Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ట్యాక్సీ డ్రైవర్‌ కోసం లండన్‌ నుంచి హైదరాబాద్‌కు వివాహిత
ADVERTISEMENT 

ట్యాక్సీ డ్రైవర్‌ కోసం లండన్‌ నుంచి హైదరాబాద్‌కు వివాహిత

Telangana Sakshi User Sakshi Sakshi Time Oct 9, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
aa.jpg

ఓ ట్యాక్సీ డ్రైవర్‌ కోసం లండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చేసిన వివాహిత 

17 ఏళ్ల వివాహ బంధాన్ని పక్కనపెట్టి.. పిల్లలను వదిలేసి రాక 

భర్త ఇచ్చిన ఆన్‌లైన్‌ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆర్‌జీఐఏ పోలీసులు 

ఫోన్‌ ట్రాకింగ్‌తో వారి గుర్తింపు.. ట్యాక్సీ డ్రైవర్‌ ట్రాప్‌ చేశాడన్న మహిళ 

వివాహిత ఇష్టపూర్వకంగానే వచ్చిందన్న యువకుడు 

భర్త విజ్ఞప్తితో లండన్‌ విమానం ఎక్కించి పంపిన పోలీసులు 

శంషాబాద్‌: ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అంటూ ఓ యువకుడు పంపిన మేసేజ్‌కు ఆ వివాహిత మనసు గతితప్పింది. ‘మీ నవ్వు బాగుంటుంది’ అన్న మేసేజ్‌ చూడగానే 17 ఏళ్ల వివాహ బంధాన్ని సైతం ఆమె పక్కన పెట్టేసింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న స్పృహ మరచి మెసేజ్‌ పంపిన వ్యక్తి కోసం ఏకంగా విదేశాల నుంచి రెక్కలు కట్టుకొని భాగ్యనగరానికి వాలిపోయింది. 

ఆన్‌లైన్‌ పేమెంట్‌తో.. 
ఆర్‌జీఐఏ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన ఓ జంటకు 17 ఏళ్ల కిందట పెళ్లయింది. వారికి 13 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కొంతకాలం కిందట భర్తకు లండన్‌లో ఉద్యోగం రావడంతో ఆయన ఒక్కడే అక్కడికి వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు. 

ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహిత తల్లి చనిపోవడంతో ఆమె అస్తికలను కలిపేందుకు పహాడీషరీఫ్‌కు చెందిన ఓ ట్రావెల్స్‌ కారును బుక్‌ చేసుకొని వెళ్లి వచ్చింది. గూగుల్‌ పే ద్వారా ట్యాక్సీ డ్రైవర్‌ శివకు కిరాయి చెల్లించింది. దీంతో వివాహితపై కన్నేసిన అతను.. ఆమెకు గుడ్‌ మార్నింగ్‌ సందేశాలు పంపేవాడు. తొలుత వాటిని పట్టించుకోని వివాహిత ఆ తర్వాత అతని పొగడ్తల సందేశాలకు కరిగిపోయింది. 

ట్యాక్సీ డ్రైవర్‌తో ఫోన్లో సంభాషించడంతోపాటు పలుమార్లు అతన్ని కలిసింది. ఆమె ప్రవర్తనలో తేడాను గమనించిన అత్తింటి వారు.. ఈ విషయాన్ని భర్తకు ఫోన్లో వివరించారు. దీంతో అతను భార్య, ఇద్దరు పిల్లలను సెపె్టంబర్‌ 16న హైదరాబాద్‌ నుంచి లండన్‌ రప్పించుకున్నాడు. 

ఏం జరిగింది..? 
లండన్‌ వెళ్లినా వారి మధ్య సంభాషణలు కొనసాగాయి. సెపె్టంబర్‌ 29న భర్త తల్లి చనిపోవడంతో అతను హైదరాబాద్‌ వచ్చాడు. ఆ మర్నాడే వివాహిత తన ఇద్దరి పిల్లలను లండన్‌లోని ఓ పార్కుకు తీసుకొచ్చి అక్కడే వదిలేసి ట్యాక్సీ డ్రైవర్‌ను కలిసేందుకు ముంబై మీదుగా హైదరాబాద్‌ చేరుకుంది. 

తల్లి తమను వదిలేసి ఎటో వెళ్లిపోయిందంటూ పిల్లలు తండ్రికి ఫోన్లో చెప్పడంతో అతను హుటాహుటిన ఈ నెల 1న లండన్‌కు తిరిగి చేరుకున్నాడు. భార్యకు పలుమార్లు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చిoది. చివరకు కాల్‌ కలవడంతో ఆమెతో మాట్లాడగా తనను ఎవరో కిడ్నాప్‌ చేసి శంషాబాద్‌ మధురానగర్‌ నుంచి బాలాపూర్‌ వైపు తీసుకెళ్తున్నట్లు భర్తకు చెప్పింది.

దీంతో అతను వెంటనే తన స్నేహితులకు సమాచారం ఇవ్వడంతోపాటు ఆన్‌లైన్‌లో ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్‌జీఐఏ, రాజేంద్రనగర్, బోయిన్‌పల్లి పోలీసులు ఆమె ఫోన్‌ను ట్రాక్‌ చేయగా చివరకు ఫోన్‌ లొకేషన్‌ రాజేంద్రనగర్‌లో చూపింది.

శంషాబాద్‌ టు గోవా.. 
పలుమార్లు ట్యాక్సీ డ్రైవర్‌ ఫోన్‌కు కూడా ఫోన్లు చేయగా ఓసారి వివాహిత లిఫ్ట్‌ చేసి మాట్లాడింది. ట్యాక్సీ డ్రైవర్‌ తనను ట్రాప్‌ చేశాడని.. తాము గోవాలో ఉన్నట్లు తెలిపి లైవ్‌ లోకేషన్‌ షేర్‌ చేసింది. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్‌ వస్తున్నట్లు బస్సు టికెట్‌ను వాట్సాప్‌ చేసింది. దీంతో పోలీసులు సోమవారం ఉదయం ఆరాంఘర్‌ వద్ద వారిని బస్సులోంచి దింపి ఆర్‌జీఐఏ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

తనకు చెప్పకుండా లండన్‌ ఎందుకు వెళ్లావని.. ఆత్మహత్య చేసుకొని నువ్వే కారణమని చెబుతానని ట్యాక్సీ డ్రైవర్‌ బ్లాక్‌మెయిల్‌ చేయడంతోనే తాను హైదరాబాద్‌కు వచ్చానని వివాహిత పోలీసులకు తెలిపింది. అయితే ట్యాక్సీ డ్రైవర్‌ మాత్రం ఈ నెల 5న తన పుట్టినరోజు ఉన్నందున.. ఆ వేడుకకు రావాలని ఆహ్వానించడంతో వివాహిత ఇష్టపూర్వకంగానే వచ్చిoదని పోలీసులకు వివరించాడు. 

మరోవైపు తన భార్యను తిరిగి లండన్‌ పంపాలని భర్త ఆర్‌జీఐఏ పోలీసులను కోరాడు. దీంతో పోలీసులు ఆమెను సోమవారం సాయంత్రం దగ్గరుండి లండన్‌ విమానం ఎక్కించారు. ట్యాక్సీ డ్రైవర్‌ను విచారించిన పోలీసులు... ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగానే కలుసుకున్నందున అతనిపై కేసు నమోదు చేయలేదు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
taxi driver
london
Hyderabad
message
Shiva
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.