Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు
ADVERTISEMENT 

అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు

Telangana Sakshi User Sakshi Sakshi Time Aug 11, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
uttam_1_0.jpg

విధివిధానాల ప్రతిపాదనలపై చర్చించిన ఉత్తమ్‌ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం

గ్రామాల్లో రూ. లక్షన్నర వార్షికాదాయం లేదా మాగాణి 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు 

పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల వార్షికాదాయ పరిమితి విధించాలని ప్రతిపాదన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వార్షికాదాయం ఆధారంగా కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గ్రామాల్లో నివసించే కుటుంబాలకు వార్షికా­దాయం రూ. లక్షన్నర లేదా మాగాణి (తరి) 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలలోపు ఉన్న వారికి రేషన్‌ కా­ర్డు­లు ఇవ్వాలని ప్రతిపాదనలు వచ్చి­నట్లు కొత్త రేషన్‌ కార్డుల జారీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం స్పష్టం చేసింది. 

పట్టణ ప్రాంతాల్లో భూమితో సంబంధం లేకుండా వార్షికాదాయ పరిమితి రూ. 2 లక్షలుగా ప్రతిపాదించినట్లు తెలిపింది. శనివారం సచివాలయంలో మంత్రివ­ర్గ ఉపసంఘం చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పౌర సరఫరాల కార్యదర్శి డి.ఎస్‌. చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ తదితరులు పాల్గొన్నారు. 

సక్సేనా కమిటీ సిఫార్సులు పరిగణనలోకి తీసుకుంటాం: ఉత్తమ్‌ 
సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త రేషన్‌ కార్డుల మంజూరులో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారెవరూ అవకాశం కోల్పోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్షాల­కు చెందిన ప్రజాప్రతినిధులందరి నుంచి కొత్త తెల్ల రేషన్‌ కార్డుల జారీ విషయంలో సలహాలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. 

తక్షణమే రాజ్యసభ, లోక్‌సభ, శాసనసభ, శాసనమండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధివి«ధానాల రూపకల్పనలో వారి నుంచి సూచనలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే డాక్టర్‌ ఎన్‌.సి.సక్సేనా కమిషనర్‌గా, సుప్రీంకోర్టు స్పెషల్‌ కమిషనర్‌ హర్ష మండర్‌ సభ్యుడిగా ఉన్న సక్సేనా కమిటీ సిఫారసులను కొత్త రేషన్‌ కార్డుల మంజూరీలో పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. 

కొత్త రేషన్‌ కార్డుల జారీలో అధికారుల బృందం ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో రేషన్‌ కార్డుల జారీలో అవలంబిస్తున్న విధివిధానాలను అధ్యయనం చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారికి రెండు చోట్లా తెల్లకార్డులు ఉన్నట్లు తేలిందని, అటువంటి వారికి ఒకేచోట కార్డు ఉండేలా ఆప్షన్‌ ఇవ్వాలనే ప్రతిపాదనపై ఉపసంఘం చర్చించినట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త తెల్ల రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఇవ్వడంతో 10 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఉత్తమ్‌ చెప్పారు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
ration cards
Cabinet Subcommittee
Uttam Kumar Reddy N
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.