Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. డీఏపై నిర్ణయం రాలేదు!
ADVERTISEMENT 

డీఏపై నిర్ణయం రాలేదు!

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 24, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ts.jpg

సాక్షి, హైదరాబాద్‌:  రైతుబంధు, రుణ మాఫీ పథకాలకు నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) మంజూరుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయంవెలువడాల్సి  ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్‌ చెప్పారు. తమను ఈసీ కోరిన వివరణలను పంపించామని తెలిపారు. గురువారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  



ఓటరు గుర్తింపు కార్డులు, స్లిప్పుల పంపిణీ 

‘ఈ ఏడాది 51 లక్షల ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించామని, పోస్టు ద్వారా వీటి పంపిణీ చివరి దశకు చేరుకుంది. గురువారం నాటికి 86 శాతం అనగా 2.81 కోట్ల ఓటర్లకు ఓటరు ఇన్‌ఫర్మేషన్‌ స్లిప్పులను పంపిణీ చేశాం. శనివారంలోగా మిగిలిన స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తాం. ఓటర్లకు అవగాహన కోసం ఓటర్‌ గైడ్‌ బుక్, సీ–విజిల్‌పై కరత్రాలను సైతం పంపిణీ చేశాం. 4,70,287 పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు, 8,84,584 ఈవీఎం బ్యాలెట్‌ పత్రాలను ముద్రించాం.

టెండర్‌ ఓట్లు, చాలెంజ్‌ ఓట్లను సేకరించడం కోసం అధిక సంఖ్యలో ఈవీఎం బ్యాలెట్‌ పత్రాలు ముద్రించాం. ఇప్పటివరకు 32,730 మంది ఎన్నికల సిబ్బంది, 253 మంది అత్యవసర సేవల ఓటర్లు ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో ఓటేశారు. బుధవారం నాటికి 9,386 మంది వయోజన ఓటర్లు, 522 మంది దివ్యాంగులు ఇంటి నుంచే ఓటేశారు.

9,813 మంది సర్వీసు ఓటర్లు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోగా, గురువారం నాటికి 275 మంది ఓటేసి వాటిని తిరిగి పంపించేందుకు తపాలా శాఖలో బుకింగ్‌ చేశారు..’అని సీఈఓ వెల్లడించారు. గడువులోగా ఫామ్‌ 12డీ సమర్పించినా తమకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించలేదని పలువురు జర్నలిస్టులు చెప్పగా..పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.  



ప్రతి రౌండ్‌కు పరిశీలకుడి నిర్ధారణ 

‘ఈసారి ప్రతి శాసనసభ నియోజకవర్గ ఓట్ల  లెక్కింపు ప్రక్రియ పరిశీలకుడి సమక్షంలో జరగనుంది. ప్రతి రౌండ్‌ లెక్కింపును పశీలకుడు  నిర్ధారించిన తర్వాతే తదుపరి రౌండ్‌కి వెళ్తారు.  ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో 14+1 టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్లను లెక్కిస్తారు. 500కి మించి పోలింగ్‌ కేంద్రాలున్న 6 కేంద్రాల్లో మాత్రం టేబుళ్ల సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. ఈ నెల 30న  పోలింగ్‌ జరగనుండగా, 29న పోలింగ్‌ సిబ్బంది  డిస్త్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి ఈవీఎంలను తీసుకుని పోలింగ్‌ కేంద్రాలకు వెళతారు.  



జీపీఎస్‌ ద్వారా వాహనాల ట్రాకింగ్‌ 

రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. అందులో 299 అనుబంధ పోలింగ్‌ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో మొత్తం 59,779 బ్యాలెట్‌ యూనిట్లను వాడుతున్నాం. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉన్న ఓ పోలింగ్‌ కేంద్రంలో గరిష్టంగా నాలుగు బ్యాలెట్‌ యూనిట్లను వాడుతుండగా, మరికొన్ని చోట్ల రెండు, మూడు బ్యాలెట్‌ యూనిట్లను వినియోగించనున్నాం. ఈవీఎంలను తరలించే వాహనాలను జీపీఎస్‌ ద్వారా ట్రాక్‌ చేస్తాం..’అని సీఈఓ వివరించారు.  



ఆ నగదు ఎవరిదో దర్యాప్తులో తేలుతుంది 

‘హైదరాబాద్‌లో రూ.కోట్లలో పట్టుబడిన నగదు ఏ పార్టీకి చెందిందో అన్న అంశం పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. ఇప్పటివరకు రూ.669 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను జప్తు చేయగా, ఇందుకు సంబంధించి 10,106 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి మరో 777 కేసులు పెట్టాం. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రలోభాలను పట్టుకున్నాం. వాటిని క్లెయిమ్‌ చేసుకోవడానికి ఏ రాజకీయ పార్టీ, అభ్యర్థి ముందుకు రావడం లేదు..’అని చెప్పారు.

 

ప్రతి ఒక్కరూ ఓటేయాలి 

‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటేసేందుకు రావాలి. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిర్భయంగా, నైతికంగా, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. 40 వేల మంది రాష్ట్ర పోలీసు బలగాలు, 25 వేల మంది పొరుగు రాష్ట్రాల పోలీసు బలగాలు, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరిస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తాం..’అని సీఈఓ తెలిపారు. అదనపు సీఈఓ లోకేశ్‌కుమార్, జాయింట్‌ సీఈఓ సర్ఫరాజ్‌ అహ్మద్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Central Election Commission
Vikas Raj
DA
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులకు శుభవార్త

89 లక్షల మంది ఓటర్లకు నోటీసులు?

89 లక్షల మంది ఓటర్లకు నోటీసులు?

వాట్సాప్, ఈ–మెయిల్‌లోనే ట్రాఫిక్‌ చలాన్లు!

వాట్సాప్, ఈ–మెయిల్‌లోనే ట్రాఫిక్‌ చలాన్లు!

సీఎస్‌గా జయేశ్‌? లేదా వికాస్‌?

సీఎస్‌గా జయేశ్‌? లేదా వికాస్‌?

రాష్ట్రాల ఎన్నికల కమిషనర్‌లతో 24న ఈసీ భేటీ

రాష్ట్రాల ఎన్నికల కమిషనర్‌లతో 24న ఈసీ భేటీ

సభకు వెళ్లే పెద్దలెవరు?

సభకు వెళ్లే పెద్దలెవరు?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.