సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల గౌర ఏరోస్పేస్లో ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంపెనీ లోపల పేలుడు పదార్థాలు పేలడంతో పెద్దగా శబ్ధం వచ్చింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే యత్నం చేస్తున్నాయి. ప్రమాదసమయంలో కంపెనీ లోపల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అక్కడి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT