Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. Old City Metro Rail: అనగనగా మెట్రో..
ADVERTISEMENT 

Old City Metro Rail: అనగనగా మెట్రో..

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 27, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
3556.jpg

రెండో దశలో 8 లక్షలు.. 2030 నాటికి 10 లక్షల మంది ప్రయాణికులు  

వచ్చే జనవరి మొదటి వారంలో పాతబస్తీలో పనులు ప్రారంభం 

నిధుల లభ్యతకు ఇబ్బందులేమీ లేవు 

నాలుగేళ్లలో 5 కారిడార్‌లు పూర్తి  

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రెండోదశ నిర్మాణానికి నిధుల లభ్యతలో ఎలాంటి ఇబ్బంది లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌గా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు తక్కువ వడ్డీ రేటుకు నిధులు అందజేసేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైల్‌ ఎండీ  ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. 2028లో రెండో దశ పూర్తయ్యేనాటికి సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుంటారని.. 2030 నాటికి 10 లక్షలకు చేరే అవకాశం ఉందన్నారు. రెండో దశ కారిడార్‌లలో ప్రయాణికుల డిమాండ్‌పై లీ అసోసియేషన్‌  సంస్థ రూపొందించిన కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ నివేదిక (సీఎంపీ) ప్రకారం ప్రతిపాదించిన అయిదు కారిడార్‌లలో ప్రయాణికుల డిమాండ్‌ అత్యధికంగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌ మెట్రోరైల్‌ మొదట దశ ప్రాజెక్టుకు 7 ఏళ్లు పూర్తయిన (ఈ నెల 28) సందర్భంగా మంగళవారం బేగంపేట్‌ మెట్రో భవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్వీఎస్‌ రెడ్డి ఏం చెప్పారంటే..   

ఏడేళ్లలో 63.40 కోట్ల ప్రయాణికులు.. 
గత ఏడేళ్లలో నాగోల్‌– రాయదుర్గం, ఎల్‌బీనగర్‌–మియాపూర్, జూబ్లీ బస్టేషన్‌–ఎంజీబీఎస్‌ మూడు కారిడార్‌లలో 63.40 కోట్ల మంది ప్రయాణం చేశారు. రోజుకు  5 లక్షల మంది  ప్రయాణం చేస్తుండగా.. ఈ  ఏడాది ఆగస్టు 14న అత్యధికంగా  5.63 లక్షల  మంది ప్రయాణం చేశారు. రెండో దశ పూర్తిస్థాయిలో అందుబాటు లోకి వస్తే  మొదటి, రెండు దశల్లో కలిపి సుమారు 15 లక్షల నుంచి క్రమంగా 20 లక్షలకు పెరిగే  అవకాశం ఉంది. వచ్చే డిసెంబరు నెలాఖరుకు పాతబస్తీలో రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేతలు చేపట్టనున్నాం. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో రెండో దశ  పనులు ప్రారంభమవుతాయి.  

జాయింట్‌ వెంచర్‌..  
⇒సమాజంలోని అన్ని వర్గాల ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రెండో దశ రూట్‌లను ఎంపిక చేశాం. ఇది మొత్తం  6 కారిడార్‌లలో 116.4 కి.మీ. ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫోర్త్‌సిటీ మెట్రోకు సర్వే పనులు  ప్రారంభించాం. రెండో దశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల (50: 50) జాయింట్‌ వెంచర్‌. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఈ నెల 4న కేంద్రానికి అందజేశారు. కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే పనులు మొదలవుతాయి. ప్రస్తుతం 5 కారిడార్‌లలో  చేపట్టనున్న  76.4 కి.మీ. కారిడార్‌ల  నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం  రూ.7,313 కోట్లు (30 శాతం), కేంద్రం  రూ.4,230 కోట్లు (18 శాతం) చొప్పున అందజేయనున్నాయి. మిగతా 48 శాతం నిధు లు రూ.11,693 కోట్లను ప్రాజెక్ట్‌ రుణాలుగా కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే సావరిన్‌ గ్యా రంటీతో జైకా, ఏడీబీ, ఎన్‌డీపీ వంటి మల్టీ లేటరల్‌ సంస్థల నుంచి సేకరించనున్నారు. మరో 4 శాతం నిధులు రూ.1,033 కోట్లను మాత్రం పీపీపీ విధానంలో సమకూర్చుకుంటారు. రెండోదశలో నిర్మాణ వ్యయం భారీగా తగ్గనుంది.  

భూసేకరణ వేగవంతం... 
ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న పాతబస్తీ మెట్రో ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. రోడ్డు విస్తరణతో 1100 పైగా ఆస్తులు ప్రభావితం కానున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 800 ఆస్తుల వివరాలను హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు అందజేశాం. వాటిలో 200 కట్టడాల తొలగింపునకు ఆయన చర్యలు చేపట్టారు. డిసెంబర్‌లో పరిహారం చెల్లింపుతో పాటు కూలి్చవేతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ  ధరల ప్రకారం అక్కడ గజానికి రూ.23,000 చొప్పున ఉంది. దానికి రెట్టింపుగా ప్రస్తుత మార్కెట్‌ విలువకు అనుగుణంగా గజానికి రూ.65,000 చొప్పున చెల్లించనున్నారు. మొత్తం ఆస్తుల సేకరణకు సుమారు రూ.700 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది.    

3 కోచ్‌లు.. 35 కి.మీ వేగం.. 
ప్రస్తుతం మొదటి దశలో ఉన్నట్లుగానే రెండో దశలోనూ మెట్రో రైల్‌కు 3 కోచ్‌లు ఉంటాయి. గంటకు  35 కిలోమీటర్ల  సగటు వేగంతో రైళ్లు నడుస్తాయి. ప్లాట్‌ఫాంలు మాత్రం  6 కోచ్‌లు నిలిపేందుకు వీలుగా నిర్మిస్తారు.

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
old city
Metro Rail
Hyderabad
NVS Reddy
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.