Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. Hyderabad:‘ఇంటెలిజెన్స్‌’తో లోపాలకు చెక్‌! 360 డిగ్రీ వ్యూతో పరిశీలన
ADVERTISEMENT 

Hyderabad:‘ఇంటెలిజెన్స్‌’తో లోపాలకు చెక్‌! 360 డిగ్రీ వ్యూతో పరిశీలన

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 28, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ghmc-property-tax.jpg

జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను అసెస్‌మెంట్లలో.. పన్నుల విధింపులో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండేందుకు అధికారులు దృష్టి సారించారు. వివిధ స్థాయిల్లో ఆస్తిపన్ను విషయంలో తలెత్తుతున్న లోపాలను సవరించి సక్రమంగా పన్నులు రాబట్టాలని, డిఫాల్టర్లను గుర్తించి జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఇందుకోసం  ‘అనలిటిక్స్‌ ఇంటెలిజెన్స్‌ సొల్యూషన్‌’ను అనుసరించాలని భావిస్తున్నారు. 

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను అసెస్‌మెంట్లలో.. పన్నుల విధింపులో వింతలెన్నో. ఒకే ప్రాంతంలో ఒకే విస్తీర్ణంలో ఉన్న భవనాలకే ఒక భవనానికి  రూ.12 వేల ఆస్తిపన్ను ఉంటే...ఇంకో భవనానికి రూ.7 వేలే ఉంటుంది. కొందరు యజమానులకు ఒక్క ఏడాది ఆస్తిపన్ను బకాయి ఉంటేనే చెల్లించేంతదాకా ఒత్తిడి  తెచ్చే సిబ్బంది, కొందరు ఏళ్ల తరబడి చెల్లించకున్నా పట్టించుకోరు. భవనం ప్లింత్‌ ఏరియాకు.. ఆస్తిపన్ను విధించే ఏరియాకు పొంతన ఉండదు. వాణిజ్య ప్రాంతాల్లో వాణిజ్య భవనాలుగా కొనసాగుతున్న వాటికి సైతం నివాస భవన ఆస్తిపన్ను మాత్రమే ఉంటుంది.

అంతేకాదు.. పక్కపక్కనే ఉన్న ఇళ్లకైనా సరే కొందరికి ఆస్తిపన్ను చదరపు మీటరుకు రూ.3 ఉంటే.. కొందరికి రూపాయికన్నా తక్కువే ఉంటుంది.  ఇలాంటి వాటితో జీహెచ్‌ఎంసీ ఖజానాకు వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్ను రావడం లేదని గుర్తించిన అధికారులు ఆదాయానికి ఎక్కడ గండి పడుతుందో గుర్తించాలనుకున్నారు.  అవకతవకలకు చెక్‌ పెట్టేందుకు ఆన్‌లైన సంబంధిత ‘అనలిటిక్స్‌ ఇంటెలిజెన్స్‌ సొల్యూషన్‌’ను అనుసరించాలని నిర్ణయించారు. తద్వారా లోపాలెక్కడున్నాయో గుర్తించి సరిదిద్దాలని భావించారు. అందుకు గాను ప్రతిష్టాత్మక ఐటీ సంస్ధ నుంచి ‘ప్రాపర్టీటాక్స్‌  ఇంటెలిజెన్స్‌ సిస్టమ్‌’ను సమకూర్చుకోవడంతోపాటు మూడేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలు సైతం అప్పగించాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు సైతం ఈ సిస్టమ్‌ను వినియోగించడంలో శిక్షణ ఇవ్వనున్నారు. 

అసెస్‌మెంట్‌ లోపాలకు చెక్‌.. 

► ఈ ఇంటెలిజెన్స్‌ ద్వారా, ముఖ్యంగా తక్కువ ఆస్తిపన్ను మాత్రమే ఉన్న భవనాలను గుర్తించి టాక్స్‌ అసెస్‌మెంట్‌లోనే తక్కువగా ఉంటే సరిచేస్తారు.  

► భారీ మొత్తంలో బకాయిలున్నవారిని గుర్తించి వసూళ్ల చర్యలు చేపడతారు. అసెస్‌మెంట్‌ కాని భవనాలెన్ని ఉన్నాయో గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు.   

► ఆస్తిపన్ను బకాయిదారులను గుర్తించడంలో ఏయే ప్రాంతాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారో వంటి వివరాలను సైతం తెలుసుకుంటారు. తద్వారా టాక్స్‌సెక్షన్‌ సిబ్బంది  ప్రమేయాన్ని సైతం తెలుసుకునే వీలుంటుందని సమాచారం.  

► రిజిస్ట్రేషన్, వాణిజ్యపన్నులశాఖ, తదితర  ప్రభుత్వశాఖల నుంచి సేకరించే సమాచారంతోనూ భవన వాస్తవ విస్తీర్ణాన్ని,  వినియోగాన్ని గుర్తించి వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్నును విధిస్తారు.  

► 360 డిగ్రీ వ్యూతో భవనాన్ని అన్నివిధాలుగా పరిశీలించి రావాల్సిన ఆస్తిపన్ను వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతారు. అంతేకాదు..రావాల్సిన ఆస్తిపన్నును ముందస్తుగా అంచనా వేసి..అందుకనుగుణంగా జీహెచ్‌ఎంసీ  ఖర్చులకు ప్రణాళిక తయారు చేసుకుంటారు.  

► ఈ సిస్టమ్‌ డెవలప్‌ ఆయ్యాక ఆస్తిపన్నుకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలనుకున్నా వెంటనే పొందే వీలుంటుంది.  

► ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ)ని సంప్రదించాల్సి వస్తోంది. తమకు ఏ విధమైన వివరాలు కావాలో చెబితే.. తర్వాత ఎన్నో రోజులకు కానీ అది సమకూరడం లేదు. ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయి.  

► ఆస్తిపన్ను డిమాండ్, వసూళ్లను సైతం ప్రాంతాలవారీగా లెక్కించి తక్కువ వసూలవుతున్న ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకుంటారు.  

► ఆయా ప్రాంతాల్లో అత్యధికంగా ఆస్తిపన్ను చెల్లించే యజమానులను గుర్తించడంతోపాటు వారు   మూడేళ్లుగా చెల్లించిన ఆస్తిపన్ను వివరాలను కూ డా బేరీజు వేస్తారు. ప్రత్యేక డ్యాష్‌బోర్డులు  విని యోగించి  భవనయజమానుల్లో డిఫాల్టర్లను కూ డా గుర్తించి  అవసరమైన చర్యలు చేపడతారు.  

భవన వినియోగం తెలుస్తుంది.. 

ఖైరతాబాద్‌లోని ఒక వాణిజ్యప్రాంతంలో 90 శాతం వాణిజ్య భవనాలు కళ్లముందు కనబడుతున్నా జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్నురికార్డుల్లో మాత్రం వాణిజ్య భవనాలు 50 శాతానికి మించి లేవు.మిగతావన్నీ నివాసభవనాలుగా రికార్డుల్లో నమోదయ్యాయి. తద్వారా జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్నుకు గండి పడుతోంది.  ఇలాంటి అవకతవకలు సైతం ఈ సిస్టమ్‌ద్వారా వెల్లడవుతాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించి ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ ఎక్కువ ఆదాయం పొందేందుకు ప్రాపరీ్టట్యాక్స్‌ ఇంటెలిజెన్స్‌ సిస్టమ్‌ను వినియోగించనున్నారు. దీని ద్వారా పరిపాలనపరంగా పర్యవేక్షణ సైతం  సులభం కానుందని అధికారులు పేర్కొన్నారు.

చదవండి: కరోనా కేసుల్లేవ్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
ghmc
Property tax
Hyderabad
Intelligence
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.