Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ముందే ప్లానేద్దాం.. సమ్మర్‌లో టూరేద్దాం!
ADVERTISEMENT 

ముందే ప్లానేద్దాం.. సమ్మర్‌లో టూరేద్దాం!

Telangana Sakshi User Sakshi Sakshi Time Mar 28, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
vacation.jpg

వేసవిలో వెకేషన్‌కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భారతీయులు.. 

దేశీయ పర్యాటకులకు ఫేవరేట్‌ గమ్యస్థానాలు.. కశ్మీర్, హిమాచల్, కేరళ, ఈశాన్య రాష్ట్రాలు   

టాప్‌ ఇంటర్నేషనల్‌ సమ్మర్‌ డెస్టినేషన్స్‌గా ఐరోపా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌ తదితర దేశాలు  

వీసా ఫ్రీ దేశాలైన నేపాల్, భూటాన్, థాయ్‌లాండ్, మాల్దీవులు, మారిషన్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: సమ్మర్‌ వెకేషన్‌కు ఇప్పటినుంచే మనవారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏటేటా పెరుగుతున్న పర్యాటకుల డిమాండ్‌కు తగ్గట్టుగానే...దేశవ్యాప్తంగా హోటళ్లు (హోటల్‌ రూమ్‌లు), ఇతర ప్రత్యామ్నాయ విడిదుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ వేసవిలో వివాహాలకు కూడా ముహూర్తాలు ఉండటంతో హోటళ్లకు కూడా డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. 

గత ఏడాదితో పోల్చితే ఇప్పటికే లగ్జరీ, మిడ్‌–స్కేల్, బడ్జెట్‌ సెగ్మెంట్‌లలో హోటల్‌ గదుల రేట్లు 10 నుంచి 12 శాతం పెరిగినట్టుగా ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఇన్‌ ఇండియన్‌ టూరిజమ్‌ అండ్‌ హాస్పిటాలిటీ వర్గాలు చెబుతున్నాయి. తమతమ కుటుంబ బడ్జెట్, వేసవి విడిదులకు సంబంధించి ఖర్చు చేయగలిగే స్తోమతను బట్టి దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, విదేశాల్లోని ప్రముఖ సందర్శన ప్రదేశాలు, మరికొందరు వీసా ఫ్రీ దేశాల్లో వేసవి పర్యటనలకు సిద్ధమవుతున్నారు.  

కశ్మీర్, గోవా, హిమాచల్, కేరళలకు వెళ్లేందుకు క్రేజ్‌  
దేశీయంగా చూస్తే.. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, గోవా, రాజస్తాన్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాలు వేసవి సెలవులకు గమ్యస్థానాలుగా అగ్రభాగాన నిలుస్తున్నాయి. వీటితోపాటు హిల్‌స్టేషన్లుగా పేరుగాంచిన ముస్సోరి, మనాలి, రుషికేశ్‌ తదితర ప్రాంతాల్లోని హోటళ్ల గదులకు డిమాండ్‌ అత్యధికంగా ఉన్నట్టుగా వెల్లడైంది. కూర్గ్, మహబలేశ్వర్‌ వంటి టూరిస్ట్‌ డెస్టినేషన్లకు కూడా క్రమంగా పర్యాటకులు పెరుగుతున్నట్టుగా వివిధ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

ప్రత్యేకంగా మహబలేశ్వర్‌లోని బీచ్‌కు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉదయ్‌పూర్, జైపూర్‌లు కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడి లేవు. రుషికేశ్, కాసోల్, హంపి, ముక్తేశ్వర్‌ వంటి పర్యాటక ప్రదేశాల్లో హాస్టళ్లకు డిమాండ్‌ పెరుగుతున్నట్టుగా జో వరల్డ్‌ సంస్థ వెల్లడించింది.  

టాప్‌ ఇంటర్నేషనల్‌ సమ్మర్‌ డెస్టినేషన్స్‌ ఇవే..  
ఇంటర్నేషనల్‌ సమ్మర్‌ డెస్టినేషన్స్‌గా స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, హంగేరీ, ఆ్రస్టియా, చెక్‌ రిపబ్లిక్, ఇతర ఐరోపా దేశాలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. వీటితోపాటు దుబాయ్, ఈజిప్ట్, జపాన్, సింగపూర్, వియత్నాం, ఇండోనేసియాలకు ఏటా డిమాండ్‌ పెరుగుతోందని అట్లీస్‌ సంస్థ వెల్లడించింది. ఇక ఈ వేసవి సీజన్‌లో యూఏఈ, యూఎస్‌ఏలకు అత్యధికంగా బుక్సింగ్‌ జరిగినట్టు ఈ సంస్థ తెలిపింది. ఈ దేశాల్లో పర్యటించేందుకు ముందుగానే పర్యాటకులు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా ఆ సంస్థ అంచనా వేసింది.  

అంటార్కిటికాలో ఐస్‌బ్రేకర్‌ క్రూయిజ్‌లు, ఫిన్‌లాండ్లో నార్తర్న్‌ లైట్స్‌ అనుభవాలు, గాజు గోపుర ఇగ్లూలు, ఆర్కిటిక్‌ సూట్‌లు మరియు ఆర్కిటిక్‌ ట్రీహౌస్‌లలో బస వంటి ప్రీమియం అనుభవాలను కూడా ప్రయాణికులు కోరుకుంటున్నారు. సౌత్‌ ఆఫ్రికా వైన్‌యార్డ్‌లలో కన్వర్టిబుల్‌ కార్లు లేదా హార్లే–డేవిడ్‌సన్‌లతో సెల్ఫ్‌–డ్రైవ్‌ సాహసాలు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి.

తొలిసారి విదేశీ పర్యటనలకు వెళుతున్న వారిలో ఎక్కువగా కాంబోడియా, శ్రీలంక, అజర్‌బైజాన్‌లను ఇష్టపడుతున్నారు. ఈ దేశాల సందర్శనకు సులభంగా వీసా ప్రక్రియ ఉండటంతోపాటు ఆయా సమ్మర్‌ ట్రిప్‌లకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉండడమే అందుకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీసా అవసరం లేని ప్రాంతాలకు ఆదరణ... 

ఇక వీసా అవసరం లేని వివిధ పర్యాటక దేశాలు భారత టూరిస్ట్‌లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే వీసా ఫ్రీ దేశాలు అయిన నేపాల్, భూటాన్, థాయ్‌లాండ్, మాల్దీవులు, మారిషస్‌ వంటి వాటికి భారత్‌ టూరిస్టుల నుంచి భారీగా డిమాండ్‌ పెరిగినట్టు హాలిడే, టూరిజం నిర్వాహకులు చెబుతున్నారు. ఈ దేశాలు వీసా రహిత సులభ ప్రవేశ కారణంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయి. ఎస్‌ఓటీసీ ట్రావెల్‌ హాలిడేస్, కార్పొరేట్‌ టూర్స్‌ విభాగం నివేదిక ప్రకారం.. వీసా రహిత గమ్యస్థానాలు ప్రయాణికులకు ఖర్చులను ఆదా చేసే అవకాశాన్ని అందిస్తున్నాయని, దీనిని వారు లగ్జరీ అనుభవాల కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొంది.  

ఉదాహరణకు థాయ్‌లాండ్‌లో ముయే థాయ్‌ (కిక్‌బాక్సింగ్‌) నేర్చుకోవడం, లగ్జరీ రిసార్ట్‌లలో డిటాక్స్‌ కార్యక్రమాలు, మారిషస్‌లో స్నార్కెలింగ్‌ లేదా మాల్దీవ్స్‌లో మిషెలిన్‌–స్టార్‌ అండర్‌వాటర్‌ డైనింగ్‌ వంటివి ఉన్నాయి. అదే సమయంలో ఫినామినన్‌–ఆధారిత ప్రయాణం ఒక కీలక ధోరణిగా ఉద్భవించిందని ఈ నివేదిక తెలిపింది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Summer vacation
tourists
Telangana
Indians
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.