Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. పొలం పనులకు వెళ్లి.. వరదలో చిక్కుకుని..
ADVERTISEMENT 

పొలం పనులకు వెళ్లి.. వరదలో చిక్కుకుని..

Telangana Sakshi User Sakshi Sakshi Time Jul 19, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bhadradri.jpg

పెద్దవాగుకు వరద పోటెత్తడంతో చిక్కుకుపోయిన 28 మంది.. హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతానికి..

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/అశ్వారావుపేట­రూరల్‌:  ఒక్కసారిగా పెద్దవాగుకు వరద పోటెత్తింది. దీంతో ఆ వరద ఉధృతిలో 28 మంది చిక్కుకు­న్నారు. వారిని కాపాడేందుకు రెండు హెలికాప్టర్లు రంగంలోకి 25 మందిని సురక్షిత ప్రాంతానికి చేర్చగా, మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. 

వాన తగ్గిందని...
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి దగ్గర పెద్దవాగుపై మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టులోకి వరద వచ్చే క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కొంత ఏపీలోని బుట్టాయి­గూడెం మండల పరిధిలో ఉంది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులో ప్రవాహం పెరిగింది. మరోవైపు అశ్వారావుపేట మండలంలో గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. మధ్యాహ్నం 12:30 గంటలకు వాన కొంత తగ్గుముఖం పట్టడంతో స్థానికులు పొలా­లకు వెళ్లారు. 

మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో పెద్దవాగుకు అకస్మాత్తుగా వరద పెరిగి ముందుగా ఒడ్డు వెంట ఉన్న పొలాలను చుట్టుముట్టింది. దీంతో వరదలో చిక్కుకున్న వారు ప్రాణాలు కాపాడుకునేందుకు చెరువుకట్టకు దగ్గరలో ఉన్న ఎత్తయిన ప్రదేశం వైపు వెళ్లారు. ఆ తర్వాత క్రమంగా వరద నీటిమట్టం పెరుగుతూ మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి బాధితుల మోకాళ్లలోతు వరకు వచ్చాయి. క్రమంగా గట్టు దాటుకొని పొలాలను ముంచెత్తింది. 

ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యానికి మించి వరద రావడంతో ముందుగా ప్రాజెక్టు ఎగువ భాగం ముంపునకు గురైంది. దీంతో వెంటనే ప్రాజెక్టుకు ఉన్న మూడు గేట్లు తెరిచేందుకు ప్రయత్నించగా అందులో ఒకటి తెరుచుకోలేదు. బాధితులు ఫోన్‌లో సమాచారం ఇవ్వగా, వరద పరిస్థి­తిని తెలుసుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వర­రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని సహాయ కార్యక్రమాల కోసం అప్రమత్తం చేశారు. 

అటు అనుకుంటే ఇటు..: ఏపీలోని వేలేరు పాడు మండలం అల్లూరినగర్‌ దగ్గర వరద నీటిలో ఒక కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ఐదుగురిని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి నేవీ హెలికాప్టర్‌ను పంపింది. అయితే హెలికాప్టర్‌ రావడం ఆలస్యం కావ­డంతో గ్రామస్తులు ఆ కారులో ఉన్న ఐదు­గురిని కాపాడారు. దీంతో నేవీ హెలికాప్టర్‌ సంఘటనా స్థలానికి రాకుండా ఏలూరులో ఆగిపోయింది. అయితే అదే సమయంలో పెద్దవాగు ప్రాజెక్టు ఎగు­వన నారాయణపురంలో 28 మంది వరదలో చిక్కుకుపోయిన విషయం వెలుగుచూసింది. దీంతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అక్కడి అధికా­రు­లతో మాట్లాడి హెలికాప్టర్‌ను ఇటు పంపించారు.  

జాయింట్‌ ఆపరేషన్‌: ఏలూరు నుంచి హెలికాప్టర్‌ ఘటనా స్థలికి 6:15 గంటలకు వచ్చింది. వెలుతురు సరిగ్గా లేదు. సహా య కార్యక్రమాలు ఏమేరకు జరుగు­తాయో అనే సందేహం నెలకొంది. నేవీ హెలి­కాప్టర్‌ ముందుగా ప్రభావిత ప్రాంతంలో చక్కర్లు కొట్టి బాధితులు ఉన్న లొకేషన్‌ను గుర్తించింది. ఆ తర్వాత 20 నిమి­షాలకు తెలంగాణకు చెందిన హెలికాప్టర్‌ ఘటనా స్థలికి చేరుకుంది. 

6:45 గంటలకు అసలైన రెస్క్యూ ఆపరేషన్‌ మొదలైంది. నేవీ హెలికాప్టర్‌ దారి చూపిస్తూ లొకేషన్‌ దగ్గరికి తీసుకెళ్లి బాధితులు ఉన్న చోటుపై లైట్‌ వేసింది. రెండో హెలికాప్టర్‌ ఆ స్థలానికి చేరుకుని బాధితులకు రోప్‌ అందించింది. విడతల వారీగా బాధితులను బయటకు తీసుకురా వడంతో రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతమైంది.  

వైకుంఠధామంలో ల్యాండింగ్‌..
బాధితులు మధ్యాహ్నం 3 గంటలకు వరద నీటిలో చిక్కుకున్నారు. గంటగంటకూ వరద నీరు పెరుగుతూ మోకాళ్ల లోతుకు వచ్చింది. బాధితుల్లో మహేశ్‌ అనే యువకుడి దగ్గరే ఫోన్‌ ఉంది. దీంతో ప్రాణభయంతో అందరూ ఆ ఫోన్‌ నుంచే కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి తమ ప్రాణాలు దక్కవే­మోనంటూ బోరున విలపించారు. 

మూడు గంటలు గడిచినా రెస్క్యూ­ఆపరేషన్‌ మొదలు కాకపోవడం, మరోవైపు చీకటి పడుతుండటంతో పైప్రా­ణాలు పైనే పోయాయని భావించారు. అయితే ఏడు గంటల సమయంలో వరద నీటి నుంచి వారిని కాపాడిన హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు సరైన స్థలం లేక నారాయణపురం గ్రామంలో ఉన్న వైకుంఠధామం (స్మశానం)లో వారిని దించింది. ప్రాణాపాయం నుంచి బయటపడిన వారికి వైకుంఠధామం తొలి ఆశ్రయం ఇచ్చింది.

పెద్దవాగుకు గండి
రైట్‌ కెనాల్‌ తూము దగ్గర 40 మీటర్ల వద్ద....
తెలంగాణలో రెండు, ఏపీలో ఏడు గ్రామాలు మునక!
ముందుగానే గ్రామాలు ఖాళీ చేసిన ప్రజలు 
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏపీ, తెలంగాణవాసులను గడగడలాడించిన పెద్దవాగుకు ప్రాజెక్టుకు గండిపడింది. రెండు రాష్ట్రాల పరిధి పెద్దవాగు క్యాచ్‌మెంట్‌ ఏరియాలో సుమారు 16 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో గురు వారం ఉదయం నుంచి వాగుకు వరద పోటెత్తింది. ఈ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 40,500 క్యూసెక్కులు కాగా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 70 వేల క్యూసెక్కులు, సాయంత్రం 5గంటలకల్లా 90 వేల క్యూసెక్కుల వరద చేరింది. దీంతో మధ్యాహ్నం నుంచే ప్రాజెక్టుకు ఎగపోటు మొదలైంది. 

సాయంత్రం 5–30 గంటలకు గేట్లు, మట్టికట్ట మీద నుంచి నీరు ప్రవహించడం మొద లైంది. రాత్రి 7.30గంటల సమయంలో 32 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. అయితే ఉధృతి తగ్గకపోవడంతో రాత్రి 8 గంటల సమయంలో రైట్‌ కెనాల్‌ తూము దగ్గర 40 మీటర్ల మేరకు గండి పడగా,  అక్కడి నుంచి కొంత దూరంలో మరో 20 మీటర్ల మేరకు గండి పడింది. మొత్తంగా 150 మీటర్ల మేరకు మట్టి కట్ట బలహీనపడిందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. 

నీట మునిగిన గ్రామాలు: పెద్దవాగు దిగువన తెలంగాణలో గుమ్మడవెల్లి, కొత్తూ రు గ్రామాలు ఉన్నాయి. గురువారం సాయంత్రం వరద ఉధృతి పెరిగిన వెంటనే ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు అధికారులు హుటా హుటిన ఖాళీ చేయించారు. గండి పడిన తర్వాత వచ్చిన వరద నలభై ఇళ్లను ముంచెత్తింది. పశువులు ఇతర ఆస్తి నష్టం వివ రాలు తెల్లవారితే కానీ తెలిసే అవకాశం లేదు.  ఏపీలోని వేలేరుపాడు మండలం మేడిపల్లి, రామవరం, గుండ్లవాయి, రెడ్డిగూడెంకాలనీ, మద్దిగట్ల, పూచిరాల గ్రామాల్లోనూ వరద ప్రభావానికి లోనయ్యాయి.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
floods
Telangana
Helicopters
help
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.