Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. జేఈఈ మెయిన్స్‌లో.. టాప్‌ లేపిన తెలంగాణ!
ADVERTISEMENT 

జేఈఈ మెయిన్స్‌లో.. టాప్‌ లేపిన తెలంగాణ!

Telangana Sakshi User Sakshi Sakshi Time Apr 30, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
iit.jpg

ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌లో తెలంగాణ టాప్‌ లేపింది. జాతీయ స్థాయి మొదటి ర్యాంకు మాత్రమేగాక.. టాప్‌–10లో ఐదు ర్యాంకులను తెలంగాణ విద్యార్థులే సాధించారు. జాతీయ స్థాయిలో వంద పర్సంటైల్‌ సాధించిన వారిలోనూ రాష్ట్ర విద్యార్థులు 11 మంది ఉన్నారు. ఏపీతో కలుపుకొంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 16 మంది వంద పర్సంటైల్‌ సాధించిన టాప్‌–43లో నిలిచారు. ఇక ఓపెన్‌ కేటగిరీలో మొదటి వంద ర్యాంకుల్లో 25కుపైగా, టాప్‌ వెయ్యి ర్యాంకుల్లో 200కుపైగా తెలంగాణ విద్యార్థులకు దక్కాయి. ఈసారి జేఈఈ పరీక్ష జాతీయ స్థాయిలో రెండు దఫాలుగా.. జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి జరిగింది. కంప్యూటర్‌ ఆధారితంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన  ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 11,62,398 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,13,325 మంది హాజరయ్యారు. తుది ఫలితాలు, ర్యాంకులను ఎన్‌టీఏ శనివారం వెల్లడించింది. 

టాపర్స్‌ వీరే.. 

జేఈఈ మెయిన్స్‌లో దేశవ్యాప్తంగా వంద శాతం పర్సంటైల్‌ను 43 మంది విద్యార్థులు సాధించగా.. అందులో 11 మంది తెలంగాణ విద్యార్థులే. మొత్తంగా టాప్‌ ర్యాంకు హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట కౌండిన్యకు దక్కింది. టాప్‌–10 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన అల్లం సుజయ్‌ 6వ ర్యాంకు, వావిళ్ల చిద్విలాసరెడ్డి 7వ ర్యాంకు, బిక్కన అభినవ్‌ చౌదరి 8వ ర్యాంకు, అభినీత్‌ మంజేటి 10వ ర్యాంకు సాధించారు. ఇక గుత్తికొండ అభిరాం (17వ ర్యాంకు), భరద్వాజ (18వ ర్యాంకు), పాలూరి గణకౌశిక్‌రెడ్డి (20వ ర్యాంకు), రమేశ్‌ సూర్యతేజ (21వ ర్యాంకు), నందిపాటి సాయి దుర్గారెడ్డి (40వ ర్యాంకు), ఈవూరి మోహన శ్రీధర్‌రెడ్డి (41వ ర్యాంకు) తదితరులు వందశాతం పర్సంటైల్‌ సాధించిన టాప్‌–43 ర్యాంకర్లలో ఉన్నారు. 

రేపట్నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు 

జేఈఈ అర్హత సాధించినవారు ఈ నెల 30 నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌టీఏ ప్రకటించింది. ర్యాంకు కార్డు డౌన్‌లోడ్‌ చేసుకుని, దాని ఆధారంగా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వివిధ కేటగిరీలకు కేటాయించిన కటాఫ్‌ మార్కుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులైన వారి వివరాలను ర్యాంకు కార్డులో పొందుపరిచారు. 



అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్‌ ఇదీ.. 

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌కు హాజరైనవారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. పరీక్షలో వచి్చన మార్కులను పరిగణనలోకి తీసుకుని వివిధ కేటగిరీల వారీగా కటాఫ్‌ నిర్ణయిస్తారు. గత ఏడాది కన్నా ఈసారి ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసారి ఓపెన్‌ కేటగిరీలో 90 పర్సంటైల్‌తో కటాఫ్‌ నిర్ణయించారు. 

 

కేటగిరీల వారీగా కటాఫ్‌ ఇదీ.. 

కేటగిరీ    కటాఫ్‌         ఎంపికైన అభ్యర్థుల సంఖ్య 

ఓపెన్‌     90.788642     98,612 

పీహెచ్‌    0.0013527     2,685 

ఈడబ్ల్యూఎస్‌    75.6229025     25,057 

ఓబీసీ     73.6114227     67,613 

ఎస్సీ    51.9776027     37,536 

ఎస్టీ    37.2348772     18,752 

 

కృత్రిమ మేధపై పట్టు సాధించాలనుంది 

జేఈఈ మెయిన్స్‌లో జాతీయస్థాయి టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. అడ్వాన్స్‌డ్‌లోనూ ఇదే పట్టుదలతో విజయం సాధిస్తా. ముంబై ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరాలనుంది. తర్వాత ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌లో పట్టు సాధించాలన్నది నా లక్ష్యం. ఆ దిశగా రోజుకు 18 గంటలు కష్టపడి చదువుతున్నాను. మా నాన్న శ్రీపణి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, అమ్మ రాజరాజేశ్వరి నా కోసం చాలా కష్టపడ్డారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తాను. 

– సింగరాజు వెంకట కౌండిన్య, జేఈఈ టాపర్‌   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
IIT JEE
results
iit
Telangana
ranks
Sakshi News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

మెస్సి మ్యాజిక్.. వరుస విజయలతో అర్జెంటీనా జోరు..

మెస్సి మ్యాజిక్.. వరుస విజయలతో అర్జెంటీనా జోరు..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.