Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం
ADVERTISEMENT 

మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం

Telangana Sakshi User Sakshi Sakshi Time Jul 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
wmn_20wmprwmnt.jpg

ప్రతీ నియోజకవర్గంలో మైక్రో ఇండస్ట్రీస్‌ 

అంబేడ్కర్‌ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపడతాం 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పాల్గొన్న శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, జూపల్లి 

దండేపల్లి/జన్నారం/మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌)/ లక్సెట్టిపేట: మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం కట్టుబ డి ఉందని, రాష్ట్రంలోని ప్రతీ నియోజక వర్గంలో మహిళల కోసం మైక్రో ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేసి, వారు వ్యాపారాలు చేసుకునేలా కార్యక్రమాలు చేపడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్‌ మండలాల్లో మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారా వులతో కలసి భట్టి విక్రమార్క పర్యటించారు. లక్సెట్టిపేట లో నూతనంగా నిర్మించిన 50 పడకల సామాజిక ఆస్పత్రి, కళాశాల భవనాన్ని ప్రారంభించారు. 

దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. హాజీపూర్‌ మండలం వేంపల్లిలో ఇండస్ట్రియల్‌ పార్కు, ఐటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ జనాభాలో సగభాగమైన మహిళలకు గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వడ్డీ లేని రుణాలు అందించగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తిరిగి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీ లేని రుణాల పథకాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. 

‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రకటించినప్పుడు కొందరు అవహేళన చేశారు. కానీ మొదటి సంవత్సరంలోనే రూ.21,600 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. మహిళా సంఘాలకు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులు కేటాయించి, ఆర్థిక స్వావలంబనకు మార్గం సుగమం చేస్తున్నాం. మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కల్పించి, బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇప్పిస్తున్నాం. క్యాంటీన్లు, పెట్రోల్‌ బంకులు, ఇతర వ్యాపారాల కోసం మహిళా సంఘాలకు స్థలాలు కేటాయించాం’అని భట్టి చెప్పారు.

సంక్షేమ పథకాల కోసం రూ.55 వేల కోట్లు ఖర్చు
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని రూ.22,500 కోట్లతో మొదలుపెట్టామని భట్టి విక్రమార్క తెలిపారు. సంక్షేమ పథకాల కోసం రూ.55 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో అటవీ అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొన్న గిరిజనుల కోసం ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ప్రవేశపెట్టినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. 

ఈ పథకం కింద ఉచిత సోలార్‌ పంప్‌సెట్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్‌ ఇరిగేషన్, అవకాడో, వెదురు మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి చేపడతామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామ న్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గం దృష్టి సారించిందని తెలిపారు.

మంచిర్యాలలో ఐటీ, ఇండస్ట్రియల్‌ పార్కు
మంచిర్యాలలో 212 ఎకరాల్లో దత్తసాయి ఇండస్ట్రియల్, ఐటీ, ఆటోనగర్‌ పార్కు ఏర్పాటుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. మొత్తం 300 ఎకరాల్లో ఈ పార్కును నిర్మించనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా రూ.30 కోట్లు కేటాయించామని, ఈ ప్రాజె క్టు ద్వారా 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
women empowerment
Bhatti Vikramarka
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.