Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. కన్నీటి జ్ఞాపకాలు
ADVERTISEMENT

కన్నీటి జ్ఞాపకాలు

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 3, 2026 01:23 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
akka-marraige.jpg

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఆ ప్రమాదం ఏకంగా 19 మందిని పొట్టనబెట్టుకుంది.. 27 మందిని ఆస్పత్రులపాలు చేసింది.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది.. తీరని శోకాన్ని మిగిల్చింది.. చేవెళ్లలోని మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు, కంకర టిప్పర్‌ ఢీకొన్న విషాదకర ఘటనకు నేటితో ఏడాది పూర్తయింది.. అయినవారిని కోల్పోయిన కుటుంబీకులు ఇది తలుచుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు.    
– చేవెళ్ల/తాండూరు/బషీరాబాద్‌/యాలాల/ధారూరు


ఢీకొన్న ఆర్టీసీ బస్సు, కంకర టిప్పర్‌ (ఫైల్‌) 

చేవెళ్లలోని మీర్జాగూడ ఆర్టీసీ బస్సు, కంకర టిప్పర్‌ ఢీకొన్న ఘటన చేదు జ్ఞాపకంగా మిగిలింది. రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద రెండో రోడ్డు ప్రమాదంగా నిలిచిపోయింది. మృతులు, క్షతగ్రాతుల కుటుంబాలు ఈ విషాదం నుంచి ఇంకా కోలుకోలేదు. ఎంతో మంది కుటుంబాలకు మానని గాయంగా మారిన ఈ దుర్ఘటన సరిగ్గా ఇదే రోజు (2025 నవంబర్‌ 3)న చోటుచేసుకుంది. తాండూరు, వికారాబాద్‌ నుంచి 72 మంది ప్రయాణికులు ఉద్యోగాలు, చదువులు, బంధువుల వద్దకు ఇలా.. వారివారి పనులకోసం ఎక్కిన బస్సు మృత్యుశకటంగా మారింది.  


వివాహ వేడుకలో సాయిప్రియ, నందిని, తనూష (ఫైల్‌) 

అక్కపెళ్లికి వచ్చి ముగ్గురు.. 
ఏడాది క్రితం జరిగిన బస్సు దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా అందులో తాండూరు ప్రాంతానికి చెందిన 14 మంది ఉన్నారు. పట్టణానికి చెందిన ఎల్లయ్యగౌడ్‌కు ఐదుగురు సంతానం. హైదరాబాద్‌లో చదువుకొంటున్న సాయిప్రియ, నందిని, తనూష అక్క పెళ్లి కోసం తాండూరుకు వచ్చి అసువులు బాసారు. నేడు సంవత్సరీకం కావడంతో హైదరాబాద్‌లో చదువుకుంటున్న కుమారుడిని తీసుకురావడానికి తల్లిదండ్రులు వెళ్లారు.

కంకరలో కూరుకుపోయి..  
చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోకి రాగానే ఎదురుగా అధిక లోడ్‌తో వచి్చన కంకర టిప్పర్‌ చిన్న గుంతను తప్పించబోయి బస్సుపై పడిపోయింది. బస్సులో సగానికి పైగా కంకర నిండిపోయి 19 మందిని సజీవ సమాధి చేసింది. కంకరలో సగానికిపైగా ఇరుక్కుపోయిన 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన 19 మంది కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం ప్రకటించింది. మృతులకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షలు అందించింది.


ప్రమాదంలో చనిపోయిన తల్లిదండ్రుల ఫొటోతో శిరీష 

చెల్లి బాధ్యతలు భుజాన వేసుకొని.. 
బస్సు ప్రమాద ఘటనలో యాలాల మండలం హాజీపూర్‌కు చెందిన బందెప్ప, లక్ష్మీ దంపతులు మృతి చెందారు. వారి కూతుళ్లు శిరీష, భవానీ అనాథలయ్యారు. 8వ తరగతి చదువుతున్న శిరీష చదువు మానేసి చెల్లి బాధ్యతలు తీసుకుంది. ఒకవైపు కుట్టు శిక్షణ తీసుకుంటూ మరోవైపు రోజువారీ కూలీకి వెళ్తోంది. ప్రస్తుతం తాము ఉంటున్న ఇల్లు శిథిలావస్థకు చేరిందని, వ్యక్తిగత మరుగుదొడ్డి లేదని బాధిత బాలికలు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్న హామీ నెరవేరలేదని వాపోయారు.

కొనసాగుతున్న రోడ్డు మరమ్మతు పనులు 
హైదరాబాద్‌ – బీజాపూర్‌ జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 163 ఇరుగ్గా ఉండడంతోపాటు గుంతల కారణంగా ప్రమాదానికి ప్రధాన కారణంగా మారింది. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించింది. 18 నెలల్లో పూర్తి చేయిస్తామని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ అప్పట్లో ప్రకటించారు. పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది.  


మిషన్‌ కుడుతున్న హసీనాబేగం 

బట్టలు కుడుతూ.. బతుకుబండి నడిపిస్తూ.. 
బస్సు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్‌ దస్తగిరి కుటుంబం ఆధారాన్ని కోల్పోయింది. మొదటి భార్య హసీనా బేగం ఇద్దరు కుమారులతో కలిసి యాలాల మండలం చెన్నారంలో తల్లి ఖాజాబీ వద్ద ఉంటోంది. ఇద్దరు కుమారుల భవిష్యత్తు కోసం ఆమె కుట్టుపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.9 లక్షల పరిహారాన్ని మొదటి భార్య, రెండో భార్య, తల్లికి కుల పెద్దల సమక్షంలో సమంగా అందజేశారు. బస్సు బీమా సాయం అందలేదని, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇప్పిస్తామన్న హామీ నెరవేరలేదని హసీనా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంటర్‌ పూర్తి చేసిన తనకు ఉద్యోగం కల్పిస్తే పిల్లలను చదివించుకుంటానని వేడుకుంటోంది. మంతట్టిలోని ఇల్లు పూర్తిగా కూలిపోయిందని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతోంది. మరోవైపు దస్తగిరి తల్లి షాకత్‌ బేగం మంచానికే పరిమితం కాగా, రెండో భార్య సాజిదా బేగం ఆమెకు తోడుగా ఉంటోంది.  


కూతురు అఖిలారెడ్డి ఫొటోతో తల్లి అలవేలు 

ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దు 
ఉన్నత చదువులే లక్ష్యంగా సాగుతున్న తమ కూతురు అఖిలారెడ్డి బస్సు ప్రమాదంలో చనిపోవడం నేటికీ తమను కుంగదీస్తోందని యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌ గ్రామానికి చెందిన మృతురాలి తల్లి అలివేలు కన్నీటిపర్యంతమయ్యారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు కారణంగానే తమ కూతురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకూ రాకూడదన్నారు. తన కుమారుడికి ఉద్యోగ విషయమై సాయం కోరితే ఇప్పటికీ నెరవేరలేదన్నారు.  

తలుచుకుంటే ఇప్పటికీ వణుకు 
మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదం మరిచిపోలేకపోతున్నా. ఆ దేవుడు దయతో బతికి బయటపడ్డా. ఈ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ వణుకుపుడుతోంది. కాళ్లు కంకరలో ఇరుక్కుపోగా స్థానికులు బయటకు తీయడంతో గాయాలతో బయటపడ్డాను. నడుము, కాళ్ల నొప్పులు ఇప్పటికీ తగ్గడం లేదు. ఆస్పత్రులకు తిరిగి రూ.లక్షకుపైనే ఖర్చు చేశాను. ప్రభుత్వాలు అందించిన రూ.2.50 లక్షల సాయంతో వైద్య ఖర్చులతోపాటు తీసుకున్న అప్పులు కట్టుకున్నాను.   
–  నర్సింలు, బాధితుడు, అంతారం, చేవెళ్ల మండలం

ఆరోగ్యం కుదుటపడలేదు 
‘బస్సు ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డా. ఏడాది కావస్తున్నా వైద్యం చేయించుకుంటూనే ఉన్నా.. ఇంతవరకు ఆరోగ్యం కుదుటపడలేదు. గర్భసంచి వద్ద రక్తం గడ్డ కట్టింది. మంగళవారం ఆపరేషన్‌ చేయించుకుంటున్నా. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ డబ్బు వైద్యం కోసం వెచి్చంచా. ప్రైవేటుగా చూపించుకునే స్థోమత లేక ప్రభుత్వ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా. ప్రస్తుతం స్వీపర్‌గా పని చేస్తున్నా. ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తే అదే కొండంత సాయం’ అంటోంది ధారూరుకు చెందిన నాగమణి.   

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
one year compleate
Road Accident
Telangana
Ranga Reddy District
Akka
rtc bus
Marriage
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘ఆర్టీసీ కండక్టర్‌ ప్రవళికను నేను తోయలేదు.. తనే పడిపోయింది’

‘ఆర్టీసీ కండక్టర్‌ ప్రవళికను నేను తోయలేదు.. తనే పడిపోయింది’

రేవంత్‌ రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’: కేటీఆర్‌

రేవంత్‌ రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’: కేటీఆర్‌

అమెరికన్లే టార్గెట్‌.. ఫేక్‌ కాల్‌ సెంటర్లపై ఈడీ దాడులు.. ముగ్గురి అరెస్ట్‌

అమెరికన్లే టార్గెట్‌.. ఫేక్‌ కాల్‌ సెంటర్లపై ఈడీ దాడులు.. ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హాస్టల్స్‌ ఖాళీ!

హైదరాబాద్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హాస్టల్స్‌ ఖాళీ!

సాయంత్రం 4లోపే ఇంటికి వెళ్లండి.. ఐటీ ఉద్యోగులకు సూచన!

సాయంత్రం 4లోపే ఇంటికి వెళ్లండి.. ఐటీ ఉద్యోగులకు సూచన!

పేటెంట్‌ సెర్చ్‌.. వెరీ ఈజీ

పేటెంట్‌ సెర్చ్‌.. వెరీ ఈజీ

మరిన్ని వార్తలు

‘ఆర్టీసీ కండక్టర్‌ ప్రవళికను నేను తోయలేదు.. తనే పడిపోయింది’

‘ఆర్టీసీ కండక్టర్‌ ప్రవళికను నేను తోయలేదు.. తనే పడిపోయింది’

హైదరాబాద్‌లో జంట హత్యల కలకలం

హైదరాబాద్‌లో జంట హత్యల కలకలం

‘ఈడీ విచారణలో నాకు తెలిసిన సమాచారాన్ని చెప్పా’

‘ఈడీ విచారణలో నాకు తెలిసిన సమాచారాన్ని చెప్పా’

రేవంత్‌ రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’: కేటీఆర్‌

రేవంత్‌ రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’: కేటీఆర్‌

అమెరికన్లే టార్గెట్‌.. ఫేక్‌ కాల్‌ సెంటర్లపై ఈడీ దాడులు.. ముగ్గురి అరెస్ట్‌

అమెరికన్లే టార్గెట్‌.. ఫేక్‌ కాల్‌ సెంటర్లపై ఈడీ దాడులు.. ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హాస్టల్స్‌ ఖాళీ!

హైదరాబాద్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హాస్టల్స్‌ ఖాళీ!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft