నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కొనసాగుతున్న నుమాయిష్ కుసందర్శకులు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే దాదాపు 90 వేల మంది సందర్శించినట్లు సొసైటీ ఉపాధ్యక్షుడు ఆర్.సుఖేష్ రెడ్డి, కార్యదర్శి బీఎన్.రాజేశ్వర్ తెలిపారు. జనవరి 1న ప్రారంభమైన ఎగ్జిబిషన్‌కు శనివారం నాటికి 17.30 లక్షల మంది రాగా.. ఆదివారం 90 వేల మందితో కలిపి 39 రోజుల్లో మొత్తం 18.20 లక్షల మంది సందర్శించినట్లు వారు వివరించారు. ఈ నెల 15న ఎగ్జిబిషన్ ముగియనుందన్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT