Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. హైద‌రాబాద్‌లో తరచూ ఇక్క‌డే యాక్సిడెంట్లు
ADVERTISEMENT 

హైద‌రాబాద్‌లో తరచూ ఇక్క‌డే యాక్సిడెంట్లు

Telangana Sakshi User Sakshi Sakshi Time Jun 19, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
caraccident.jpg

2023–25 గణాంకాల ఆధారంగా నిర్ధారణ

398 ఘటనల్లో 279 మంది దుర్మరణం

సాక్షి, హైద‌రాబాద్‌: నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు బ్లాక్‌స్పాట్స్‌పై దృష్టి సారించారు. తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తు చేస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో 2023–25 మధ్య నిర్వహించిన అధ్యయనం ఆధారంగా 49 ప్రాంతాల్లో బ్లాక్‌స్పాట్స్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో మూడేళ్లలో 398 ప్రమాదాలు జరగ్గా.. 279 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయా చోట్ల ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సంబంధిత విభాగాలకు లేఖలు రాశారు.  

జాతీయ రహదారులపైనే అత్యధికం..  
నగర ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో కేవలం కొన్నింటిలో మాత్రమే బ్లాక్‌స్పాట్స్‌ లేవని తేలింది. అత్యధిక ఠాణాల పరిధిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్‌స్పాట్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. మొత్తం 49 బ్లాక్‌స్పాట్స్‌లో 26 జాతీయ రహదారుల పైనే ఉన్నాయని ట్రాఫిక్‌ విభాగం అధికారులు గుర్తించారు. ఎన్‌హెచ్‌ నం.44పై 11, ఎన్‌హెచ్‌ నం.65పై 13 ఉండగా.. ఎన్‌హెచ్‌ నం.765, 163లపై ఒకొక్కటి చొప్పున ఉన్నాయి. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు సహా ఇతర రహదారులపై మిగిలినవి ఉన్నట్లు ట్రాఫిక్‌ పోలీసుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  

అనేకం ‘చావు’రస్తాలే... 
నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో అత్యధికం చౌరస్తాలు, జంక్షన్లే. రద్దీ వేళలు,  సిగ్నళ్లు యాక్టివ్‌గా ఉండే సమయంలో కంటే మిగిలిన సమయాల్లోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ 49 బ్లాక్‌స్పాట్స్‌లో 40 శాతం చౌరస్తాల్లో ఉన్నవే. ఆయా ప్రాంతాలు సైతం హైదరాబాద్‌–సైబరాబాద్‌–మల్కాజిగిరి సరిహద్దుల్లో కొన్ని ఉండటం గమనార్హం. వీటిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో మరణించిన/క్షతగాత్రులైన వారిలో పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువగా ఉన్నారు.  

ప్రమాదాలకు కారణాలివే 
⇒ పరిమితికి మించిన వేగం, మద్యం తాగి వాహనాలు నడపటం 
⇒ మలుపులున్న చోట్ల డివైడర్లు, మీడియమ్స్‌ లేకపోవడం 
⇒ అత్యంత సమస్యాత్మకంగా (బ్‌లైండ్‌) ఉన్న మలుపులు 
⇒ కీలక సూచనలు చేసే సైనేజ్‌ బోర్డులు లేకపోవడం 
⇒ ఇరుకైన రోడ్లు, ఆపై అక్కడే ఉంటున్న ఆక్రమణలు 
⇒ రోడ్‌ ఇంజినీరింగ్‌ను పట్టించుకోకుండా రహదారి నిర్మాణం 
⇒ రహదారులపై హఠాత్తుగా చేపడుతున్న మరమ్మతులు 
⇒ క్యారేజ్‌ వేలో తొలగించకుండా వదిలేసిన చెట్లు, కరెంటు స్తంభాలు 
⇒ అవసరమైన స్థాయిలో విద్యుత్‌ దీపాలు లేకపోవడం 
⇒ వాహనచోదకులు రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ చేయడం 
⇒ నో–ఎంట్రీల్లోకి వాహనాలతో దూసుకుపోవడం 
⇒ రోడ్‌ మార్కింగ్‌ పక్కగా లేకపోవడం, శాస్త్రీయత కొరవడటం

చ‌ద‌వండి: బుడ్డోడి స‌ర‌దా.. లగ్జరీ కారు గోవిందా! 

గ్రే స్పాట్లే కీలకం 
బ్లాక్‌ స్పాట్స్‌తో పాటు గ్రే స్పాట్స్‌ గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వాలి. తరచూ ప్రమాద ప్రాంతాలు బ్లాక్‌ స్పాట్స్‌ కిందికి వస్తే.. ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్నవి గ్రే స్పాట్స్‌. గ్రే స్పాట్లను గుర్తించి ముందే చర్యలు తీసుకుంటే ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడవచ్చు.  
– ఎం.ప్రకాష్‌ కుమార్, రవాణా రంగ నిపుణుడు    

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Road Accident
black spots
Hyderabad
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.