Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. Medaram Jathara: నాలుగురోజులుంటేనే మనసు నిమ్మలం!
ADVERTISEMENT

Medaram Jathara: నాలుగురోజులుంటేనే మనసు నిమ్మలం!

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 29, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
541545.jpg

సకుటుంబసమేతంగా అమ్మవార్ల దర్శనానికి..

దశాబ్దాలుగా మేడారానికి వస్తున్న కుటుంబాలు

మేడారం (ములుగు): ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు భక్తులు అమ్మవార్లపై ఉన్న అపార నమ్మకంతో వస్తుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చే సమ్మక్క–సారలమ్మ తల్లులకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అనాదిగా అమ్మవార్లపై ఎనలేని విశ్వాసాన్ని చూపుతూ రెండేళ్లకొకసారి జరిగే మహాజాతరకు కుటుంబసమేతంగా హాజరై తల్లుల చెంత నాలుగు రోజుల పాటు ఆధ్మాత్మిక సేద్యం చేస్తుంటారు. బుధవారం జాతరకు వచ్చి శనివారం సాయంత్రం దాక నాలుగు రోజులు ఇక్కడే గడుపుతారు. అవసరమైన ఆహార సామగ్రి, ఇతర వంట సరుకులు తెచ్చుకుంటారు. అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరిన వెంటనే నిలువెత్తు బంగారాన్ని సమర్పించి కోరికలు నెరవేర్చినందుకు యాటలను, కోళ్లలను బలిచ్చి చల్లంగా చూడు తల్లి అంటూ వేడుకుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి సమ్మక్క–సారలమ్మను దర్శించుకుంటారు. మేడారం జాతర జరిగే నాలుగు రోజుల పాటు పౌర్ణమి వెలుగుల్లో గుడారాలు వేసుకొని సమ్మక్క తల్లిని వేడుకుంటారు. 

30ఏళ్లుగా జాతరకొస్తున్నాం..
అడవి బిడ్డలైన సమ్మక్క–సారలమ్మను భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. 1998 నుంచి ప్రతీ రెండేళ్లకొసారి మేడారం జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటాం. అమ్మవార్ల మహిమను, మహాత్మ్యాన్ని స్నేహితులకు కూడా తెలియజేయడంతో వారు కూడా మేడారం జాతరకు వస్తున్నారు. అమ్మవార్లను నమ్ముకుంటే అనుకున్న పని జరుగుతుందని స్నేహితులు కూడా చెప్పారు.
– దామెర రాజు, సికింద్రాబాద్‌

అమ్మవారి ఆశీస్సులతో బాబు పుట్టాడు..
తల్లుల మహిమల గురించి విని జాతరకు వచ్చి పెళ్లి కావాలని అమ్మవార్లకు మొక్కులు చెల్లించాను. దీంతో మరుసటి జాతర వచ్చేలోపు వివాహం జరగడమే కాకుండా బాబు పుట్టాడు. దీంతో కుటుంబ సమేతంగా మేడా రం చేరుకొని బాబు పుట్టువెంట్రుకలను మేడారంలోనే తీశాం. 20 ఏళ్లుగా ప్రతీ మేడారం జాతరకు వస్తూ ఎన్ని ఇబ్బందులైనా నాలుగు రోజుల పాటు మేడారంలో ఉండి అమ్మవార్లు గద్దెల పైకి వచ్చిన తర్వాత మొక్కులు చెల్లిస్తున్నాం.
– వెంకటగిరి కిశోర్‌బాబు, అమీర్‌పేట, హైదరాబాద్‌ 

నాలుగు రోజులు ఉంటం..
16 ఏళ్లుగా మేడారం జాతరకు వస్తున్నాం. కష్టాలు తీర్చమని అమ్మవార్లను వేడుకుంటాం. కోరికలు నెరవేర్చాలని అమ్మవారికి పూజలు నిర్వహిస్తాం. కోరికలు నెరవేరిన వెంటనే అమ్మవార్లకు యాటపోతులను బలిస్తాం. ప్రతీ రెండేళ్లకు ఒకసారి మేడారానికి కుటుంబంతో కలిసి రావడం ఆనందంగా ఉంటుంది. జాతరలో సౌకర్యాలు ఉన్నా లేకున్నా..నాలుగు రోజు పాటు ఉండి అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లిస్తాం. సరిపడా వంట సరుకులు తెచ్చుకుంటాం. నాలుగు రోజులుంటేనే మనసు నిమ్మలంగా ఉంటుంది.
– వరికుప్పల పుష్ప, పాలకుర్తి, జనగామ

ఎటుచూసినా కోలాహలం..
సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజు, తండ్రి పగిడిద్దరాజు ప్రతిమలను గద్దెలపైకి తీసుకురావడంతో మేడారం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, నార్లాపూర్‌ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు మొత్తం జనంతో నిండిపోయింది. మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడితో సుమారు నాలుగైదు కిలోమీటర్ల పొడవునా దారులు కిక్కిరిసిపోయాయి. సారలమ్మ గద్దెపైకి రాగానే భక్తులు పరవశంతో దర్శనం కోసం ఒక్కసారిగా గద్దెల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఒకేసారి ఎక్కువ మంది రావడంతో తోపులాట జరిగింది. సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులుదీరుతున్నారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన క్యూలైన్లు సరిపోక రోడ్డుపై సైతం వరుసల్లో బారులు దీరారు. భక్తుల తాకిడి గంట గంటకు పెరగడంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
medaram
Sammakka Saralamma
Telangana
tribal festival
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.