Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. గల్లీ నుంచి ఢిల్లీ దాకా..ఆక్రమణదారుల చెరలో 38,496 చెరువులు
ADVERTISEMENT 

గల్లీ నుంచి ఢిల్లీ దాకా..ఆక్రమణదారుల చెరలో 38,496 చెరువులు

Telangana Sakshi User Sakshi Sakshi Time May 14, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Telangana1.jpg

సాక్షిప్రతినిధి, వరంగల్‌: నగరాలు, పట్ణణాలు, పల్లెలు.. ఇవేమీ తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఆక్రమణదారులు చెరువుల్ని మింగేస్తున్నారు.. ఫలితంగా వేల సంఖ్యలో జలవనరులు కనుమరుగవుతున్నా యి. ఒకప్పుడు తాగునీటి అవసరాలు తీర్చినవాటి లో కొన్ని ఆక్రమణలపాలై కనుమరుగు కాగా మరికొన్ని మురుగునీటి కాసారాలుగా మారాయి. ఇటీవల కేంద్ర మైనర్‌ ఇరిగేషన్‌ స్టాటిస్టిక్స్‌ విభాగం విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కేంద్ర ప్రాయోజిత పథకం కింద ‘ఇరిగేషన్‌ సెన్సెస్‌’నిర్వహించింది. అనేక చెరువులు కనుమరుగైనట్లు, మరి కొన్ని ప్రమాదంలో ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొంది.  

ఓరుగల్లు చెరువులు ఎంతెంత పోయాయంటే 

వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలో కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలతో కుచించుకు పోయాయి. 100 ఎకరాలకుపైగా ఉండే చిన్నవడ్డేపల్లి చెరువు సుమారు 20 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లు కొద్ది రోజుల క్రితం రెవెన్యూ శాఖనే తేలి్చంది. మామునూరు పెద్ద చెరువు 170 ఎకరాలకుగాను సుమారు 40 ఎకరాలు, 126 ఎకరాల్లో విస్తరించి ఉన్న పాతబస్తీ ఉర్సు రంగ సముద్రం (ఉర్సు చెరువును) సుమారు 26 ఎకరాలు, హనుమకొండ హంటర్‌రోడ్‌ న్యూశాయంపేటలో 150 ఎకరాల విస్తీర్ణంలోని కోటి చెరువులో సుమారు 25–30 ఎకరాల వరకు ప్రైవేటుపరమయ్యాయి. హన్మకొండ, కాజీపేట ప్రాంతవాసుల తాగునీటి అవసరాలు తీర్చే హన్మకొండ వడ్డేపల్లి చెరువులో 40 ఎకరాలకు వరకు, 336 ఎకరాల భద్రకాళి చెరువులో సుమారు 40 ఎకరాల పైచిలుకు కనుమరుగైందని అధికారులు గుర్తించారు.  

తెలంగాణలో ఆక్రమణకు గురైనవి 3,032 

దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా చిన్ననీటి వనరులు కుచించుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా 38,496 చెరువులు, ట్యాంకులు, సరస్సులు తదితర చిన్ననీటి వనరులు ఆక్రమణకు గురికాగా, సుమారు 14,535 చోట్ల ప్రమాదంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కాగా అత్యధికంగా ఆక్రమణలకు గురైన ఐదు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఉంది. 64,056 చిన్ననీటి వనరుల్లో 3,032 ఆక్రమణలకు గురైనట్లు నివేదిక తేల్చింది. ఈ 3,032 చెరువుల్లో ఎక్కువ హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ, మెదక్‌ జిల్లాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఐదు సెంటిమీటర్ల వాన పడితే నగరం మునుగుడే 

కాకతీయ రాజులు నిర్మించిన అనేక చెరువులు వరంగల్‌ నగరం చుట్టూ ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణల వల్ల గొలుసుకట్టు చెరువుల సిస్టం దెబ్బతిని ఐదు సెంటిమీటర్ల వర్షం పడితే చాలు నగరం మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆక్రమణలను నియంత్రించకపోతే ఆ చెరువులు పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయే ప్రమాదం ఉంది. 

– చీకటి రాజు, రాష్ట్ర కన్వీనర్, కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ 

లోకాయుక్తలో విచారణ జరుగుతోంది 

వరంగల్‌లో 8కి పైగా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. వీటన్నింటిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాం. భద్రకాళీ సహా అన్ని చెరువుల ఆక్రమణపై లోకాయుక్త కోర్టులో చేసిన ఫిర్యాదులపై తదుపరి విచారణ 2024 జూన్‌ 23న ఉంది. 

– సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర అధ్యక్షుడు, వినియోగదారుల మండలి 

చెరువుల ఆక్రమణలపై నోటీసులు 

వరంగల్‌ నగరం, పరిసర ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలపై వచి్చన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మా దృష్టికి వచి్చన వాటిని ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి సందర్శించి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చాము. పోలీసు, రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదులు చేశాం.

– ఎ.సుధాకర్‌ రెడ్డి, ఎస్‌ఈ, జలవనరులశాఖ

చదవండి: ‘థర్మల్‌’కు బై.. ‘రెన్యూవబుల్‌’కు జై!

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
invaders
Pond (Lake)
encroachments
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.