Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ‘గుండె’ను వీడని గమనం ‘కంటి’ని వదలని జ్ఞాపకం
ADVERTISEMENT 

‘గుండె’ను వీడని గమనం ‘కంటి’ని వదలని జ్ఞాపకం

Telangana Sakshi User Sakshi Sakshi Time Aug 12, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
CONCEPT-DISSOCIATIVE-IDENTITY-DISORDER.jpg

గుండె, కిడ్నీలు అమర్చుకున్న వారిలో.. వాటి ‘ఓనర్ల’ జ్ఞాపకాలు, అలవాట్లు

ఓ పాత సినిమా.. కంటిచూపు దెబ్బతిన్న ఒక యువకుడికి, అంతక్రితమే మరణించిన మరో వ్యక్తి కళ్లను అమర్చుతారు.. ఆపరేషన్‌ సక్సెస్‌.. యువకుడికి చూపు బ్రహ్మాండంగా వచ్చేస్తుంది.. కానీ తరచూ ఎవరో వచ్చి తనను కత్తితో పొడుస్తున్నట్టుగా కళ్ల ముందు ఏదో దృశ్యం తారాడుతూ ఉంటుంది.. నిజానికి ఆ కళ్లకు సంబంధించిన వ్యక్తి చనిపోవడానికి కారణమైన ఘటన అది.

ఇదంతా జస్ట్‌ సినిమాటిక్‌ ఫిక్షన్, అవయవాల్లో అలా జ్ఞాపకాలేవీ నిక్షిప్తమయ్యే అవకాశమే లేదన్నది ఇటీవలి వరకు ఉన్న భావన. కానీ ఎవరి అవయవాలనైనా మరొకరికి అమర్చినప్పుడు.. వారి లక్షణాలు, అలవాట్లు కూడా వస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధన చేశారు.

సెల్యులార్‌ మెమొరీతోనే ఇదంతా! 
శరీరంలో అన్ని కణాలకు కొంత జ్ఞాపకశక్తి ఉంటుందన్న ‘సెల్యులార్‌ మెమొరీ’ సిద్ధాంతాన్ని కొలరాడో వర్సిటీ శాస్త్రవేత్తలు తెరపైకి తెస్తున్నారు. ప్రతి వ్యక్తికి సంబంధించి కిడ్నీలు, గుండె, కళ్లు...  వంటి వాటిలో.. వారి శారీరక, మానసిక లక్షణాల జ్ఞాపకాలు ఉంటాయని చెప్తున్నారు. వేరేవారికి ఈ అవయవాలు అమర్చినప్పుడు వారిని ఈ ‘సెల్యులార్‌ మెమొరీ’ ప్రభావితం చేస్తుందని.. అందుకే వారిలో కొత్త లక్షణాలు, అలవాట్లు కనిపిస్తాయని అంటున్నారు. మన కంప్యూటర్‌లో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే కొత్త ఆప్షన్లు అందుబాటులోకి వచ్చినట్టుగా.. దీనిని పోల్చుకోవచ్చని చెప్తున్నారు.

అవయవ మార్పిడికి ముందు, తర్వాత..
శాస్త్రవేత్తలు యూనివర్సిటీ పరిధిలోని ఆస్పత్రిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న 47 మందిని స్టడీకి ఎంచుకున్నారు. ఇందులో కిడ్నీ, లివర్‌ నుంచి గుండె మార్పిడి వరకు చేయించుకున్నవారు ఉన్నారు. వారిలో అవయవ మార్పిడికి ముందు, తర్వాత ఉన్న అలవాట్లు, లక్షణాలను నమోదు చేశారు. అవయవ మార్పిడి తర్వాత ఎదుర్కొన్న అనుభవాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నో చిత్రమైన అంశాలు వెల్లడయ్యాయి.

డ్యూటీలో ఉన్న ఓ పోలీస్‌ ఆఫీసర్‌ను నేరస్తులు పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చి చంపేశారు. అతడి గుండెను ఓ యువకుడికి అమర్చారు. అవయవ మార్పిడి తర్వాత తరచూ తనను ఎవరో దగ్గరి నుంచి కాల్చేస్తున్నట్టుగా కలలు వస్తున్నాయని.. బుల్లెట్‌ తాకినట్టుగా నుదుటిపై తీవ్రంగా నొప్పికూడా వస్తోందని ఆ యువకుడు డాక్టర్లకు చెప్పాడు.

ఓ మూడేళ్ల పిల్లాడికి పవర్‌ రేంజర్స్‌ బొమ్మలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వాటితోనే ఆడుకునేవాడు. కానీ అతడికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశాక.. ఒక్కసారిగా ఆ బొమ్మలను దూరం పడేయడం మొదలుపెట్టాడు. చిత్రమేంటంటే.. అతడికి అమర్చిన గుండె ఓ ఏడాదిన్నర చిన్నారిది. పవర్‌ రేంజర్స్‌ బొమ్మలను అందుకోవడానికి ప్రయత్నిస్తూ.. కిటికీ నుంచి పడిపోయి చనిపోయాడు.

ఇవే కాదు. ఆపరేషన్‌కు ముందు వరకు ఎంతో ప్రశాంతంగా ఉండే వ్యక్తి.. తర్వాత తీవ్రంగా కోపతాపాలకు, తీవ్ర భావోద్వేగాలకు గురవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. మరోవైపు ఎప్పుడూ మూడీగా ఉండే కొందరు.. ఆపరేషన్‌ తర్వాత యాక్టివ్‌గా మారడం, అందరితో చనువుగా ఉండటాన్ని గుర్తించారు. ఒక్కసారిగా కొత్త అలవాట్లు రావడం, అప్పటివరకు ఇష్టంగా చేసిన పనులు అసలే నచ్చకపోవడం, ఆధ్యాత్మిక నమ్మకాల్లోనూ మార్పులు రావడం వంటివీ గమనించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Memory
transfered
organ transplant
Donors
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.