Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఫ్యూచర్‌ సిటీ మెట్రోకు డీపీఆర్‌
ADVERTISEMENT 

ఫ్యూచర్‌ సిటీ మెట్రోకు డీపీఆర్‌

Telangana Sakshi User Sakshi Sakshi Time Apr 12, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
REVIEW-ON-RRR-1.jpg

వెంటనే సిద్ధం చేయాలని సీఎం ఆదేశం 

అనుమతులను వేగవంతం చేయాలని సూచన 

వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్టు 

రహదారులకు భూ సేకరణపై దృష్టి పెట్టండి 

ఆర్‌ఆర్‌ఆర్, రహదారులు, మెట్రోపై సమీక్షలో రేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిపాదిత ఫ్యూచర్‌ సిటీలోని యంగ్‌ ఇండియా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రోరైలు ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి చెందుతోందని, నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్‌ఖాన్‌పేట వరకు పొడిగించాలని సూచించారు. అందు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరారు. 

మెట్రో విస్తరణ, రీజినల్‌ రింగ్‌రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌), జాతీయ రహదారులకు భూ సేకరణపై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించారు. హెచ్‌ఎండీఏతో పాటు ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌ఎస్డీఏ)ని మెట్రో విస్తరణలో భాగస్వాములను చేయాలని సూచించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు సీఎంకు అధికారులు వివరించారు.

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ వరకు (36.8 కి.మీ.), రాయదుర్గం–కోకాపేట నియోపొలిస్‌ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్‌–చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్‌–పటాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ నగర్‌–హయత్‌ నగర్‌ (7.1 కి.మీ.)ల విస్తరణకు రూ.24269 కోట్ల అంచనాలతో చేపట్టే పనులకు కేంద్రంనుంచి వేగంగా అనుమతులు వచ్చేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. 

వందేళ్ల అవసరాలు తీర్చేలా డ్రైపోర్టు 
వందేళ్ల వరకు అవసరాలను తీర్చేలా డ్రైపోర్టును నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రీజినల్‌ రింగురోడ్డు సమీపంలో అందుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించాలని సూచించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి భూ సేకరణ పూర్తి చేయాలని, దక్షిణ భాగానికి సంబంధించి డీపీఆర్‌ను త్వరగా సమర్పించాలని ఆదేశించారు. హైదరాబాద్‌–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి డీపీఆర్‌ రూపొందించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించిన నేపథ్యంలో ఆ పనులపై దృష్టిసారించాలని సీఎం సూచించారు. హైదరాబాద్‌ను ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌తో అనుసంధానించేలా జాతీయ రహదారిని ప్రతిపాదించాలని ఆదేశించారు.

హైదరాబాద్‌ నుంచి మంచిర్యాల వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై సీఎం ఆరా తీశారు. పలుచోట్ల పంటలు ఉన్నాయని, వాటికి నష్టపరిహారం చెల్లించేందుకు జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అంగీకరించడం లేదని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో పంటకాలం దాదాపు పూర్తికావచ్చినందున రైతులతో మాట్లాడి భూ సేకరణ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 

భూ సేకరణ సమస్యలపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు. ఔటర్‌ రింగు రోడ్డు నుంచి రీజినల్‌ రింగు రోడ్డు వరకు రేడియల్‌ రోడ్ల నిర్మాణం, ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్న రహదారుల విస్తరణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఆర్‌ అండ్‌ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రత్యేక కార్యదర్శి హరిచందన, చీఫ్‌ ఇంజనీర్లు తిరుమల, జయభారతి తదితరులు పాల్గొన్నారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
DPR
Revanth Reddy
Telangana
Metro Rail project
Regional Ring Road
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.