హైదరబాద్: మొహర్రం సంతాప దినాల్లో భాగంగా ఈ నెల 26న పాతబస్తీ వీధుల్లో అంబారీతో 10వ మొహర్రం సామూహిక ఊరేగింపు కొనసాగుతుంది. డబీర్‌పురా బీబీకా అలావాకు చెందిన బీబీకా ఆలంతో షియా ముస్లింలు ఊరేగింపులో పాల్గొంటారు. ఇందులో భాగంగా కేరళలోని కోజికోడ్ నుంచి శ్రీదేవి అనే ఆడ ఏనుగు బుధవారం రాత్రి పాతబస్తీకి చేరుకుంది. ప్రధాన ఊరేగింపునకు ముందస్తుగా డబీర్‌పురా నుంచి చార్మినార్ మీదుగా చాదర్‌ఘాట్ వరకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT