Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. కొత్తగూడెంలో 50–50
ADVERTISEMENT 

కొత్తగూడెంలో 50–50

Telangana Sakshi User Sakshi Sakshi Time Feb 14, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
32.jpg

కాంగ్రెస్, సీపీఐలకు సమానంగా 22 డివిజన్లు 

8 డివిజన్లతో కింగ్‌మేకర్‌ పొజిషన్‌లో బీఆర్‌ఎస్‌

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్‌  ఏర్పడింది. దీంతో ఇక్కడ మేయర్‌ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలుగా ఉన్నా కొత్తగూడెం కార్పొరేషన్‌ సీట్ల పంపకాల విషయంలో రెండు పార్టీల మధ్య సర్దుబాటు కుదరలేదు. దీంతో కాంగ్రెస్‌ సీపీఎంతో జత కట్టి 58 స్థానాల్లో పోటీ చేసింది. చివరకు ఆ పార్టీ 22 డివిజన్లకే పరిమితం కాగా, మిత్రపక్షమైన సీపీఎం రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట గెలిచింది. ఆది నుంచీ చెబుతున్నట్టుగానే 22 స్థానాల్లో సీపీఐ గెలిచింది. 51 డివిజన్‌ నుంచి గెలిచిన అభ్యర్థి సీపీఐకి మద్దతుదారుగా ఉన్నారు.  

కింగ్‌ ఎవరో? 
కొత్తగూడెం కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉన్నాయి. మేయర్‌ పదవి దక్కించుకునేందుకు 31 డివిజన్లలో గెలవాలి. అయితే ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ చెరో 22 డివిజన్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీలుగా అవతరించినా సరిపడా మెజారిటీ సాధించలేకపోయాయి. అయితే కాంగ్రెస్‌ జోరుకు బ్రేక్‌ వేసేందుకు కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. 

ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కారద్యర్శి కూనంనేని సాంబశివరావుతో మాట్లాడినట్టు తెలిసింది. సీపీఐ 23 స్థానాలకు తోడు బీఆర్‌ఎస్‌ సభ్యులు 8 మంది తోడైతే మేయర్‌ పదవి సీపీఐ ఖాతాలో పడుతుంది. అయితే, బీఆర్‌ఎస్‌ ఆఫర్‌పై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సీపీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కొత్తగూడెం విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి సైతం కూనంనేనికి ఫోన్‌ చేసి సంప్రదింపులు జరిపినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే సీపీఐ– కాంగ్రెస్‌లు కలిసి అధికారం పంచుకునే వీలుంది. 

కీలకంగా ఎక్స్‌అఫీషియో ఓట్లు 
మిత్రపక్షమైన సీపీఎంతో కలిపి కాంగ్రెస్‌ బలం 23గా ఉంది. ఐదుగురు స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రయత్నాలు మొదలెట్టింది. వారు కాంగ్రెస్‌ పక్షాన నిలిస్తే హస్తం ఖాతాలో 28 డివిజన్లు ఉంటాయి. మెజారిటీకి మరో మూడు ఓట్లు అవసరం పడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగూడెం నుంచి ఎక్స్‌అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డిలతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను కాంగ్రెస్‌ రంగంలోకి దింపాల్సి ఉంటుంది. 

అప్పుడు కాంగ్రెస్‌ మేజిక్‌ ఫిగర్‌ను చేరుకుంటుంది. అయితే, సీపీఐ, బీఆర్‌ఎస్‌ మధ్య పొత్తు చిగురించని పక్షంలోనే ఈ సమీకరణానికి చోటుంది. ఒక వేళ సీపీఐ అనుబంధ సభ్యుడు, ఒకరిద్దరు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు హస్తం వైపు మొగ్గు చూపినా కాంగ్రెస్‌కు మేయర్‌ పదవి దక్కించుకోవడం అంత సులువు కాదు. ఎక్స్‌అఫీషియో కోటాలో సీపీఐకి కూనంనేని సాంబశివరావుతో పాటు బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు ఓట్లు అండగా నిలిచే అవకాశముంది.  

కొత్తగూడెం మేయర్‌ మాకే!
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మేయర్‌ స్థానం సీపీఐకి వచ్చే అవకాశం ఉందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఆయన శుక్రవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. దేశంలో మేయర్‌ స్థానం కమ్యూనిస్టులకు రావడం గొప్ప గౌరవమన్నారు. కమ్యూనిజంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. ఈ విజయం కార్మికులకు అంకితమని, తమ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. తమకు మద్దతు ఇస్తామని కేటీఆర్‌ ఫోన్‌లో హామీ ఇచ్చారని, కాంగ్రెస్‌ నుంచి ఇంకా ఎవరూ మాట్లాడలేదని వివరించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
Municipal elections
kothagudem
Hung
Congress Party
CPM
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.