. మొదటి రోజు 14 ట్రాకింగ్ టీములు, 22 ట్రాప్ కెమెరాలతో దరిగాం అటవి ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. 24 గంటలు దరిగాం అడవిని జల్లెడ పట్టిన మిస్ అయిన పులుల ఆచూకీ లభించకపోవడంతో ట్రాకింగ్ టీం‌ను 72 కు పెంచింది.

దరిగాం అటవీ ప్రాంతంతో పాటు సర్కపల్లి, గోంది అటవి ప్రాంతంలోను సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేసిన అటవీ శాఖ 105 కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేసింది. దీంతో ఈనెల 11 న దరిగాం గోంది అటవి ప్రాంతంలో మరో పశువుపై పులి‌దాడి చేసి హతమార్చగా.. ఆ పశువు వద్ద ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు పులి చిక్కింది. దాని పాదముద్రల ఆధారంగా మూడేళ్ల వయస్సున ఆడపులి.. ఎస్ 6 గా గుర్తించిన అటవిశాఖ ఊపిరి పీల్చుకుంది.  73వ క్యాంపు వారికి కే 14 పులి పాదముద్రలు 51 క్యాంప్ టీంకు కే 16, 17 పాదముద్రలు లభించడంతో సర్చ్ ఆపరేషన్ ని నిలిపివేసింది.

62 గంటల పాటు ఓ యుద్దంలా సాగిన టైగర్ సర్చ్ ఆపరేషన్ పులులు క్షేమంగా ఉన్నాయన్న సమాచారంతో సక్సెస్ గా ముగియగా.. దరిగాం అటవీ ప్రాంతంలో లెక్కకు మించి పులుల సంచారం సాగుతుందన్న సమాచారంతో అటవిశాఖకు మరింత దృష్టి సారించింది. ఇప్పుడు ఆ పులులను వేటగాళ్ల కంటపడకుంటా క్షేమంగా కాపాడటం.. ఆ పులులతో మనుషులకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూడటం తప్పని సరిగా మారింది. 

మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలోని ఓ రైతుకు పత్తి చేనులో పులి కనిపించింది.  వెంటనే రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.  పులి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పారెస్ట్ అదికారులు గుంపులు గుంపులు చేనులల్లో పనులు చేసుకోవాలని ఫారెస్ట్ కర్జెల్లి రేంజ్ అధికారి నవ్య రైతులకు సూచిస్తున్నారు. ఇటు దరిగాం అటవీ సంఘటన లో పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు వేగం చేశారు.. నిర్లక్ష్యం వహించిన అధికారులపై సైతం చర్యలు తీసుకునే అవకాశం లేపోలేదని తెలుస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
komaram bheem district
Tiger
Search operation
forest
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అరణ్యరోదన

అరణ్యరోదన

ఆన్‌లైన్‌ ఆంక్షలతో అడవి బిడ్డల ఆవేదన

ఆన్‌లైన్‌ ఆంక్షలతో అడవి బిడ్డల ఆవేదన

గుండం ప్రాంతంలో పెద్దపులి

గుండం ప్రాంతంలో పెద్దపులి

పులి కలకలం.. ఆవు దూడను 100 మీటర్లు లాక్కెళ్లి..

పులి కలకలం.. ఆవు దూడను 100 మీటర్లు లాక్కెళ్లి..

అటవీ సంపదకు చెదలు

అటవీ సంపదకు చెదలు

అమ్మో... పులి

అమ్మో... పులి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.