Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. మురికిపోయి.. ముద్దుగా మారి
ADVERTISEMENT 

మురికిపోయి.. ముద్దుగా మారి

Telangana Sakshi User Sakshi Sakshi Time Feb 23, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
fsdf.jpg

అదో కాలువ.. దానికి అనుబంధంగా డ్రైనేజీలు, వానాకాలం వచ్చిందంటే ఉప్పొంగడం, రోడ్లన్నీ మురికినీటితో నిండిపోవడం, విషజ్వరాలు, తాగునీటి కాలుష్యం, దుర్వాసన.. ఇదంతా గతం.. ఇప్పుడు అదంతా అందాల హరివిల్లు. పచ్చదనం నిండిన పార్కులు, ఫౌంటెయిన్‌లు, ఓపెన్‌ జిమ్‌లు, వాకింగ్‌ ట్రాక్‌లు, ఆట స్థలాలతో ఆహ్లాదం పంచే ప్రదేశం.. ఖమ్మం పట్టణంలోని గోళ్లపాడు చానెల్,దాని వెంట ఉన్న ప్రాంతాల్లో వచ‍్చిన అద్భుతమైన మార్పు ఇది. సీఎం కేసీఆర్‌ హామీ, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవ కలిసి రూ.100 కోట్ల ఖర్చుతో గోళ్లపాడు చానెల్‌ ప్రాజెక్టు అపూర్వంగా రూపుదిద్దుకుంది. సీఎం కేసీఆర్‌ ఈ అభివృద్ధి పనులకు కితాబివ్వగా.. త్వరలోనే మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. 

  • రూ.100 కోట్లతో 10.6 కి.మీ.పొడవునాఅభివృద్ధి
  •  గోళ్లపాడు చానల్‌ పునరుద్ధరణతో ఖమ్మం పట్టణానికి వన్నె 
  • ఆక్రమణలకు పాల్పడిన 862 మందికి పునరావాసం 
  • మంత్రి పువ్వాడ చొరవతో పనులు.. త్వరలో కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం 

గోళ్లపాడు చానల్‌ ఖమ్మం నగరం మీదుగా వెళ్తూ.. శివారు ప్రాంతాల్లోని పంట పొలాలకు నీరందించేది. త్రీటౌన్‌ ప్రాంతంలో 10.6 కిలోమీటర్ల పొడవునా ఉన్న ఈ కాల్వ కాలక్రమేణా నగరాభివృద్ధితో డ్రైనేజీగా మారింది. పంపింగ్‌ వెల్‌ రోడ్, సుందరయ్య నగర్, ప్రకాశ్‌నగర్‌ ప్రాంతాల్లో కాల్వకు ఇరువైపులా బస్తీలు వెలిశాయి. ఖమ్మం నగరంలోని 28 డివిజన్ల మురికినీరంతా ఈ కాల్వ నుంచే వెళ్లి మున్నేరులో కలుస్తుండటం, ఆక్రమణలు, సిల్ట్‌ తీయకపోవడంతో నాలుగు దశాబ్దాలుగా కాల్వ, పరిసర ప్రాంతాలు మురికి కూపంగా మారాయి. వానాకాలంలో ఈ డ్రైనేజీ పొంగి సమీప డివిజన్లలో మురికినీరు చేరడం, ఆ నీరు పైపులైన్లలో కలిసి తాగునీరు కలుíÙతం కావడం నిత్యకృత్యమైంది. దోమల స్వైర విహారంతో విషజ్వరాలు, వ్యాధుల విజృంభణ సాధారణమైంది. 

రూ.100 కోట్లతో మారిన ముఖచిత్రం 

సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లతోపాటు ఖమ్మం కార్పొరేషన్‌ అభివృద్ధికి 2018లో ప్రత్యేక నిధులు కేటాయించారు. అందులో భాగంగా రూ.100 కోట్ల నిధులతో గోళ్లపాడు చానల్‌ పునరుద్ధరణ, సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే 30ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారీ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, వాన నీరు వెళ్లేందుకు ఓపెన్‌ కాల్వ నిర్మించడంతోపాటు.. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పైభాగంలో ఆహ్లాదం పంచేలా పార్కులను ఏర్పాటు చేశారు. 

అధునాతన సౌకర్యాలతో.. 

పది డివిజన్ల పరిధిలోని 50 వేల మంది ప్రజలకు ఆహ్లాదం పంచేలా గోళ్లపాడు చానల్‌ను అభివృద్ధి చేశారు. పిల్లలకు చెస్‌పై అవగాహన కలి్పంచేలా రష్యాలోని మాస్కో తరహాలో మెగా చెస్‌బోర్డులు, అధునాతనంగా స్కేటింగ్‌ రింక్‌లు, వాటర్‌ ఫౌంటెయిన్లు, బాస్కెట్‌బాల్, వాలీబాల్, షటిల్‌ కోర్టులు, వాకింగ్‌ ట్రాక్‌లు, ఓపెన్‌ జిమ్‌లు, బస్తీ దవాఖానా, యోగా వేదికలు, పంచతత్వ పార్కులు, 10 వేల ఔషధ, ఇతర మొక్కలతో మినీ పార్కులను ఏర్పాటు చేశారు. మొత్తం 32 ఎకరాల స్థలం ప్రజా అవసరాల దృష్ట్యా వినియోగంలోకి వచ‍్చింది.

గోళ్లపాడు చానల్‌ ప్రాజెక్టు వ్యయం రూ.100 కోట్లు అయితే.. వినియోగంలోకి వచ్చిన భూమి విలువ రూ.300 కోట్లకు పైమాటేనని అంచనా వేశారు. సీఎం సూచనల మేరకు ఇటీవల నిజామాబాద్‌ కలెక్టర్, ఆ జిల్లా అధికారులు ఈ అభివృద్ధి పనులను సందర్శించారు కూడా. గోళ్లపాడు చానల్‌పై నిర్మించిన పార్కులకు ప్రొఫెసర్‌ జయశంకర్, మంచికంటి రామకిషన్‌రావు, పుచ్చలపల్లి సుందరయ్య, కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, రజబ్‌ అలీ, వనజీవి రామయ్య తదితరప్రముఖుల పేర్లను పెట్టారు. గోళ్లపాడు చానల్‌ వెంట గతంలో గుడిసెలు, ఇతర తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్న 862 మంది పేదలకు ఖమ్మం అర్బన్‌ మండలం వెలుగుమట్లలో

ఇళ్ల స్థలాలు ఇచ్చి, అన్ని వసతులతో కాలనీ ఏర్పాటు చేశారు. 

మురికి పోయి.. వన్నె వచ‍్చింది 

సీఎం కేసీఆర్‌ రూ.100 కోట్లను గోళ్లపాడు చానల్‌కు కేటాయించడంతో నాలుగు దశాబ్దాల మురికి కూపం నుంచి విముక్తి కలిగింది. వన్నె వచ‍్చింది. ప్రత్యేకంగా త్రీటౌన్‌ ప్రాంతానికి ఆహ్లాదం పంచేలా గోళ్లపాడు చానల్‌ ముస్తాబైంది. విషజ్వరాలు, దుర్వాసనతో ఇబ్బందులు పడ్డ ప్రజలు నేడు ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు. సీఎం దార్శనికతకు ఇది నిదర్శనం.- పువ్వాడ అజయ్‌ కుమార్, రవాణా శాఖ మంత్రి  

అందరి కృషితో ఆహ్లాదం 

సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, అధికారులు, స్థానికుల సహకారంతో గోళ్లపాడు చానల్‌ సొబగులు అద్దుకుంది. ఆహ్లాదకరమైన పార్కులు

అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు వీటిని సదినియోగం చేసుకోవాలి. మొత్తం పది వేల కుటుంబాలు ఆహ్లాదాన్ని ఆస్వాదించేలా తీర్చిదిద్దాం. గోళ్లపాడు చానల్‌ పార్కుల్లో ఇంకా కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం. -వీపీ గౌతమ్, కలెక్టర్, ఖమ్మం  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Khammam
Khammam Corporation
Drainage system
Telangana News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వనజ చితాభస్మంలో సర్జికల్ సీజర్.. నర్సులే డెలివరీ చేశారా?

వనజ చితాభస్మంలో సర్జికల్ సీజర్.. నర్సులే డెలివరీ చేశారా?

బాలింత వనజ చితాభస్మంలో కనిపించిన సర్జికల్ కత్తెర

బాలింత వనజ చితాభస్మంలో కనిపించిన సర్జికల్ కత్తెర

ఆస్తి కోసం కన్న కొడుకే కుట్ర.. తల్లిదండ్రులపై 22 కేసులు

ఆస్తి కోసం కన్న కొడుకే కుట్ర.. తల్లిదండ్రులపై 22 కేసులు

హైదరాబాద్ లో ఈ ఇంట్లో ఫ్రీగా తినొచ్చు - పడుకోవచ్చు

హైదరాబాద్ లో ఈ ఇంట్లో ఫ్రీగా తినొచ్చు - పడుకోవచ్చు

పుష్కరం దాటినా కేసీఆరే కావాలి?.. కేటీఆర్‌

పుష్కరం దాటినా కేసీఆరే కావాలి?.. కేటీఆర్‌

ఇంత ఎలా దోచుకున్నావయ్యా సామీ.. ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

ఇంత ఎలా దోచుకున్నావయ్యా సామీ.. ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.