Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ప్రవళిక మృతిపై స్పందించిన గవర్నర్‌.. నివేదిక ఇవ్వాలని ఆదేశం
ADVERTISEMENT 

ప్రవళిక మృతిపై స్పందించిన గవర్నర్‌.. నివేదిక ఇవ్వాలని ఆదేశం

Telangana Sakshi User Sakshi Sakshi Time Oct 14, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Governor.jpg

సాక్షి, హైదరాబాద్‌/వరంగల్‌: గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న 23 ఏళ్ల ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని అన్నారు. ఆమె మృతిపట్ల ప్రవళిక తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ఈ విషాద ఘటన నేపథ్యంలో ప్రవళిక ఆత్మహత్యపై 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్‌ జనరల్‌, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి గవర్నర్‌ ఆదేశాలు జారీ చేశారు.

‘గ్రూప్‌ 2 అభ్యర్థి ప్రవళిక అకాల మరణం.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువ ఔత్సాహికులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిళ్లను గుర్తుచేస్తుంది. గ్రూప్‌2కు సన్నద్ధమవుతున్న ప్రవళిక.. ఉద్యోగ పరీక్షల వాయిదా పడటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు నా దృష్టికి వచ్చింది. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దు. విద్యార్థులు దైర్యంగా ఉండండి. నిరుద్యోగులకు అండగా ఉంటాం.  ఆమె ఆత్మహత్యపై 48 గంటల్లో సమగ్ర నివేదిక పంపాలి’ అంటూ తమిళిసై పేర్కొన్నారు.. 

అంతిమయాత్రలో స్పల్ప ఉద్రిక్తత

వరంగల్‌లోని దుగ్గొండి మండలం బిక్కాజిపల్లిలో నిర్వహించిన ప్రవళిక అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేయూ, ఓయూ జేఏసీ విద్యార్థుల ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థి జేఏసీ ప్రతినిధులను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు విద్యార్థుల చొక్కాలు చినిగాయి.

కాగా  గ్రూప్‌–2 పరీక్షలు వాయిదా పడటంతో ఆవేదన చెందిన ప్రవళిక అనే విద్యార్థిని శుక్రవారం రాత్రి  ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వరంగల్‌కు చెందిన ప్రవల్లిక(23) అశోక్‌ నగర్‌లోని బృందావన్‌ గర్ల్స్‌ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్‌–2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన ప్రవల్లిక తానుంటున్న హాస్టల్‌లో  ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. చిక్కడపల్లి ఏసీపీ ఏ.యాదగిరి, ఇన్‌స్పెక్టర్‌ పి.నరేష్‌ వెంటనే అక్కడికి  చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించే సమయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమె సూసైడ్‌ లెటర్‌ బయటపెట్టాలని కోరారు.

తల్లిదండ్రుల కన్నీటి పర్యంతం

గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యతో ఆమె స్వగ్రామం వరంగల్ జిల్లా బిక్కాజిపల్లిలో విషాదం అలుముకుంది. బిడ్డ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. జయ- లింగయ్య దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు కాగా..కూతురు ప్రవళిక ఉన్నత విద్యను అభ్యసించి గ్రూప్-2ప్రిపేర్ కోసం హైదరాబాద్‌ హాస్ట్‌లో ఉంటుంది. 

ప్రవళిక అంతిమయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఓయు, కేయు జేఏసీ ప్రతినిదులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రవళిక ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యా అని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. టీఎస్‌పీఎస్సీ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి కోటి రూపాయల ఎక్సిగ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Pravalika
governor
Tamilisai Soundararajan
Hyderabad
group-2 candidates
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.