Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఒకవైపు కూల్చివేతలు.. మరోవైపు పరిహారం పంపిణీ
ADVERTISEMENT 

ఒకవైపు కూల్చివేతలు.. మరోవైపు పరిహారం పంపిణీ

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 24, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Hyderabad-Metro-Rail.jpg

ఇప్పటివరకు 41 మందికి రూ.20 కోట్ల వరకు అందజేత

1,100 నిర్మాణాలకు రూ.వెయ్యి కోట్ల పరిహారం అవసరం

త్వరలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

సాక్షి, హైద‌రాబాద్‌: పాతబస్తీ మెట్రో పనులు పట్టాలెక్కి పరుగులు తీస్తున్నాయి. మెట్రో రూట్‌లో కూల్చివేతలు ఊపందుకున్నాయి. మీరాలంమండి నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న మార్గంలో కూల్చివేతలు చకచకా సాగుతున్నాయి. మెట్రో రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం (Metro Route) నిర్మించనున్న సంగతి తెలిసిందే. దీంతో జేబీఎస్‌ (JBS) నుంచి చాంద్రాయణగుట్ట వరకు అతి పెద్ద గ్రీన్‌కారిడార్‌ (Green Corridor) అందుబాటులోకి రానుంది. ఈ రూట్‌లో రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణను సకాలంలో పూర్తి చేసేందుకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) కార్యాచరణను వేగవంతం చేసింది. ఎంజీబీఎస్‌ – చాంద్రాయణగుట్ట వరకు తొలగించాల్సిన 1,100 ఆస్తులను అధికారులు ఇప్పటికే గుర్తించారు.

41 మందికి రూ.20 కోట్ల వరకు చెల్లింపు...
భూసేకరణ చట్టానికి అనుగుణంగా సేకరించనున్న ఆస్తులకు పరిహారం చెల్లించేందుకు హెచ్‌ఏఎంఎల్‌ (HAML) చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 41 మందికి రూ.20 కోట్ల వరకు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. పాతబస్తీలో గుర్తించిన 1100 ఆస్తులకు సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు చెల్లించవలసి ఉంటుందని అంచనా. గజానికి రూ.81 వేల చొప్పున చెల్లించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. రోడ్డు విస్తరణ, మెట్రో నిర్మాణంలో మతపరమైన, చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా సమర్ధవంతమైన ఇంజినీరింగ్‌ పరిష్కారాలతో పరిరక్షిస్తున్నట్లు హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి (NVS Reddy) తెలిపారు.  

పర్యాటకంగా మరింత ఆకర్షణ... 
మెట్రో రైల్‌ రాకతో పాత నగరానికి కొత్త సొబగులు సమకూరనున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుకానున్నాయి. కాలుష్యరహితంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది. మెట్రో అందుబాటులోకి వస్తే మరింత ఎక్కువ మంది పర్యాటకులు పాతబస్తీని సందర్శించే అవకాశం ఉంది. అటు నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి, ఇటు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు, పర్యాటకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాతబస్తీకి రాకపోకలు సాగించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు చార్మినార్‌ సందర్శన ఒక ప్రత్యేకత. మెట్రో రాకతో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకోనుంది.  


ఆస్తులను కోల్పోవడంపై విచారం  
మరోవైపు దశాబ్దాలుగా తాము నివాసం ఉంటున్న, ఉపాధి పొందుతున్న భవనాలు, షాపులను మెట్రోరైల్‌ నిర్మాణంలో భాగంగా కోల్పోవడం పట్ల పాతబస్తీ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులను కోల్పోవడం బాధగానే ఉన్నప్పటికీ పాతబస్తీ అభివృద్ధి దృష్ట్యా అంగీకరిస్తున్నట్లు మీరాలంమండికి చెందిన ఇబ్రహీం అనే ఛాయ్‌ దుకాణదారు తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న వస్త్ర, కిరాణా దుకాణాలు, హోటళ్లు కనుమరుగు కానున్నాయి.

చ‌ద‌వండి: మరో రెండు అంతర్జాతీయ విమాన సర్వీసులు    

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Hyderabad Metro Rail
old city
Hyderabad Metro Rail Limited
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఈ అగరబత్తుల మేజిక్ మాములుగా ఉండదు.. ఒక్కటి వెలిగిస్తే మీ ఇల్లంతా పరిమళమే..!

ఈ అగరబత్తుల మేజిక్ మాములుగా ఉండదు.. ఒక్కటి వెలిగిస్తే మీ ఇల్లంతా పరిమళమే..!

ఇది ఓల్డ్‌ సిటీ కాదు.. ఒరిజినల్‌ సిటీ

ఇది ఓల్డ్‌ సిటీ కాదు.. ఒరిజినల్‌ సిటీ

Metro: రేపు రాత్రి ఒంటిగంట వరకూ సేవలు

Metro: రేపు రాత్రి ఒంటిగంట వరకూ సేవలు

పాయా షేర్వా.. నోరూరించేలా!

పాయా షేర్వా.. నోరూరించేలా!

పాతబస్తీలో ప్రధాని సతీమణి

పాతబస్తీలో ప్రధాని సతీమణి

2012లో హైదరాబాద్‌కు సాజిద్‌.. 27 సార్లు ఎందుకు వచ్చాడు?

2012లో హైదరాబాద్‌కు సాజిద్‌.. 27 సార్లు ఎందుకు వచ్చాడు?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.