Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. త్వరలోనే భూముల రిజిస్ట్రేషన్‌ విలువలు పెంపు!
ADVERTISEMENT 

త్వరలోనే భూముల రిజిస్ట్రేషన్‌ విలువలు పెంపు!

Telangana Sakshi User Sakshi Sakshi Time Jun 15, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
plots.jpg

 కసరత్తు పూర్తిచేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ

తొలుత హెచ్‌ఎండీఏ పరిధిలోని భూములకు వర్తింపు

కనీసం 20% నుంచి 100% వరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు పెంపు

సీఎం నిర్ణయమే తరువాయి.. 

విలువలు పెంచినా స్టాంపు డ్యూటీ తగ్గించే యోచనలో ప్రభుత్వం?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ విలువలు త్వరలోనే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తును పూర్తి చేసింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించిన నివేదికను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించి.. సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారని, దానికి సీఎం ఆమోదం తెలిపిన వెంటనే పెరిగిన భూముల విలువలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. 

అయితే, ముందుగా హెచ్‌ఎండీఏ పరిధిలోని భూముల కు మాత్రమే ఈ విలువల సవరణ వర్తింపజేస్తా రని, కొన్ని రోజుల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పెంచుతారని తెలుస్తోంది. కాగా, భూముల రిజి స్ట్రేషన్‌ విలువలు భారీగా పెరిగినా, ప్రజలపై ఎక్కువ భారం పడకుండా అర శాతం మేర స్టాంపు డ్యూటీ తగ్గించే అవకాశాలున్నాయని సమాచారం. 

ఏడాది క్రితమే..
వాస్తవానికి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది జూన్‌ లో భూముల రిజిస్ట్రేషన్‌ విలువల సవరణ కార్య క్రమాన్ని చేపట్టింది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధి వర్తించే విధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి.. సబ్‌రిజిస్ట్రార్ల ద్వారా సవరణ ప్రతిపాదనలను తెప్పించారు. 2024, జూన్‌ 29 నాటికి సవరించిన విలువలను ప్రభుత్వానికి పంపి ఆమోదం అనంతరం ప్రజాభిప్రాయం సేకరించి 2024, ఆగస్టు1 నుంచి సవరించిన రిజిస్ట్రేషన్‌ విలువలను అందుబాటులోకి తేవాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సబ్‌రిజిస్ట్రార్ల స్థాయిలో కసరత్తు జరిగిన అనంతరం ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది. 

రియల్‌ ఎస్టేట్‌ రంగం సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో భూముల విలువలు పెంచితే మరింత వ్యతిరేక ప్రభావం చూపుతుందని, తద్వారా మార్కెట్‌ నష్టపోతుందనే ఆలోచనతో అప్పట్లో ఆ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. ఆ తర్వాత థర్డ్‌ పార్టీ చేత విలువల సవరణ ప్రక్రియను చేపట్టింది. థర్డ్‌ పార్టీ కూడా నివేదిక ఇచ్చింది. అయినా, ఎప్పటికప్పుడు భూముల విలువల సవరణ అంశం వాయిదా పడుతూనే వచ్చింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో మళ్లీ కసరత్తు ప్రారంభించింది. 

గత నెలలో మళ్లీ షెడ్యూల్‌..
భూముల విలువల సవరణ కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది. విలువలను సవరించేందుకు వీలుగా మళ్లీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తూ, జీవో నం. 41ని విడుదల చేసింది. సవరణ ప్రతిపాదనలను పంపేందుకు మళ్లీ ప్రత్యేక ఫార్మాట్లను క్షేత్రస్థాయికి పంపింది. 

ఆ తర్వాత ఎప్పుడు ఏం చేయాలనే టైంటేబుల్‌ను కూడా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విడుదల చేసింది. ఈ టైంటేబుల్‌ ప్రకారం వివిధ అధికారుల స్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయని, వీటిని ఉన్నతాధికార వర్గాలు పరిశీలించాయని, అనంతరం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆమోదం తెలిపారని, ఇప్పుడు బంతి సీఎం రేవంత్‌ కోర్టులో ఉందని సమాచారం. 

తక్కువ ఉన్న చోట్ల ఎక్కువగా
విశ్వసనీయ సమాచారం ప్రకారం భూముల విలు వలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్‌ విలువలు సవరించే అవకాశాలు కని పిస్తున్నాయి. వ్యవసాయ భూముల ఎకరం కనీస విలువ రూ.4 లక్షలుగా నిర్ధారించాలని, 3 కేట గిరీల్లో ఈ విలువలను సవరించి, హైవేల పక్కన ఉండే వ్యవసాయ భూములకు రూ.40–50 లక్షల వరకు పెంచాలనే ప్రతిపాదనలు సీఎం వద్దకు చేరి నట్టు సమాచారం. 

వ్యవసాయేతర భూములు, ఆస్తుల విషయంలోనూ కొంత మేర దూకుడు పెంచాలని, కనీసం 20 నుంచి 100 శాతం వరకు ఈ విలువలు సవరించాలని నిర్ణయించినట్లు తెలు స్తోంది. ఇందుకోసం రియల్‌ ఎస్టేట్‌ సంస్థల బ్రో చర్లు, ప్రకటనలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు రెవెన్యూ, మున్సిపల్‌ వర్గాల ద్వారా కూడా సమాచారం సేకరించారు. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్ల విలు వలను నిర్ధారించనున్నట్టు తెలుస్తోంది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Land registration
Telangana
Registration Department
సంబంధిత పోల్స్
Loading..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.