Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. మూత్ర'గండం'!
ADVERTISEMENT 

మూత్ర'గండం'!

Telangana Sakshi User Sakshi Sakshi Time Jun 15, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kidney.jpg

దేశ సగటుకు రెండింతలకుపైగా రాష్ట్రంలో మూత్రపిండాల సమస్యలు

ఐసీఎంఆర్‌–ఇండియాబ్‌ అధ్యయనం హెచ్చరిక

తెలంగాణలో 7.4% మందికి కిడ్నీ పనితీరు లోపం..జాతీయ సగటు 3.2% మాత్రమే

ప్రతి 14 మందిలో ఒకరికి కిడ్నీ పనితీరు లోపం

మధుమేహం, రక్తపోటే ప్రధాన కారణాలు

మూత్ర పిండాల వ్యాధి సమస్యలు ఇప్పు­డు తెలంగాణలో ప్రజారోగ్యానికి సవాలుగా మారుతున్నా­యి. భారత వైద్య పరిశోధన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఐసీఎంఆర్‌–ఇండియాబ్‌’అధ్యయనం రాష్ట్రానికి ఆందోళన కలిగించే సంకేతాలను వెలుగులోకి తెచ్చింది. ఈ అధ్యయనం ప్రకారం తెలంగాణలో కిడ్నీ పనితీరు లోపం ప్రాబల్యత 7.4 శాతంగా నమోదైంది. జాతీయ సగటు 3.2 శాతంతో పోలిస్తే ఇది రెండింతలకు పైగా ఉండటం గమనార్హం. అంటే రాష్ట్రంలో దాదాపు ప్రతి 14 మందిలో ఒకరు కిడ్నీ సమస్యల ముప్పులో ఉన్నట్టు అంచనా.      – సాక్షి, హైదరాబాద్‌

హెచ్చరికగా ఐసీఎంఆర్‌ అధ్యయనం
‘ఐసీఎంఆర్‌–ఇండియాబ్‌’ అధ్యయనం దేశవ్యాప్తంగా మధు­మేహం, రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, మూత్ర­పిండాల వ్యాధులు ప్రబలడాన్ని గల కారణాలను అంచనా వేయడానికి చేపట్టిన అతిపెద్ద పరిశోధన. 2015 నుంచి 2023 మధ్యకాలంలో వివిధ దశల్లో 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 25 వేల మందికిపైగా వయసు పైబడిన వారి నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. 

కిడ్నీ ఆరోగ్యంపై ప్రత్యేకంగా చేసిన విశ్లేషణ ఫలితాలు ఇటీవలి కాలంలో శాస్త్రీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఇందు­లో తెలంగాణ దేశంలోని కిడ్నీ వ్యాధుల హాట్‌స్పాట్‌ రాష్ట్రా­ల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా పట్టణీకరణ వే­గంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో జీవనశైలి మార్పుల ప్రభా­వం కిడ్నీలపై తీవ్రంగా పడుతున్నట్టు అధ్యయనం పేర్కొంది.

మధుమేహం–బీపీతో కిడ్నీలకు ముప్పు
మూత్రపిండాల వ్యాధుల పెరు­గుదలకు ప్రధాన కారణా­లు­గా మ«­దు­మేహం, రక్తపోటును వైద్య నిపు­ణు­లు గుర్తిస్తు­న్నా­రు. రక్తంలో చక్కెర స్థా­యి­లు ఎక్కువ కాలం నియంత్రణలో లేకపో­తే కిడ్నీలలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. అధిక రక్తపోటు కిడ్నీలపై నిరంతర ఒత్తిడిని పెంచి వాటి పని­తీరును క్రమంగా బల­హీ­నపరుస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే మధుమేహం, రక్తపోటు కేసులు వేగంగా పెరుగు­తున్న నేప­థ్యంలో కిడ్నీ సమస్యల సంఖ్య కూడా అధికమవుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇ

వే కాకుండా ఊబకాయం, శారీ­రక శ్రమ లేకపోవడం, అధిక ఉప్పు వినియోగం, ఫాస్ట్‌ఫుడ్‌ అలవాట్లు, నొప్పి నివారణ మందుల విచ్చలవిడి వాడకం, ధూమపానం, మద్యపానం వంటి అంశాలు కూడా ప్రమా­దాన్ని పెంచుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నా­ణ్య­త, వేడి వాతావరణంలో తగినంత నీరు తీసుకోకపోవ­డం వంటి అంశాలు కూడా కొంత ప్రభావం చూపు­తున్నా­యని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

స్క్రీనింగ్‌–చికిత్సపై ప్రభుత్వం దృష్టి
పెరుగుతున్న అసంక్రమణ వ్యాధుల భారాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల ద్వారా 30 ఏళ్లు పైబడిన వారిలో మధుమేహం, రక్తపోటు, ఇతర అసంక్రమణ వ్యాధుల స్క్రీనింగ్‌ నిర్వహిస్తోంది. వీటి ద్వారా కిడ్నీ సమస్యలకు దారితీసే ప్రమాద కారకాలను ముందుగానే గుర్తించే ప్రయత్నం జరుగుతోంది.

ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్‌ సేవలను విస్తరించడంతోపాటు పేదలకు ఉచితంగా సేవలు అందిస్తోంది. నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) కార్యక్రమం ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. 

రాష్ట్రంలో ప్రతి 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఒక కేంద్రం అందుబాటులో ఉండేలా చూడాలని ఇటీవల ఆరోగ్యశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల రోగులకు రవాణా ఇబ్బందులు లేకుండా హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న 67 కేంద్రాలలో రద్దీని తగ్గించడానికి, అదనంగా మరో 155 డయాలసిస్‌ యంత్రాలను (పడకలను) అందుబాటులోకి తెస్తున్నారు.

యువతలో పెరుగుతున్న కిడ్నీ కేసులు
గతంలో మూత్రపిండాల వ్యాధు­లు ప్రధానంగా వృద్ధుల్లో కని­పించేవి. ప్రస్తుతం 30–45 ఏళ్ల వయసు వారిలో కూడా ఈ సమస్యలు పెరుగుతున్నట్టు వైద్య వర్గాలు చెబుతున్నా­యి. జీవనశైలి మార్పులు, ఉద్యోగ ఒత్తిడి, అనియంత్రిత ఆహా­రపు అలవాట్లు ఇందుకు కారణ­మవుతున్నాయి. 

మధు­మేహం, రక్తపోటుతో బాధపడుతున్న యువతలో కిడ్నీ పనితీరు క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. అత్యంత ప్రమాదకర అంశం ఏమిటంటే.. ప్రారంభ దశల్లో కిడ్నీ వ్యాధులకు పెద్దగా లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరే వరకు చాలామందికి తమకు సమస్య ఉందనే విషయం తెలియదు. అందుకే దీనిని సైలెంట్‌ డిసీజ్‌గా వైద్యులు పేర్కొంటున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Kidney disease
Telangana
indian council of medical research
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.