Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. బల్దియాలో అంతే!.. మధ్యాహ్నం 12 గంటలైనా విధులకు రాని సిబ్బంది
ADVERTISEMENT 

బల్దియాలో అంతే!.. మధ్యాహ్నం 12 గంటలైనా విధులకు రాని సిబ్బంది

Telangana Sakshi User Sakshi Sakshi Time Aug 8, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
985.jpg

మధ్యాహ్నం 12 గంటలైనా విధులకు రాని సిబ్బంది

 మేయర్‌ ఆకస్మిక తనిఖీల్లో వెల్లడి 

 టైమ్‌కు రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక  

సాక్షి,హైదరాబాద్‌: 

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం... 
బుధవారం ఉదయం 10.35 గంటలు

⇒ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఒకటో అంతస్తులోని ఒక కార్యాలయంలోకి వెళ్లారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారో చూశారు. అవాక్కయ్యారు. 20 మందికి పైగా ఉండాల్సిన సెక్షన్‌లో ఐదుగురే ఉన్నారు. మిగతా వారేరీ? అంటే..ఇంకా రాలేదు అనే సమాధానం వచి్చంది.

⇒  అలాగే ఒక్కో కార్యాలయం చూసుకుంటూ ఒక అంతస్తు తర్వాత మరో అంతస్తుకు జీహెచ్‌ఎంసీలో వివిధ విభాగాలున్న ఆరంతస్తుల వరకు వెళ్లారు. అన్ని చోట్లా దాదాపుగా అవే సీన్లు. ఉద్యోగులు 10.30 గంటలకే కార్యాలయాల్లో ఉండాల్సి ఉండగా, 11 గంటలు దాటినా లేరు. 11.30 గంటలవుతున్నా పూర్తిస్థాయిలో లేరు.  

⇒   అప్పుడే వస్తున్నవారిని చూసి ఆఫీస్‌ టైమెప్పుడు? ఎప్పుడు వస్తున్నారంటే ఆలస్యమైందంటూ తడబడుతూ సమాధానమిచ్చారు. మ. 12 గంటలైనా ఇంకా వస్తున్న వారున్నా రు. ఆ తర్వాత వచి్చన వారు సైతం ఉన్నారు. మేయర్‌ ఆకస్మిక విషయం ఒక్కసారిగా గుప్పుమనడంతో చాలామంది హడావుడిగా వచ్చారు. అన్ని విభాగాల్లో దాదాపుగా ఇవే పరిస్థితులుండటంతో మేయర్‌ మండిపడ్డారు.  

⇒  ప్రజాప్రభుత్వంలో ఇలా ఉంటే నడవదని, ‘ఉండాలనుకుంటే ఉండొచ్చు..లేకుంటే వెళ్లిపోవచ్చు’ అని  సీరియస్‌ అయ్యారు. రేపట్నుంచి 10.35 గంటల వరకు మాత్రం హాజరు రిజిస్టర్లు కార్యాలయాల్లో ఉంచి, 10.40 గంటలకు తన కార్యాలయానికి పంపించాల్సిందిగా అధికారులకు సూచించారు. రాని వారికి మెమోలు జారీ చేయాల్సిందిగా అడిషనల్‌ కమిషనర్‌ (పరిపాలన) నళిని పద్మావతికి సూచించారు.

‘ఫేస్‌ రికగ్నిషన్‌’ అమలు చేస్తాం.. 
తనిఖీల అనంతరం మేయర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ, క్రమశిక్షణ, సమయపాలన పాటించని వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమయానికి రానివారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులపై హెచ్‌ఓడీల పర్యవేక్షణ ఉండాలన్నారు. పలు విభాగాల్లో ఉద్యోగులు ఆలస్యంగా వస్తూ, సాయంత్రం 4 గంటలకే వెళ్తున్నట్లు తన దృష్టికి రావడంతోపాటు పలు ఫిర్యాదులందడంతో ఈ తనిఖీ నిర్వహించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఫేస్‌ రికగి్నషన్‌ అటెండెన్స్‌ను కూడా అమల్లోకి తెచ్చే ఆలోచన ఉందన్నారు.  

ఇది ఇక్కడ మామూలే.. 
మేయర్‌ తనకీ విషయం ఇప్పుడే తెలిసినట్లు చెప్పినప్పటికీ, బల్దియాలో అది సాధారణ తంతు. అందుకే ఒకసారి బల్దియాలో చేరిన వారు బదిలీలైనా పోకపోవడానికున్న కారణాల్లో ఇదీ ఒకటి. బల్దియా వ్యవహారాల గురించి బాగా తెలిసిన వారి సమాచారం మేరకు, మధ్యాహ్నం 12 గంటలైనా చాలామంది విధులకు రారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ‘లంచ్‌ టైమ్‌’ మొదలవుతుంది. బల్దియాలో సాధారణ లంచ్‌బ్రేక్‌ అంటూ లేదు. ఎవరిష్టం వారిది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ అది నడుస్తుంటుంది. 4 గంటలు దాటాక ఇళ్లకు తిరుగుముఖం ప్రారంభమవుతుంది. పై ఆదాయం వచ్చే వారు మాత్రం సీట్లలో సాయంత్రం 5.30 గంటలు దాటినా ఉంటారు. ఇక, కార్యాలయాల్లో ఉండేవారిలో సైతం అందరూ పనులు చేస్తున్నారని చెప్పలేం. కొందరు కంప్యూటర్లలో గేమ్స్‌ ఆడుతుంటారు. కొందరు ఎక్కువ సమయంలో ఫోన్లలో యూట్యూబ్‌ చిత్రాలు చూస్తుంటారు. బల్దియాలోని వైఫై సదుపాయంతో నిరి్వరామంగా ఫోన్లు, కంప్యూటర్లతో కాలం గడుపుతారు. అలాగని అంకితభావంతో పనిచేస్తున్నవారు లేరని చెప్పలేం. కాకపోతే వారి సంఖ్య స్వల్పం. ఉదయం సమయానికే వచ్చి పొద్దుపోయేంత వరకు తలమునకలుగా పనులు చేసే వారూ ఉన్నారు. అలాంటి వారివల్లే బల్దియా బతుకుతోంది.  

నిజంగా చర్యలుంటాయా ? 
మేయర్‌ హెచ్చరికల్ని ఎవరైనా ఖాతరు చేస్తారా అన్నది అనుమానమే. గతంలో ఆహార కల్తీ తనిఖీలకు సంబంధించి ఏ రోజు ఎన్ని తనిఖీలు జరిపారో, ఏం చర్యలు తీసుకున్నారో ఏ రోజుకారోజు సాయంత్రం తనకు నివేదికలు పంపాలని ఆదేశించారు. అది ఏమాత్రం అమలవుతుందో సంబంధిత విభాగానికి, మేయర్‌ కార్యాలయానికే తెలియాలి.  

బయోమెట్రిక్‌ ఉత్తుత్తిదేనా ? 
కారి్మకులతోపాటు కమిషనర్‌ దాకా బయోమెట్రిక్‌ హాజరు వేయాలని గతంలో చెప్పారు. ఒకరిద్దరు కమిషనర్లు సైతం దాన్ని పాటించారు. కనీసం ఉద్యోగులైనా బయోమెట్రిక్‌ హాజరును వినియోగిస్తున్నారో, లేదో తెలియని పరిస్థితి మేయర్‌ తనిఖీతో వెల్లడైంది. నిజంగా వినియోగిస్తే అంత ఆలస్యంగా ఎందుకు వస్తారు? ఒకవేళ ఆలస్యంగా వచ్చినా వారికి పూర్తి జీతాలెందుకు చెల్లిస్తున్నారు? అన్నవాటికి సంబంధిత అధికారులే సమాధానం చెప్పాలి. కొన్ని సీట్లు ఖాళీగా ఉండటం తనిఖీలో గుర్తించిన 
మేయర్‌..ఆ సీట్లు ఎవరివి అంటే వారి పేర్లు కూడా సహచరులు చెప్పలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొన్ని సెక్షన్లలో నాలుగైదు రోజులకోమారు వచ్చి ఒకేసారి అన్ని రోజులకూ సంతకాలు పెట్టుకుంటారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఇక బయోమెట్రిక్‌ ఎందుకు..దాని నిర్వహణకు లక్షలాది రూపాయల వ్యయమెందుకు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  

జోన్లు..సర్కిళ్లలో.. 
ప్రధాన కార్యాలయంలో పరిస్థితి ఇలా ఉంటే జోన్లు, సర్కిళ్లలోనూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ ఇంకో సదుపాయం కూడా ఉంది. లేని వారి గురించి సంబంధిత సెక్షన్లలో అడిగితే  ప్రధాన కార్యాలయానికి పనిమీద వెళ్లారని టక్కున సమాధానం చెబుతారు.  

సర్క్యులర్‌ జారీ 
మేయర్‌ ఆదేశాల నేపథ్యంలో చర్యలకు సిద్ధమైన సంబంధిత అడిషనల్‌ కమిషనర్‌ (పరిపాలన) నళిని పద్మావతి ఆ మేరకు సర్క్యులర్‌ జారీ చేశారు. ఉద్యోగులంతా కార్యాలయ వేళల మేరకు ఉదయం 10.30 గంటలకల్లా హాజరు కావాలి. పది నిమిషాల గ్రేస్‌ సమయం మాత్రం ఉంటుంది. అంటే 10.40 గంటల వరకు మినహాయింపు ఇస్తారు. జిల్లా ఆఫీస్‌ మాన్యువల్‌ మేరకు మూడు పర్యాయాలు అంతకంటే ఆలస్యంగా వస్తే ఒక సీఎల్‌గా పరిగణిస్తారు. తరచూ ఆలస్యంగా హాజరయ్యే వారిపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.  
 

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
mayor
Vijayalakshmi
ghmc
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.