చేపల మార్కెట్లపై మృగశిర కార్తె ప్రభావం కనిపించింది. నగరంలోనే ప్రసిద్ధి గాంచిన ముషీరాబాద్ చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. సోమవారం మృగశిర కార్తె సందర్భంగా ఆదివారం కూడా తోడవ్వడంతో చేపల ప్రియులు మార్కెట్‌కు భారీగా తరలి రావడంతో రద్దీ నెలకొంది. రాంనగర్ చౌరస్తా నుంచి దాయారా మార్కెట్ రోడ్డుపై చేపల విక్రయాలు కొనసాగాయి. కిలో రవ్వ, బొచ్చె మామూలు రోజుల్లో రూ.120– 130 ఉండగా.. రూ.230– 250 వరకు విక్రయించారు. కిలో కొరమీను రూ.450 వరకు ఉండగా.. ఆదివారం రూ.650కు విక్రయించారు.
– ముషీరాబాద్/సుందరయ్య విజ్ఞాన కేంద్రం
ADVERTISEMENT
ADVERTISEMENT