Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. కొనుడే ‘బంగార’మాయే!
ADVERTISEMENT 

కొనుడే ‘బంగార’మాయే!

Telangana Sakshi User Sakshi Sakshi Time Apr 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gold.jpg

10 గ్రాముల బంగారం రూ.లక్ష దాటడంతో ప్రజల బెంబేలు  

రాష్ట్రవ్యాప్తంగా 50 శాతానికి పైగా తగ్గిన కొనుగోళ్లు 

పెట్టుబడి కోసం నాణేలు, బిస్కట్లు కొంటున్న జనం 

ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ల బంగారానికి గిరాకీ కరువు..  వెలవెలబోతున్నదుకాణాలు.. వ్యాపారుల్లో ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: ఏదైనా వస్తువు ధరలో హెచ్చు తగ్గులు వస్తే వినియోగదారుడు లేదా వ్యాపారిలో ఎవరో ఒకరికి లాభం చేకూరుతుంది. కానీ, బంగారం ధర రూ.లక్ష దాటడం వల్ల అటు కొనుగోలు దారుడు, ఇటు అమ్మకం దారుడు కూడా ఆనందంగా లేకపోవడం గమనార్హం. మంగళవారం 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.లక్షా 2 వేలకు చేరింది.

 గత సంవత్సరం ఇదే సమయంలో రూ.61,000 ఉంది. అంటే ఏడాది కాలంలోనే 62% పెరిగింది. మూడు నెలల క్రితం రూ.80 వేలకు చేరువలో ఉన్న 10 గ్రాముల బంగారం.. 90 రోజుల్లో 20 శాతం పెరిగి రూ.లక్షను దాటింది. దీంతో పెళ్లిళ్ల సీజన్‌ వచ్చినా బంగారం దుకాణాల వద్ద పెద్దగా జనం కనిపించక వెలవెలబోతున్నాయి.

50% తగ్గిన అమ్మకాలు
హైదరాబాద్‌లో ధరలతో సంబంధం లేకుండా బంగారానికి ఎప్పుడూ డిమాండ్‌ ఉండేది. అయితే 10 గ్రాముల ధర రూ.80 వేలు దాటినప్పటి నుంచి కొనుగోళ్లు మందగించాయి. హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో బంగారం దుకాణాల్లో గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 30 నుంచి 50 శాతం వరకు అమ్మకాలు తగ్గినట్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తగ్గుదల 35% దాటిందని జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ అసోసియేషన్‌ ప్రకటించింది.

ఆభరణాల కన్నా ‘ముద్ద’గానే..
బంగారాన్ని ఆభరణాలుగా ధరించడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా ఇష్టం. కానీ, ధర భారీగా పెరగటంతో బంగారాన్ని 22 క్యారట్ల ఆభరణంగా ధరించడం కన్నా భవిష్యత్‌ పెట్టుబడిగా ‘నిల్వ’చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆభరణంగా చేయిస్తే తరువాత ఎప్పుడైనా విక్రయించేటప్పుడు తరుగు, నాణ్యత, వీఏ పేర్లతో దాని విలువను వ్యాపారులు తగ్గించి కొనుగోలు చేస్తారు. 

అదే బిస్కట్, కడ్డీ రూపంలో ఉంటే విలువలో తేడా ఉండదు. బేగంబజార్‌లోని బంగారం దుకాణాల్లో గత కొద్ది రోజులుగా 24 క్యారట్ల 100 గ్రాముల బంగారం బిస్కట్‌లను ఎక్కువగా విక్రయిస్తున్నట్లు ఓ వ్యాపారి ‘సాక్షి’కి తెలిపారు. 10, 20 గ్రాముల బంగారు బిల్లలకు కూడా డిమాండ్‌ ఉందని చెప్పారు. ధరలు అనూహ్యంగా పెరగటంతో ఇళ్లలో ఉన్న బంగారాన్ని కూడా విక్రయించి ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నవారు కూడా ఉన్నట్లు బంగారం వ్యాపారులు చెబుతున్నారు.  

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

వ్యాపారుల్లో ఆందోళన
వివాహాల సీజన్‌లోనూ ప్రజలు పెళ్లిళ్ల బడ్జెట్‌లో బంగారానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో బంగారం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపెద్ద ఆభరణాల దుకాణాలు ఈఎంఐ స్కీమ్‌లు, మేకింగ్‌ చార్జీలపై రాయితీలు, పాత బంగారం మార్పిడి మీద అదనపు బెనిఫిట్స్‌ వంటి ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి బంగారు ఆభరణాల దుకాణాలు తెరిస్తే ధరల పెరుగుదలతో ప్రజలు తమ దుకాణాల వైపే రావడం లేదని పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యాపారి కొమురవెళ్లి వెంకటరమణా చారి ఆందోళన వ్యక్తం చేశారు.

కొనడానికి ఎవరూ రావడం లేదు
10 గ్రాముల బంగా రం ధర రూ.లక్షకు చేరడంతో బేగంబజార్‌తోపాటు రాష్ట్రమంతటా బంగారం వ్యాపారం పడిపో యింది. బంగారం కొనడానికి ఎవరూ రావడం లేదు. మూడు నెలల్లోనే దాదాపు 50 శాతం కన్నా ఎక్కువే అమ్మకాలు తగ్గాయి. అమ్మకాలు సాధా రణ స్థితికి రావడం ఇప్పట్లో కష్టమే.   – కంకర్ల రాకేశ్,బంగారం వ్యాపారి, బేగంబజార్‌

ఖాళీగా కూర్చుంటున్నాం 
బంగారం ధరలు పెరగడంతో గిరాకీ తగ్గింది. పెళ్లిళ్లు, శుభ కార్యాలయాలకు కూడా ఆభరణాలు చేయించుకోవడానికి జనం రావడం లేదు. కరీంనగర్‌లో ఎప్పుడూ కళకళలాడే ఆభరణాల దుకాణాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. 22 క్యారట్ల ఆభరణాల కొనుగోళ్లు తగ్గడం బంగారు పరిశ్రమ మీద ఆధారపడ్డ వారిని అంధకారంలోకి నెడుతోంది.  – ఈశ్వరోజు వెంకటేశ్వర్లు,రాఘవేంద్ర జ్యువెల్లర్స్, కరీంనగర్‌ 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Telangana
Gold
Wedding season
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.