Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. పరిధిని పట్టించుకోకుండా ‘డిజిటల్‌ అరెస్టు’ తప్పించాడు!
ADVERTISEMENT 

పరిధిని పట్టించుకోకుండా ‘డిజిటల్‌ అరెస్టు’ తప్పించాడు!

Telangana Sakshi User Sakshi Sakshi Time Oct 28, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
444.jpg

మియాపూర్‌ వాసికి ఫోన్‌ చేసిన  సైబర్‌ నేరగాళ్లు 

భయంతో ఓ హోటల్‌ గదిలో స్వీయ నిర్బంధం 

కొన్ని గంటల తర్వాత ధైర్యం చేసిన బాధితుడు 

సిటీ ఠాణాకు ఫోన్, కానిస్టేబుల్‌ కౌన్సెలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్‌ పార్శిల్స్, మనీ లాండరింగ్, బ్యాంకు ఖాతా దుర్వినియోగం అంటూ పోలీసుల పేరుతో ఫోన్లు చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు ‘డిజిటల్‌ అరెస్టు’ చేస్తున్నారు. వీడియో కాల్‌ ద్వారా నిఘా గంటల తరబడి నిర్భంధించి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి వారి బారినపడి రూ.లక్షలు, రూ.కోట్లు నష్టపోయిన కేసులు ఇటీవలి కాలంలో అనేకం నమోదయ్యాయి. అయితే సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు చెందిన కానిస్టేబుల్‌ గణేష్‌ చొరవతో సైబరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ ఫ్రాడ్‌ బారినపడకుండా బయటపడ్డారు. పరిధులు పట్టించుకోకుండా వేళకాని వేళలో వచ్చిన ఫోన్‌ కాల్‌కూ పక్కాగా స్పందించిన గణేష్‌ను ఉన్నతాధికారులు ఆదివారం అభినందించారు. 

మియాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగికి శుక్రవారం వాట్సాప్‌ ద్వారా కొన్ని మెసేజ్‌లు వచ్చాయి. ఈయన ఆధార్‌ నెంబర్‌ వినియోగించి ముంబైలో కొందరు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై అక్కడ కేసు నమోదైందని వాటిలో ఉంది. ఆ సందేశాలను బాధితుడు పట్టించుకోలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్చువల్‌ నెంబర్ల ద్వారా ఫోన్‌ కాల్స్‌ మొదలయ్యాయి. ముంబై పోలీసుల మాదిరిగా మాట్లాడిన సైబర్‌ నేరగాళ్లు వీడియో కాల్‌ చేసి యూనిఫాంలో కనిపించారు. కేసు, అరెస్టు అంటూ తీవ్రంగా భయపెట్టి ఇంట్లో ఉంటే స్థానిక పోలీసులూ వచి్చన అరెస్టు చేస్తారని భయపెట్టారు. తాను ఎప్పుడూ ముంబై రాలేదని, ఆ ఆరి్థక లావాదేవీలతో తనకు సంబంధం లేదని చెప్పినా సైబర్‌ నేరగాళ్లు పట్టించుకోలేదు.

శనివారం తెల్లవారుజాము నుంచి రకరకాలుగా భయపెట్టిన వారు సదరు ఐటీ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో రూ.13 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. సోమవారం వరకు అతడు ఎక్కడికీ వెళ్లకుండా, ఎవరితో మాట్లాడకుండా చేసి ఆపై ఆరీ్టజీఎస్‌ ద్వారా ఆ మొత్తం కాజేయాలని పథకం వేశారు. దీంతో ఐటీ ఉద్యోగిని డిజిటల్‌ అరెస్టు చేస్తున్నట్లు చెప్పిన సైబర్‌ నేరగాళ్లు ఇంటి నుంచి బయటకు రప్పించారు. కుటుంబీకులతో సహా ఎవరినీ కలవద్దంటూ షరతు విధించి అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో బస చేయించారు. ఇలా ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకు ఆడియో, వీడియో కాల్స్‌ కట్‌ చేయని సైబర్‌ నేరగాళ్లు బాధితుడిని హోటల్‌ గదిలోనే ఉంచారు. 

ఆ సమయంలో కాల్‌ కట్‌ అవడంతో బాధితుడికి కాస్తా అవకాశం చిక్కింది. దీంతో ధైర్యం చేసిన అతడు ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేసి  హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణా ఫోన్‌ నెంబర్‌ తెలుసుకున్నాడు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సదరు నెంబర్‌కు కాల్‌ చేయగా... ఆ సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ గణేష్‌ అందుకున్నారు. సాధారణంగా పోలీసులు తమకు ఫోన్‌ చేసిన బాధితులు బయటి ప్రాంతాలకు చెందిన వారని చెప్పగానే... అక్కడి అధికారులను సంప్రదించాలని చెబుతుంటారు.

 అయితే ఈ బాధితుడు మియాపూర్‌ వాసిని అని చెప్పినా ఆ సమయంలోనూ పక్కాగా స్పందించిన గణేష్‌ విషయం మొత్తం తెలుసుకున్నారు. అది సైబర్‌ మోసమంటూ బాధితుడికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు మియాపూర్‌లో వారి ఇంటి పక్కన ఉండే స్నేహితుడి నెంబర్‌ తీసుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు ఫోన్‌ చేసి విషయం చెప్పిన గణే‹Ù... బాధితుడి వద్దకు వచ్చి తీసుకువెళ్లేలా చొరవ చూపారు. ఈ అంశంలో కానిస్టేబుల్‌ గణేష్‌ స్పందనకు ఉన్నతాధికారులు అభినందించారు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Digital Arrest
Money laundering
Crime News
సంబంధిత పోల్స్
Loading..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.