Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. పెళ్లీడు పెరిగింది.. తెలంగాణ అమ్మాయిల సగటు వయసు ఎంతంటే..?
ADVERTISEMENT

పెళ్లీడు పెరిగింది.. తెలంగాణ అమ్మాయిల సగటు వయసు ఎంతంటే..?

Telangana Sakshi User Sakshi Sakshi Time Apr 19, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BRIDE-age.jpg

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఒకప్పుడు ఎక్కువగా బాల్యవివాహాలు జరిగినా కొన్నేళ్లుగా సమాజంలో వచ్చిన మార్పులతోపాటు ప్రభుత్వాలు ఆడపిల్లల చదువులకు సైతం అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అమ్మాయిలు సైతం అబ్బాయిలతో సమానంగా ఉన్నత విద్యను అభ్యసిస్తుండటంతో దేశంలో అతివల సగటు పెళ్లిళ్ల వయసు పెరుగుతోంది.

నేటికీ అక్కడక్కడా బాల్య వివాహాలు, నగరాల్లో లేటు వయసులో యువతుల పెళ్లిళ్లు జరుగుతున్నప్పటికీ రిజి్రస్టార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయం వివాహ వయసులపై జరిపిన జాతీయ నమూనా సర్వేలో దేశవ్యాప్తంగా మహిళల సగటు వివాహ వయసు 22.7 ఏళ్లుగా వెల్లడైంది. 2020లో ఈ సర్వే జరిగినప్పటికీ వాటి విశ్లేషణ ఆలస్యమైంది. అందుకు సంబంధించిన గణాంకాలను ఆ కార్యాలయం ఇటీవల విడుదల చేసింది. (బ్యూటీషియన్‌ మృతి.. చక్రవర్తి స్పృహలోకి వస్తేనే అసలు విషయం తెలిసేది?)

దేశ సగటు కంటే తెలంగాణ మెరుగు... 

జాతీయ నమూనా సర్వే గణాంకాలను పరిశీలిస్తే 2017 నాటికి దేశంలో మహిళల వివాహ సగటు వయసు 22.1 ఏళ్లుకాగా 2020 నాటికి అది 22.7 ఏళ్లకు చేరింది. ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మహిళలు వివాహం చేసుకొనే వయసు ఆధారపడి ఉన్నందున వివిధ రాష్ట్రాల మధ్య సగటు వయసులో స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. వివాహ సగటు వయసుకు సంబంధించి తెలంగాణ గణాంకాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో 2020 నాటికి 24.3 ఏళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 22.8 ఏళ్లుగా తేలింది.

సగటున 23.5 ఏళ్లకు తెలంగాణ మహిళలు వివాహాలు చేసుకుంటున్నారని జాతీయ నమూనా సర్వే వెల్లడించింది. దక్షిణ తెలంగాణతోపాటు తమిళనాడు మహిళలకు కొంత ఆలస్యంగా వివాహాలు జరుగుతున్నాయని ఈ సర్వేలో తేలింది. మరోవైపు దేశంలోనే అత్యధికంగా సగటున 26 ఏళ్లకు కశీ్మర్‌ మహిళలు వివాహాలు చేసుకుంటుండగా జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతులు మాత్రం సగటున 21 ఏళ్లలోపే మాంగల్య బంధంలోకి అడుగు పెడుతుండటం గమనార్హం. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ మహిళల కంటే పట్టణ ప్రాంతాల్లోని మహిళలు కొంత ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారని జాతీయ నమూనా సర్వే వెల్లడించింది.  

21 ఏళ్లకు పెంచేందుకు బిల్లు

దేశంలోని మహిళల చట్టబద్ధ కనీస వివాహ వయసు ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉండగా దాన్ని పురుషుల చట్టబద్ధ కనీస వివాహ వయసు అయిన 21 ఏళ్లకు సమానంగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ వద్ద పరిశీలనలో ఉంది. అయితే దేశంలో కనీస వివాహ వయసును మార్చాలంటే కేంద్రం 6 చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంది. ఇండియన్‌ క్రిస్టియన్‌ మ్యారేజ్‌ యాక్ట్‌–1872, ది పార్సీ మ్యారేజ్‌ అండ్‌ డైవోర్స్‌ యాక్ట్‌–1936, ద ముస్లిం పర్సనల్‌ లా (షరియత్‌) అప్లికేషన్‌ యాక్ట్‌–1937, ది స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌–1954, ది హిందూ మ్యారేజ్‌ యాక్ట్‌–1955, ది ఫారిన్‌ మ్యారేజ్‌ యాక్ట్‌–1969లను సవరించాల్సి ఉంటుంది.

చదవండి: 165 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ ఎలా? 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Marriage
girls
Telangana
women
Marriage Act
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.