Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. రామోజీరావు కబ్జాలపై చర్యలేవీ?
ADVERTISEMENT 

రామోజీరావు కబ్జాలపై చర్యలేవీ?

Telangana Sakshi User Sakshi Sakshi Time Mar 18, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
prakashrao.jpg

కబ్జాల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి రాగద్వేషాలకు పోవద్దు: మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు

కేవలం కొందరిపైనే చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి అప్రతిష్ట

బొమ్మరాసిపేటలో భూకుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

అక్కడ 920 ఎకరాల భూకబ్జా వెనుక మాజీ మంత్రుల హస్తం ఉందని ఆరోపణ

హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): రాష్ట్రంలో కొందరు కబ్జాదారులపై మాత్రమే చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా కబ్జాదారులందరిపైనా చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు కోరారు. రేవంత్‌ సర్కారు హెచ్‌ఎండీఏ పరిధిలోని భూముల కబ్జాదారులపై చర్యలు చేపట్టడాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు. ఫిలింసిటీ పేరుతో ప్రభుత్వ రోడ్డును, పేదల భూములను ఆక్రమించిన రామోజీరావుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేటలోని 920 ఎకరాల భూకబ్జాపై కూడా సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ భూకబ్జా వెనుక మాజీ మంత్రుల హస్తం ఉందని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ దేశోద్దారక భవన్‌లో గోనె ప్రకాశ్‌రావు మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్ర ప్రభుత్వం ధరణి కమిటీ ద్వారా వాస్తవాలను తేల్చి భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మాజీ మంత్రుల సహకారంతో భూకబ్జా..

బొమ్మరాసిపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 323 నుంచి 409 వరకు 1,049 ఎకరాల భూమి ఉందని.. అందులో కొందరు రైతు సంఘం ముసుగులో 920 ఎకరాల భూమిని కబ్జా చేశారని గోనె ప్రకాశ్‌రావు ఆరోపించారు. 1965లో మీర్‌ రెహమత్‌ అలీతోపాటు మరో ఆరుగురి నుంచి మాజీ ఎంపీ దుగ్గిరాల బలరామకృష్ణ ఈ భూమి ని కొనుగోలు చేశారని.. ఆయన వారసులైన దుగ్గిరాల అమరేందర్‌బాబుతోపాటు మరో 20 మంది పేరిట ఆ భూమి రిజిస్టర్‌ అయిందని తెలిపారు.

ఈ భూమి హక్కుదారులు విదేశాలలో స్థిరపడటంతో కొందరు దానిపై కన్నేశారని.. నకిలీ పత్రాలను సృష్టించి మాజీ మంత్రుల సహకారంతో కబ్జాకు పాల్పడ్డారన్నారు.  రైతు సంఘం నేతలు ధర్నాలు చేస్తూ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ కూడా భూకబ్జాదారులకు వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. ఈ భూముల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయాలని.. జిల్లా కలెక్టర్‌ ద్వారా పూర్తి వివరాలు సేకరించి, అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై త్వరలో సీఎం రేవంత్‌ను కలుస్తానని చెప్పారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
land grabbers
Revanth Reddy
Gone Prakash Rao
Ramoji Rao
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.