Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. నాగోబా జాతరకు వేళాయె
ADVERTISEMENT 

నాగోబా జాతరకు వేళాయె

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 20, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nagoba2.jpg

ఈనెల 28 నుంచి ప్రారంభం    

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ వేదికగా.. 

మెస్రం వంశీయుల ఆచార సంప్రదాయాలకు ప్రతీక   

ఏటా పలు రాష్ట్రాల నుంచి భక్తుల ఆగమనం 

పుష్యమాస అమావాస్య నుంచి ప్రక్రియ షురూ    

జాతర ముగిసే వరకు పవిత్రతకు పెద్దïపీట

సాక్షి, ఆదిలాబాద్‌: నాగోబా జాతరను ఈనెల 28 నుంచి ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం వేదికగా.. ఏటా నిర్వహించే ఈ జాతర ప్రసిద్ధి చెందింది. ఆదివాసీల్లోని మెస్రం వంశీయుల ఆచార సంప్రదాయాలు ఇందులో ప్రతిబింబిస్తాయి. 

పుష్యమాస అమావాస్య నుంచి ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటికే ప్రచార రథయాత్ర పూర్తి చేసిన వంశీయులు.. ప్రస్తుతం గంగా జల సేకరణ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో మేడారం తర్వాత నాగోబా జాతరను పెద్దఎత్తున నిర్వహిస్తుంటారు. ప్రభుత్వం ఈ జాతరను అధికారికంగా నిర్వహిస్తోంది. రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాల భక్తులు జాతరకు పెద్ద ఎత్తున తరలివస్తారు.

మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం..
గిరిజనుల్లోని ఆదివాసీ తెగకు చెందిన మెస్రం వంశీయులకు నాగోబా ఆరాధ్య దైవం. ఏటా పుష్య మాసంలో నాగోబా మహాపూజ, జాతర నిర్వహిస్తారు. నెలవంక కనిపించిన మర్నాడు గంగాజల సేకరణ పాదయాత్రను వంశీయులు చేపడతారు. కలశాల్లో సేకరించిన జలంతోనే నాగోబాకు మహాపూజ రోజు అభిషేకం నిర్వహిస్తారు. 

అంతకుముందు ఆలయానికి సమీపంలోని ఇంద్రాదేవికి పూజలు చేసి అక్కడి మర్రిచెట్టు వద్ద బస చేస్తారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయానికి చేరుకుని నాగోబాను అభిషేకించడంతో జాతర మొదలవుతుంది. జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలి వస్తారు.

నూతన ఆలయంలో..
తొలినాళ్లలో మెస్రం వంశీయులు నాగోబా దేవత వెలిసిన పుణ్య స్థలాన్ని (పుట్ట) మాత్రమే పూజించేవారు. తర్వాత కాలంలో 1956లో గడ్డి పొరకలతో చిన్న గుడిసెను నిర్మించి పూజించేవారు. 1995లో సిమెంట్‌ ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు. 2000 సంవత్సరంలో ఆధునికతను జోడిస్తూ ప్రభుత్వ సహకారంతో మందిరాన్ని నిర్మించారు. 

రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో నూతనంగా నిర్మించి 2022 డిసెంబర్‌లో ప్రారంభించారు. ఈ ఆలయం గర్భగుడి ద్వారమే నాగదేవత పడగ. మెస్రం వంశీయుల ఆచారాలు, సంస్కృతి, పద్ధతులు కళ్లకు కట్టేలా ఆలయ మండపంలోని స్తంభాలపై శిల్పాలు చెక్కారు. ఒకప్పటి గోండ్వానా రాజ్యం చిహ్నాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.

నిర్మాణ విశిష్టత..
నాగోబా ఆలయ నిర్మాణంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. మెస్రం వంశస్తులు ఎవరిపై ఆధారపడకుండా డబ్బులు జమ చేసి రూ.5 కోట్లతో ఈ దేవస్థానాన్ని నిర్మించారు. 2017 నుంచి ఏటా డబ్బులు పోగుచేసి.. ఈ నిర్మాణాన్ని 2022లో పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన శిల్పి తలారి రమేశ్‌ అక్కడే రాతిపై శిల్పాలు చెక్కిచ్చారు. 

వాటిని కేస్లాపూర్‌కు తీసుకొచ్చి ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. కాగా ఆలయం చుట్టూ ప్రాకారం, నాలుగు దిక్కుల్లో రాజగోపురాల నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి అప్పట్లో రూ.6 కోట్లు మంజూరు చేసింది. ఆ నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం నూతనంగా నిర్మించిన ఆలయంలోనే మూడేళ్లుగా జాతర నిర్వహిస్తున్నారు.

అతి ప్రాచీనమైన గోండి ధర్మం..
అతి ప్రాచీనమైన గోండి ధర్మాన్ని ఆచరించే మెస్రం వంశస్తుల మూల పురుషుడు పడియోర్‌. ‘పాతాళ్‌ శ్రీ శేకు నాగోబా’వెలిసిన పుణ్య క్షేత్రం కేస్లాపూర్‌లో తరతరాల నుంచి ధర్మ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను కాపాడుతూ.. ముందు తరాలకు సంస్కృతిని అందించే కేంద్రంగా విరజిల్లుతోంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆదివాసీ గోండు తెగలోని మెస్రం వంశీయులకు ప్రత్యేక స్థానం ఉంది. 


ఏటా పుష్యమాసం ప్రారంభం నుంచి కఠోర దీక్షలు, నియమనిష్టలు పా టిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్ర గంగాజలం కోసం తెల్లని వస్త్రాలు ధరించి వరుస క్రమంలో కాలినడకన వందల కిలోమీటర్లు పయనిస్తారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి దగ్గర గోదావరిలోని హ స్తినమడుగు నుంచి కలశంలో గంగాజలం సేక రించి తిరుగు పయనమవుతారు. పుష్యమాసం అమావాస్య రోజు నాగోబా మహాదేవుడి అభిషేకం, మహాపూజ కార్యక్రమం నిర్వహిస్తారు.

గిరిజన దర్బార్‌కు ప్రాధాన్యం
నాగోబా జాతరలో గిరిజన దర్బార్‌కు ప్రాధాన్యం ఉంది. 1940లో గిరిజన పోరాట యోధుడు కుమురంభీం వీరమరణం తర్వాత.. అప్పటి నిజాం సర్కార్‌ గిరిజనుల్లో అసంతృప్తి, తిరుగుబాటుకు కారణాలపై పరిశోధన కోసం మానవ పరిణామ శాస్త్రవేత్త, లండన్‌కు చెందిన హైమన్‌డార్ఫ్‌ను నియమించారు. ఆయన అప్పట్లో తన సతీమణి బెట్టి ఎలిజబిత్‌తో ఇక్కడికి వచ్చి జైనూర్‌ మండలం మార్లవాయిలో స్థిరపడ్డారు. 


ఆయన ఆదివాసీ జీవితాలను పరిశోధించడమే కాకుండా వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. గిరిజన ప్రజల కోసం వివిధ విద్య, ఇతర పథకాల అమలుకు కృషి చేశారు. అన్ని దేశీయ సంస్కృతులు, భాషలను సంరక్షించడం కోసం ప్రభుత్వాలకు సూచనలు చేశారు. గిరిజనులు అత్యధికంగా కేస్లాపూర్‌లో కలుస్తారని, 1942 కాలంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడ గిరిజన దర్బార్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. 

ఈ దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలను ప్రస్తావిస్తారు. అప్పట్లో నిజాం సర్కార్‌ వరకు ఇవి చేరేవి. దీంతో గిరిజన దర్బార్‌కు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. దేశం కాని దేశం వచ్చి ఇక్కడి గిరిజనుల కోసం విశేషంగా కృషి చేసిన దివంగత హైమన్‌డార్ఫ్, ఆయన సతీమణి బెట్టి ఎలిజబిత్‌ దంపతుల విగ్రహాలను మార్లవాయి గ్రామంలో ఏర్పాటు చేశారు. ఏటా ఆ దంపతుల వర్ధంతిని గిరిజనులు నిర్వహిస్తున్నారు.

భవిష్యత్తు తరాలకు తెలియజేస్తాం
నాగోబా ప్రాశస్త్యాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేస్తాం. పవిత్రమైన ఈ జాతర నిర్వహణలో మెస్రం వంశీయులం పాల్గొంటాం. మూడేళ్ల క్రితం నూతన ఆలయాన్ని ప్రారంభించాం. వంశీయులమంతా డబ్బులు జమ చేసుకుని సొంతంగా ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాం. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
nagoba jatara
Aadilabad
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.