Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. కష్టాల కడలిలో ‘గోదావరి’ రైతులు
ADVERTISEMENT 

కష్టాల కడలిలో ‘గోదావరి’ రైతులు

Telangana Sakshi User Sakshi Sakshi Time Aug 8, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
GODAVARI_201.jpg

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంత రైతులను నిండా ముంచాయి. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వరిపైర్లు వరదల తీవ్రతకు కొట్టుకుపోవడంతోపాటు పొలాలు కోతకు గురై ఇసుక మేటలు వేశాయి.

చాలాచోట్ల పొలాల్లోనే విద్యుత్‌ తీగలు, స్తంభాలు పడిపోగా ట్రాన్స్‌ఫార్మర్లు వరదలో మునిగాయి. సుమారు లక్షన్నర ఎకరాల్లో పంటలు దెబ్బతినగా ఇసుక మేటలు తొలగించలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వరదలకు ములుగు, జేఎస్‌ భూపాలపల్లి జిల్లాల్లో 22 మంది గల్లంతవగా ఇంకా ముగ్గురి ఆచూకీ లభించలేదు. 



తేలని నష్టపరిహారం లెక్కలు...  

వరదల్లో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించినా ఆ ప్రకియ ఇంకా కార్యరూపం దాల్చలేదు. కేంద్ర, రాష్ట్ర బృందాలు ఐదు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించినా అధికారికంగా నష్టాలను తేల్చలేదు. పంట నష్టం 33 శాతంపైన ఉంటేనే వరద నష్టం అంచనా వేస్తామని మండలస్థాయి అధికారులు చెబుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.

దీంతో నాట్ల దశలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వర్తించదన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణవ్యాప్తంగా సుమారు రూ. 2,400 కోట్ల మేర నష్టం ఉంటుందని ప్రాథమిక అంచనా కాగా.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనే రూ. 1,000 కోట్లపైన నష్టం ఉంటుందని చెబుతున్నారు. ఇంత నష్టం జరిగినా అధికారులు మార్గదర్శకాలతో మల్లగుల్లాలు పడుతుండగా ఏం చేయాలో తెలియక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. 



అయినోళ్ల కోసం కళ్లలో వత్తులు వేసుకొని... 

బండ్ల సారయ్య–సారమ్మ... సారయ్య తల్లి రాజమ్మ... ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం బూరుగుపేటకు చెందిన ఈ ముగ్గురిని వరద మింగేసింది. జూలై 27న కురిసిన అతిభారీ వర్షంతో మారేడుగొండ చెరువుకు గండిపడి వరద ప్రవాహానికి సారయ్య ఇల్లు కొట్టుకుపోయింది. ఇంట్లో ఉన్న సారయ్య, సారమ్మ, రాజమ్మ గల్లంతయ్యారు. వారికి కొంతదూరంలో నివసించే సారయ్య కొడుకు, కోడలు ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. వరద తగ్గాక సారయ్య మృతదేహం లభించినప్పటికీ అత్తా కోడళ్లయిన రాజమ్మ, సారమ్మల ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది.

వరదలతో ఆగమయ్యాం.. 

నాలుగు ఎకరాల్లో ఇసుకమేటలు వేసినా ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా మా ముఖం చూడలేదు. వరదలతో ఆగమయ్యాం. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.  

– కొక్కిరాల తిరుపతిరావు, రైతు, పరకాల

ఈ ఫొటోలోని యువరైతు పేరు కూతురు భూపాల్‌రెడ్డి. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఈయనకు చలివాగు వంతెన సమీపంలో 2.26 ఎకరాల పొలం ఉంది. ఈసారి సన్నరకం నారు అలికి సాగుకు సిద్ధపడుతున్న సమయంలో చలివాగు ప్రవాహానికి కొట్టుకుపోయి పొలమంతా ఇసుకమేటలు వేసింది. దీంతో రూ. లక్ష నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నాడు. 

భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన ఈ రైతు పేరు శ్రీపతి తిరుపతి. రెండెకరాల సాగుభూమిలో భారీగా ఇసుక మేటలు వేసింది. ఇసుక మేటను తీయాలంటే కనీసం రూ. 20 వేల ఆదనపు ఖర్చయ్యేలా ఉంది. తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేనందున పంట వదిలేయడం తప్ప వేరే మార్గం లేదంటున్నాడు. 

ఈయన పేరు చల్ల రవీందర్‌. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన రైతు. మానేరు వరద ఉధృతికి ఆయన మూడెకరాల పొలంలో పూర్తిగా ఇసుక మేటలు వేసింది. ఇప్పటికే పొలం దున్నడానికి రూ.10 వేల వరకు ఖర్చు చేశాడు. ప్రభుత్వం తక్షణమే పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాడు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
heavy rains
Telangana
floods
crops
damaged
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.