Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. అవమానాలు చాలు.. ఇకనైనా బతకనివ్వండి
ADVERTISEMENT 

అవమానాలు చాలు.. ఇకనైనా బతకనివ్వండి

Telangana Sakshi User Sakshi Sakshi Time Oct 23, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
jeevan.jpg

ఈరోజు మమ్మల్ని కాంగ్రెస్‌ పార్టీ చంపేసింది 

ఎన్జీవో పెట్టుకుని అయినా ప్రజలకు సేవ చేస్తా 

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిసంచలన వ్యాఖ్యలు 

గంగారెడ్డి హత్యతో తీవ్ర భావోద్వేగం  

జగిత్యాల: ‘అవమానాలు చాలు.. ఇకనైనా బతకనివ్వండి. ఈ రోజు మమ్మల్ని కాంగ్రెస్‌ పార్టీ చంపేసింది. ఎన్జీవో పెట్టుకోనైనా ప్రజలకు సేవ చేస్తా..’అంటూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురికావడంతో జీవన్‌రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 

ఆయన ఒకానొక దశలో కాంగ్రెస్‌ పార్టీ చంపిందని వ్యాఖ్యానించారు. నాలుగు దశాబ్దాలపాటు పార్టీకి సేవ చేస్తే మంచి బహుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. గంగారెడ్డి హత్యతో ఆందోళనకు దిగిన జీవన్‌రెడ్డికి మద్దతుగా ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ జగిత్యాలకు రాగా ‘నీకో దండం.. నీ పార్టీకో దండం.. ఇకనైనా బతకనివ్వండి..’అంటూ దండం పెడుతూ వ్యాఖ్యానించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ జీవన్‌రెడ్డికి ఫోన్‌ చేసి హత్యకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయ త్నించగా మధ్యలోనే ఫోన్‌ కట్‌ చేశారు. 

పార్టీకి ఎంతో సేవ చేశా  
‘ఒకప్పుడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న. అయినా బీఆర్‌ఎస్‌ వైఫల్యాలు, ఉద్యోగుల సమస్యలు, మహిళల సమస్యలు, రైతుల సమస్యలు ఇలా అన్నీ లేవనెత్తి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశా. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో నా స్థానం ఎక్కడో ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో అవమానాలు తట్టుకుంటున్నాం. ఇక ఓపిక లేదు. 

బీఆర్‌ఎస్‌ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొని, తట్టుకొని నిలబడితే.. ఈరోజు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారింది. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడంతో ఈరోజు జగిత్యాలలో ఎలాంటి పరిస్థితులున్నాయో ఈ ఘటన ద్వారా తెలుస్తుంది. మానసిక అవమానాలకు గురయ్యాం. అది చాలదన్నట్టు భౌతికదాడులకు తెగబడుతున్నారు’అంటూ జీవన్‌రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.  

కాంగ్రెస్‌ ప్రభుత్వమా? బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమా? 
ఇప్పుడు తాము కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉన్నామో.. లేక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉన్నామో అర్థం కావడం లేదని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీలకు నైతిక విలువ లు ఉండాలని సూచించారు. గతంలో కేసీఆర్‌ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూ సి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారని, ఆయన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు.  

మా స్థానం ప్రశ్నార్థకం 
కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నామని, భౌతిక దాడులు చేస్తున్నారని, నాటి టీఆర్‌ఎస్‌.. ఈనాటి కాంగ్రెస్‌ ముసుగులో ఉందని జీవన్‌రెడ్డి అన్నారు. మానసిక వేదనకు గురవుతున్నామని, కార్యకర్తలు కూడా నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కేసీఆర్‌ చేసిందే తాము చేస్తామంటే మన నాయకుడు కేసీఆర్‌ కాదని, రాహుల్‌గాంధీ అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఇలాంటివే ఎదురవుతాయని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడంతో బీఆర్‌ఎస్‌ గత ఎన్నికల్లో మూడో స్థానంలోకి వెళ్లిందని గుర్తు చేశారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
Congress Party
Jeevan Reddy
Ganga Reddy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.